గుండేటి రమేశ్
గుండేటి రమేశ్ | |
---|---|
జననం | చామనపల్లి, కరీంనగర్ జిల్లా, తెలంగాణ |
వృత్తి | కవి, జానపద గాయకుడు, గీత రచయిత, నటుడు |
మతం | హిందూ |
తండ్రి | వెంకటేశం |
తల్లి | లక్ష్మి |
గుండేటి రమేశ్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన కవి, జానపద గాయకుడు, గీత రచయిత, నటుడు. ‘జర’, ‘పరేషాన్’, ‘మైసారం’ (మైసూర్), ‘జర్రంత’, ‘గాయబు’ వంటి తెలంగాణలో వాడుకలో ఉన్న పదాలతో రమేశ్ రాసిన ‘మాయదారి మైసమ్మో.. మైసమ్మా.. మనం మైసారం బోదమే మైసమ్మా!’ పాటల ఒక తరం మొత్తాన్నీ ఉర్రూతలూగించింది.[1]
జననం, విద్య
[మార్చు]రమేశ్ 1969, నవంబరు 7న వెంకటేశం - లక్ష్మి దంపతులకు తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లా, చామనపల్లి గ్రామంలోని చేనేత కుటుంబంలో జన్మించాడు. కరీంనగర్‌లోని రాజరాజేశ్వర ప్రభుత్వ కళాశాల నుంచి బిఏ చదువును పూర్తిచేశాడు.
రచనా ప్రస్థానం
[మార్చు]విద్యార్థి దశనుంచే కవితలు, పాటలు రాయడం ప్రారంభించిన రమేశ్, 18 ఏళ్ళ వయసులో ‘యువశక్తి’ పేరిట పాటల సంపుటిని ప్రచురించాడు. జానపదం, భక్తి, చేనేత వృత్తి నేపథ్యం మొదలైన అంశాలతో 200కు పైగా ప్రైవేటు గీతాలు రాశాడు. ‘జాబిలమ్మ పదాలు’, ‘కరీంనగర్ జిల్లా ఆణిముత్యాలు’, ‘చేనేత చంద్రిక’ మొదలైన పుస్తకాలు వెలువరించాడు.
సినిమారంగం
[మార్చు]1998లో రాజేంద్రప్రసాద్ హీరోగా వచ్చిన ‘జై భజరంగ బలి’ సినిమాలో ‘వెండి వెన్నెల్లలోన అమ్మడూ.. పండిపోదాము రావే గుమ్మడు’ పాటతో సినిమారంగంలోకి ప్రవేశించాడు. ఆ పాట అందరిని అలరించింది. 2000లో వచ్చిన కాలేజ్ సినిమాలో రమేశ్ రాసిన ‘మాయదారి మైసమ్మో.. మైసమ్మా మనం మైసారం బోదమే మైసమ్మా’ పాట అందరితో చిందులేయించింది.
రాసిన పాటలు
[మార్చు]- వెండి వెన్నెల్లలోన అమ్మడూ.. పండిపోదాము రావే గుమ్మడు - జై భజరంగ భళి (1998)
- మాయదారి మైసమ్మో.. మైసమ్మా మనం మైసారం బోదమే మైసమ్మా - కాలేజ్ (2000)
- వచ్చింది వచ్చింది చోరీ.. నైజాం పోరీ - లవ్ (2001)
- సక్కుబాయి సక్కుబాయి.. నువ్వే నాకు దిక్కుబాయ్ - నా మనసిస్తా రా!’ (2001)
- ఓ పిల్లా నీ నవ్వులు.. అరే.. మల్లె వాసన పువ్వులు - జోరుగా హుషారుగా (2002)
- అన్ని పాటలు - కుర్ కురే (2008)[2]
- అమ్మా సమ్మక్కతల్లి కోటొక్క దండాలే.. మాయమ్మ సారక్క నీకు నూటొక్క పూలదండలే - మేడారం జాతర (2014)
- చికెన్ ముక్కలాంటి పిల్లదానయ్యో - పుత్రుడు (2009)
- ఉద్యమాల బాట నడిచే తమ్ముడా! నీ బతుకుపై మమకారమేలర తమ్ముడా! - లెనిన్ (2013)
- ఘల్లు ఘల్లు గజ్జెగట్టి గంతులెయ్యరో - లెనిన్ (2013)[3]
మూలాలు
[మార్చు]- ↑ నమస్తే తెలంగాణ, బతుకమ్మ ఆదివారం సంచిక (20 March 2021). "పాటల పరవళ్లు". Namasthe Telangana. Archived from the original on 25 March 2021. Retrieved 10 November 2021.
- ↑ "Lyricist: Gundeti Ramesh - MusicIndiaOnline - Indian Music for Free!". mio.to. Archived from the original on 2021-11-10. Retrieved 2021-11-10.
- ↑ "Ramesh Gundeti Songs: Listen Ramesh Gundeti Hit Songs on Gaana.com". Gaana.com (in ఇంగ్లీష్). Retrieved 2021-11-10.