Jump to content

ఎన్నీల ముచ్చట్లు

వికీపీడియా నుండి

తెలుగు సాహిత్య చరిత్రలో ఒక నూతన అధ్యాయం ఈ ఎన్నీల ముచ్చట్లు. కాళోజీ నారాయణరావు మిత్ర మండలి వరంగల్లో నెల నెలా నిర్వహించిన సాహిత్య కార్యక్రమం దీనికి స్ఫూర్తి. కొత్త సాహితీ గొంతుకలకు వేదికనిస్తున్న కార్యక్రమం. నెల నెలా పున్నమికి కరీంనగర్ జిల్లాలో కవిత్వ పండుగ. ఎన్నీల కవితా గానాన్ని ప్రతి నెలా పౌర్ణమి రోజున తెలంగాణ రచయితల వేదిక, కరీంనగర్ జిల్లా శాఖ క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నది. కవితా సంకలనాలను సాహితీ సోపతి ప్రచురిస్తున్నది.

అవతరణ

[మార్చు]

21 ఆగస్టు 2013 పౌర్ణమి రోజున అన్నవరం దేవేందర్‌ ఇంటి డాబా పైన మొదటి ఎన్నీల ముచ్చట్లు ఆరంభమైనాయి.[1][2] సాగి పోవుటే బతుకు ఆగిపోవుటే చావు అని ప్రజా కవి కాళోజీ అన్నట్లు ఈ కార్యక్రమం గత 109 నెలలుగా నిరాతంగంగా కొనసాగుతున్నది. ఎన్నో సాహితీ సంస్థలకు ప్రేరణగా నిలుస్తున్నది.

ప్రత్యేకతలు

[మార్చు]

ప్రతి నిత్యం జరిగే సాహితీ ఇది భిన్నమైనది. ఇందులో వేదికలు ఉండవు. ఊకదంపుడు ఉపన్యాసాలు అసలే ఉండవు. కవుల మధ్య కొత్త పాత తారతమ్యాలు కనిపించవు. చిన్నాపెద్ద తేడా లేకుండా అందరూ గుండ్రంగా తట్టు మీదనే కూర్చుంటారు. కొత్తగా వచ్చిన వారికి మొదటగా కవిత్వం చదివే అవకాశం కల్పిస్తారు. తదపరి వరుస క్రమలో కవితా గానం చేస్తారు. ప్రతి నెలా ఒక కవి ఇంటి దాభా మీద ఈ ముచ్చట్లు జరుగుతాయి. అతిద్యమిచ్చిన వారు సృజనకారులకు అల్పాహారం అందిస్తారు.

సంకలనాల సంపాదకత్వం

[మార్చు]

సాహితీ సోపతి ప్రధాన బాధ్యులు, తెలంగాణ రచయితల వేదిక, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ఈ సంకలనాలకు గౌరవ సంపాదకులుగా వ్యవహరిస్తున్నారు. ఎన్నీల ముచ్చట్లు కవితా సంకలం 1 నుంచి 20 వరకు నగునూరి శేఖర్, గజోజు నాగభూషణంలు సంపాదకులుగా వ్యవహరించారు. 21వ సంకలం నుంచి నగునూరి శేఖర్, బూర్ల వెంకటేశ్వర్లు గౌరవ సంపాదకులుగా కొనసాగుతున్నారు. సంపాదకులుగా సంకలనానికి ఒకరు చొప్పున బాధ్యత వహిస్తున్నారు. 20వ సంకలనం నుంచి సమన్వయ కర్తలుగా విలాసాగరం రవీందర్ సి.వి. కుమార్, పెనుకొండ బసవేశ్వర్, తోట నిర్మలా రాణి లు నడుపుతున్నారు.

ఆతిధ్యం ఇచ్చిన వారి జాబితా

[మార్చు]
  1. అన్నవరం దేవేందర్‌
  2. మాడిశెట్టి గోపాల్
  3. భండారి అంకయ్య
  4. బూర్ల వెంకటేశ్వర్లు
  5. గాజోజు నాగభూషణం
  6. కందుకూరి అంజయ్య
  7. తల్లం మాలతి-రమేష్
  8. కలువకుంట రామకృష్ణ & జయంత్ శర్మ
  9. సోగాని కొంరయ్య
  10. సదాశ్రీ
  11. వావిలాల భూపతి రెడ్డి
  12. తంగెడ అశోక్ రావు
  13. దామెరకుంట శంకరయ్య& మియాపురం శ్రీనివాస్
  14. అనుముల దయాకర్
  15. బొమ్మకంటి కిషన్ & ఉప్పు లింగయ్య
  16. కొత్త అనిల్ కుమార్
  17. ఫాతిమా రెడ్డి
  18. చల్ల హరిశంకర్
  19. వైరాగ్యం ప్రభాకర్
  20. తులా రాజేందర్ రావు
  21. రామానుజం సుజాత
  22. వాసాల వర ప్రసాద్ & పెనుగొండ బసవేశ్వర్-సరసిజ
  23. నడిమెట్ల రామయ్య
  24. మహనీయ
  25. కూకట్ల తిరుపతి
  26. ప్రెస్ భవన్, కరీంనగర్
  27. ప్రెస్ భవన్, కరీంనగర్
  28. ప్రెస్ భవన్, కరీంనగర్
  29. కామారపు అశోక్ కుమార్
  30. విలాసాగరం రవీందర్
  31. జ్యోతి-సదాశ్రీ
  32. ప్రెస్ భవన్, కరీంనగర్
  33. ప్రెస్ భవన్, కరీంనగర్
  34. ఎక్కలదేవి మధుశ్రీ
  35. సంకేపల్లి నాగేంద్ర శర్మ
  36. పి.ఎస్.రవీంద్ర
  37. ప్రెస్ భవన్, కరీంనగర్
  38. ప్రెస్ భవన్, కరీంనగర్
  39. పొన్నం రవిచంద్ర
  40. తప్పెత ఓదన్న
  41. అలుగోజు కుమారస్వామి
  42. రామానుజం సుజాత
  43. తె.ర.వే.కరీంనగర్ జిల్లాశాఖ
  44. సూదం రమేశ్ బాబు
  45. వడ్నాల కిషన్
  46. సందిరి రవీంద్రనాథ్
  47. డాక్టర్ కసప శ్యాం సుందర్
  48. పారమిత విద్యాసంస్థలు
  49. విజయ చిట్స్
  50. జెట్టి రవీందర్
  51. సహకార భవన్
  52. లక్షణ బోధి
  53. కె.వి.సంతోష్ బాబు
  54. ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్
  55. డాక్టర్ కోట మురళి
  56. మంచాల వేంకటేశ్వర్లు
  57. గుండేటి రమేశ్
  58. మహ్మద్ నసీరుద్దీన్
  59. సహకార భవన్, కరీంనగర్
  60. డాక్టర్ నలిమెల భాస్కర్
  61. మంచాల రమేష్ ఇంటిలో చైతన్య కళా భారతి నిర్వహన
  62. ఎక్కలదేవి మధుశ్రీ
  63. శ్రీమంతుల ఈశ్వర్
  64. గజ్జెల కిషోర్
  65. నెరుమట్ల చైతన్య
  66. మేర్గు అంజయ్య
  67. విలాసాగరం రవీందర్
  68. ఎ. గజేందర్ రెడ్డి
  69. దామరకుంట శంకరయ్య
  70. వెజయశ్రీ జలంధర్ రెడ్డి
  71. తప్పెట ఓదయ్య బెజ్జంకి

సంపాదకీయం రాసిన వారి వివరాలు

[మార్చు]

ముఖ చిత్రం ముచ్చట్లు

[మార్చు]

చిత్ర మాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. నవతెలంగాణ, దర్వాజ (Jul 25, 2016). "పున్నమి పున్నమికీ కవిత్వం పండుగ 'ఎన్నీల ముచ్చట్లు'". Retrieved 10 September 2016.
  2. దక్కన్ డైలీ, సాహితి. "అనుభూతులను కలబోసుకున్న ఎన్నీల ముచ్చట్లు – 1". deccandaily.com. Archived from the original on 18 మే 2016. Retrieved 10 September 2016.

ఇతర లంకెలు

[మార్చు]
  1. ఫేస్ బుక్ లో ఎన్నీల ముచ్చట్లు గ్రూప్
  2. 35వ ఎన్నెల ముచ్చట్లు
  3. 37వ ఎన్నీల ముచ్చట్ల పిలుపు