కేరళ డెమోక్రటిక్ పార్టీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కేరళ డెమోక్రటిక్ పార్టీ


కేరళ డెమోక్రటిక్ పార్టీ[1][2] (నేషనలిస్ట్ కాంగ్రెస్ కేరళ, డెమోక్రటిక్ కాంగ్రెస్ కేరళ)[3] అనేది కేరళలోని రాజకీయ పార్టీ. ఇది కేరళలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీలిక తర్వాత ఏర్పడింది. దీనికి మణి సి.కప్పన్‌ నాయకత్వం వహిస్తున్నాడు.[4][5]

ఏర్పాటు

[మార్చు]

మణి సి. కప్పన్, అతని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కేరళలో అధికార లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ కూటమిలో భాగంగా ఉన్నాయి. కప్పన్ సిట్టింగ్ స్థానాన్ని కేరళ కాంగ్రెస్ (ఎం) కి ఇవ్వాలని ఎల్‌డిఎఫ్ యోచిస్తున్నట్లు పుకార్లు రావడంతో, కప్పన్ కూటమిని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నారు. తనకు పార్టీ నాయకత్వం మద్దతు ఉందని, ఎల్‌డిఎఫ్‌ని వీడి యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్‌లో చేరాలని పార్టీ యోచిస్తోందని ఆయన మొదట పేర్కొన్నారు. అయితే, పార్టీ రాష్ట్ర, జాతీయ నాయకత్వం ఎల్‌డిఎఫ్‌తో కొనసాగాలని నిర్ణయించుకుంది, అందుకే కప్పన్ 2021 ఫిబ్రవరిలో కొత్త పార్టీని తేలాలని నిర్ణయించుకున్నారు.[6]

ఎన్నికల విజయం

[మార్చు]

పాల నియోజక వర్గంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ కేరళ (ప్రస్తుతం కేరళ డెమోక్రటిక్ పార్టీ అని పిలుస్తారు) అభ్యర్థి మణి సి. కప్పన్ తన ప్రత్యర్థి, కేరళ కాంగ్రెస్ (ఎం) కి చెందిన జోస్ కె మణిపై 15,378 ఓట్ల తేడాతో విజయాన్ని సాధించారు.

మూలాలు

[మార్చు]
  1. https://keralakaumudi.com/news/mobile/news.phpid=1000633&u=local-news-kottayam[permanent dead link]
  2. https://www.madhyamam.com/kerala/mani-c-cappan-kerala-democratic-party-1125234
  3. "മാണി സി. കാപ്പന്റെ പാർട്ടി ഇനി ഡെമോക്രാറ്റിക് കോൺഗ്രസ് കേരള". Archived from the original on 2021-11-15. Retrieved 2024-06-08.
  4. Mani C Kappan announces new party 'NCK' | Mani C Kappan new party| NCK party| Mani C Kappan NCK
  5. Kappan announces new party, names it Nationalist Congress Kerala
  6. "Kappan forms Nationalist Congress Kerala". The Hindu. 22 February 2021.