Jump to content

క్రియలు (శుద్ధిపరచు పద్ధతులు)

వికీపీడియా నుండి

హతయెగమందు ఈ యెగ ప్రక్రియలు వివరించబడినవి. ప్రధాన క్రియలు - ఘట శోధన ప్రక్రియలు : ఘటము అనగా శరీరము. శరీరమును శుద్ధి పరచు ఆరు పద్ధతులు (షట్క్రియలు)

ముఖ్య గమనిక: ఈ పద్ధతులను అనుభవముగల యొగ గురువుల వద్ద చూచి నేర్చుకొనవలెను. కేవలము చదివి ప్రయత్నము చేయవద్దు.

  • 'ధౌతి నేతి బస్తి నౌలి త్రాటకం తదా కపాలభాతి,ఏతాని షట్కర్మాణి ప్రచక్సతె' -

1. ధౌతి : అనగా శరీరములోని అన్తర భాగములను కడుగుట. (నీరుతొ గాని, వాయువుతొ గాని, పలుచని కిచిడీతొగాని, మెత్తటి నూలు వస్త్రముతొ గాని నొటి ద్వారమునుండి ఉదరము వరకు శుద్ధ్ది చేయట.) ధౌతి వలన కఫదొషములు తొలగును.జీర్ణాశయము బాగుగా పనిచేయును.ఆస్త్మావ్యాధి తగ్గు అవకాశము కలదు

2. నేతి : అనగా నాసిక రంద్రములను నీటితొ గాని, పాలతొ గాని, సూత్రముతొ గాని కడుగుట. (నేతి - జలనేతి, సూత్రనేతి, దుగ్ధనేతి, ఘృతనేతి - అని నాలుగు విధములు.) నేతి క్రియ వలన శ్వాస సంబంధిత రొగములు, జలుబు రొగములు, తలబరువు తగ్గును.

3 .బస్తి ; యెనీమా ప్రక్రియ .బస్తి ; యెనీమా ప్రక్రియ వలన మలబద్దకము, మూలవ్యాధి తొలగును. రాబొవు రాచ వ్యాధులు ( కేన్షర్ వ్యది) రావు.

4. నౌలి: దక్షిణ, మధ్య,వామ అని మూడు విధములు. నౌలి ప్రక్రియ వలన విషపూరితమగు ఆహారము కూడా జీర్ణమగును. శాస్త్రము ప్రకారము మరణము రాదు.

5. త్రాటకము: అనగా ఏకాగ్రత . దీపములో గాని, ఉదయించు సూర్య చంద్రుల వేపు గాని ద్రిష్టిని నిలుపుట. త్రాటకము వలన ఏకాగ్రత పెరుగును. అన్త్రర్గత శక్తులు బయిటకు వఛ్చును.

6. కపాలభాతి :కపాలము అనగా తల భాగము.వాయువును నాసాగ్రముల ద్వారా వేగముగా బైటకు పదే పదే వదలుట. కపాలభాతి వలన శిరస్సు లోని భాగములు శుభ్రమగును.కంటికి, చెవులకు, ముక్కునకు, మెదడుకు ఛాల మంఛిది.

ఈ క్రియల వలన చాల శారీరక మానసిక లాభములు ఉన్నాయి. ఈ క్రియలను సుర్యొదయమునకు ముందుగా చేయుట మంచిది.

కొన్ని సామాన్య క్రియలు

[మార్చు]

అనునాసిక శ్వాసము

[మార్చు]
  • పూర్తిగా ఉచ్ఛ్వసింపుము. నాసిక ద్వారా శ్వాసించి, కొన్ని సెకనులు ఊపిరిని బంధించుము.
  • ఊపిరితిత్తులు పూర్తిగా ఖాళీయగునంతవరకు కొద్ది కొద్దిగా గాలిని నాసిక ద్వారా వదలాలి. ఇట్లు 5 మార్లు చేయుము.
  • కుడిచేతి బ్రొటనవేలు నుపయోగించి, కుడి నాసికను మూయుము. ఊపిరి పీల్చి, కొన్ని సెకనులు అట్లే ఉండి, తర్వాత కొద్ది కొద్దిగా ఊపిరి వదలాలి. ఇట్లు పలుమార్లు చేయుము.
  • పిమ్మట వామ నాసికను కుడిచ్రేతి ఉంగరపు వేలుతోను, చిటికెన వ్రేలుతోను మూయుము. మరల పైన చెప్పిన విధముగా పలుమారిట్లు చేయుము.
  • చివరగా, పై విధానము నంతయును రెండు నాసికల నుపయోగించి మరల పలుమార్లు చేయుము.
  • ఈ విధమైన శ్వాసోచ్ఛ్వాసములు శ్వాసకోస మార్గములను, సైనస్‌ల మార్గములను శుద్ధిపరచును.

శ్వాన శ్వాసము

[మార్చు]
  • నోటిని తెరచి, నాలుకను బయటకు చాపి, కొంచము ముందుకు నిలబడి వంగి, శీఘ్రముగ నోటితో శ్వాసోచ్ఛ్వాసములను జరుపుము. ఇట్లు పలు మార్లు చేయుము.
  • ఇది శరీరము లోని బొగ్గుపులుసు వాయువును త్వరితముగ తగ్గించుటకు తోడ్పడును.

ముఖ భస్త్రిక

[మార్చు]
  • కాలి మడమలను కలిపి, మోకాళ్ళపై తిన్నగా కూర్చొనుము.
  • ఊపిరిని పూరింపుము. ఆ గాలిని కొంచము కొంచముగా, వరుసగా, నోటిద్వారా వదలునపుడు (పెదవులను ఈల వేయబోతున్నట్లుగా దగ్గరికి చేర్చి) ముందుకు వంగి మోకాళ్ళకు ముందువైపున తల నేలకు తాకునట్లుగా నుంచుము. అట్లు గాలిని వదులుట ఉదర కండరముల సహాయంతో జరుగును.
  • నెమ్మదిగా గాలిని పీల్చుచు పైకి లెమ్ము.
  • అనేక మార్లిట్లు చేయుము.
  • శరీరములోని బొగ్గుపులుసు వాయువును తగ్గించుటయే ముఖ భస్త్రిక యొక్క ప్రయోజనము.

ముఖధౌతి

[మార్చు]
  • పూర్తిగా గాలిని పీల్చుము. నోటి ద్వారా వేగముగా వెంట వెంటనే తీవ్రముగా గాలిని వదులుము.
  • ఈ పద్ధతులు శ్వాసకోస ద్వారములను,, శరీరము లోని అన్ని క్రియలను శుద్ధి పరుచును.

ప్రధాన క్రియలు

[మార్చు]

శరీరమును శుద్ధి పరచు ఆరు పద్ధతులు (షట్క్రియలు) ఏవనగా - కపాలభాతి, నేతి, ధౌతి, నౌలి, త్రాటకము, బస్తి.

కపాలభాతి

[మార్చు]
  • పద్మాసనములో సుఖముగా కూర్చొనుము.
  • ఉదర కండరములను ఉపయోగించి బలముగా ఉచ్ఛ్వసింపుము.
  • ఉదర కండరములను వదులు పరచుచు ఊపిరిని అప్రయత్నముగా పూరింపుము.
  • నిమిషముకు 60 పర్యాయములతో నారంభించి, క్రమముగా 120 వరకు పెంచుము. సాధ్యమైనంత వేగముగా తిరిగి చేయుము.
  • ఊపిరిని బిగ పట్టరాదు.
  • ఉదరమును లోనికి, పైకి కదుల్చుట ద్వారా బలమైన, వేగమైన ఉచ్ఛ్వాసములు, సాధారణ, ప్రయత్న రాహిత్య పూరకములు జరుగును. ఒక నిమిషము తర్వాత ఊపిరి స్వతహాగ ఆగిపోవును. దీని నంటిపెట్టుకొనియున్న మానసిక ప్రసాంతి ననుభవింపుము.
  • ఈ క్రియ రక్తములోని బొగ్గు పులుసు వాయువుని తొలగించును. మొదడు లోని కణములను ఉత్తేజ పరచును. వాయుద్వారములను శుద్ధి పరచును. ఉదరావయములను చైతన్యపరచును.

నేతి

[మార్చు]

నేతి - జలనేతి, సూత్రనేతి, దుగ్ధనేతి, ఘృతనేతి - అని నాలుగు విధములు.

జలనేతి

[మార్చు]

సూత్రనేతి

[మార్చు]

దుగ్ధనేతి

[మార్చు]

ఘృతనేతి

[మార్చు]

ధౌతి

[మార్చు]

నౌలి

[మార్చు]

త్రాటకము

[మార్చు]

ఇతర క్రియలు

[మార్చు]

విపరీత కరణి క్రియ

[మార్చు]

శంఖ ప్రక్షాళన క్రియ

[మార్చు]