అబుల్ ఇర్ఫాన్
షేక్ అబుల్ ఇర్ఫాన్ | |
---|---|
జననం | షేక్ అబుల్ ఇర్ఫాన్ 15 జూన్, 1945 తొండపి, సత్తెనపల్లి మండలం |
నివాస ప్రాంతం | సైదాబాదు, హైదరాబాదు |
ఇతర పేర్లు | అబుల్ ఇర్ఫాన్ |
వృత్తి | క్లర్క్, జర్నలిస్టు, రచయిత |
ఉద్యోగం | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇరిగేషన్ శాఖ, గీటురాయి |
ప్రసిద్ధి | ఇస్లామిక్ రచయిత |
మతం | ఇస్లాం |
పిల్లలు | ఆరుగురు పిల్లలు |
తండ్రి | బుడె సాహిబ్ |
తల్లి | రమీజాబీ |
వెబ్‌సైటు | |
ఇస్లామిక్ రిసోర్స్ సెంట్‌ర్ జాలస్థలి |
నిర్మాణాలు |
ప్రఖ్యాత వ్యక్తులు |
ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి · అక్బర్ |
కమ్యూనిటీలు |
ఉత్తరభారత · మాప్పిళాలు · తమిళ ముస్లింలు |
న్యాయ పాఠశాలలు |
విశ్వాస పాఠశాలలు |
బరేల్వీ · దేవ్‌బందీ · షియా · అహ్‌లె హదీస్ |
భారత్‌లో మస్జిద్‌లు |
సంస్కృతి |
ఇతర విషయాలు |
దక్షిణాసియాలో అహ్‌లె సున్నత్ ఉద్యమం |
అబుల్ ఇర్ఫాన్గా సుపరిచుతులైన షేక్ అబుల్ ఇర్ఫాన్ పాత్రికేయులుగా జీవితాన్ని అరంభించి ప్రస్తుతం రచయితగా ఇస్లాం మతం, సంస్కృతి, సాంప్రదాయలని, సాహిత్యాన్ని తెలుగులోకి అనేక పుస్తకాల ద్వార జనబాహుళ్యానికి పరిచయం చేస్తున్నారు. వీరు ఇస్లామిక్ రిసోర్స్ సెంటర్ వ్యవస్థాపక చైర్మెన్. ఈ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఇస్లాంపై సరళమైన తెలుగులో ఇరవైఐదుకి పైగా పుస్తాకాలను ప్రచురించారు. దీనికి పూర్వం గీటురాయి వారపత్రికలో ఉప సంపాదకులుగా చేరి సంపాదకులుగా పదోన్నతి చెందారు. ఇర్ఫాన్ ప్రభోదిని మాస పత్రికలో కూడా వ్యాసాలు ప్రచురించారు.
వ్యక్తిగత జీవితం
[మార్చు]బుడె సాహిబ్, రమీజాబీ లకు షేక్ మెహబూబ్ సుభానిగా మూడవ సంతానంగా 15 జూన్, 1945 నాడు జన్మించారు షేక్ అబుల్ ఇర్ఫాన్. ఈయన పుట్టిన స్థలం అప్పటి సత్తెనపల్లి మండలంలోని తొండపి గ్రామం.
రచనలు
[మార్చు]అబుల్ ఇర్ఫాన్, ఖురాన్ భావామృతం పేరుతో కురాన్ను వాడుక తెలుగు భాషలో అనువదించారు. హైదరాబాద్ లోనిచత్తాబజార్లో ఇస్లామిక్ రిసోర్స్ సెంటర్ స్థాపించి తెలుగులో ఇస్లామిక్ సాహిత్యం ముద్రిస్తున్నారు.
రచనలు, అనువాదాల జాబితా
[మార్చు]- ఖురాన్ భావామృతం [1]
- ఖురాన్ భావామృతం
- ఫుర్ఖాన్ భావామృతం
- హదీస్ హితోక్తులు
- ముహమ్మద్ ఆదర్శజీవితం
- కాబా సందేశం
- రమజాన్ ఆశయాలు
- పరలోక ప్రస్థానం
- శాంతి సమరం న్యాయం
- ధనవికేంద్రీకరణ
- మసీహ్ మౌవూద్
- ముస్లిం మహిళ
- దాంపత్య జీవితం
- ఇస్లాం బోధనలు
- సువర్ణసూక్తులు
- ఆత్మకథ
- పరీక్షా ప్రపంచం
- ఏకదైవారాధన
- ఇస్లాం పిలుపు
- విశ్వాసి గుణగణాలు
- సమైక్యతా సోదర భావాలు
- ప్రళయ సంకేతాలు
- నీతికి నెలవు నమాజ్
- అంతిమ దైవగ్రంధం
- దాసుల హక్కులు
- ఘోర పాపాలు
- దైవ ప్రవక్త వైద్య విధానం
- ధరణి తారలు
- ఇస్లాం చరిత్ర
మూలాలు
[మార్చు]- ↑ "ఖురాన్ భావమృతం స్వేచ్ఛా నకలు ప్రతి". Archived from the original on 2013-08-01. Retrieved 2013-08-21.
బయటి లంకెలు
[మార్చు]ఇవీ చూడండి
[మార్చు]- http://www.islamic-resource-centre.org/irc-publication.html Archived 2013-09-06 at the Wayback Machine
బాహ్య లింకులు
[మార్చు]- [1] Archived 2013-09-06 at the Wayback Machine