ఉత్తరప్రదేశ్ క్రికెట్ జట్టు
వ్యక్తిగత సమాచారం | |
---|---|
కెప్టెన్ | కర్ణ్ శర్మ |
కోచ్ | విజయ్ దహియా |
యజమాని | ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ |
జట్టు సమాచారం | |
రంగులు | Blue White |
స్థాపితం | 1903 |
స్వంత మైదానం | BRSABV Ekana Cricket Stadium, Lucknow |
సామర్థ్యం | 50,000 |
రెండవ స్వంత మైదానం | గ్రీన్ పార్క్ స్టేడియం, కాన్పూర్, సైఫై ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, సైఫై |
రెండవ మైదాన సామర్థ్యం | 32,000 43,000 |
చరిత్ర | |
రంజీ ట్రోఫీ విజయాలు | 1 |
Vijay Hazare Trophy విజయాలు | 1 |
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ విజయాలు | 1 |
ఇరానీ కప్ విజయాలు | 0 |
నిస్సార్ ట్రోఫీ విజయాలు | 1 |
అధికార వెబ్ సైట్ | UPCA |
ఉత్తరప్రదేశ్ క్రికెట్ జట్టు, ఉత్తర ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న దేశీయ క్రికెట్ జట్టు. గతంలో ఈ జట్టును యునైటెడ్ ప్రావిన్సెస్ క్రికెట్ జట్టు అనేవారు. ఈ జట్టు ఫస్ట్-క్లాస్ క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీ, పరిమిత ఓవర్ల విజయ్ హజారే ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీల్లో పోటీపడుతుంది. 2005-06లో రంజీ ట్రోఫీని గెలుచుకోవడమే కాక, ఐదు సందర్భాలలో రన్నరప్‌గా నిలిచింది. సురేష్ రైనా, మహ్మద్ కైఫ్, పీయూష్ చావ్లా, ప్రవీణ్ కుమార్, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, సుదీప్ త్యాగి వంటి క్రికెటర్లు ఉత్తరప్రదేశ్ జట్టు నుండి భారత జట్టు లోకి వెళ్ళారు.
పోటీ చరిత్ర
[మార్చు]ఈ బృందం 1934లో "యునైటెడ్ ప్రావిన్స్" పేరుతో ఏర్పడింది. వారి ప్రారంభ సంవత్సరాల్లో రంజీ ట్రోఫీలో 1939-40లో రన్నరప్‌గా నిలవడం, ఆ ట్రోఫీలో జట్టు అత్యుత్తమ ప్రదర్శన. 1950-51 సీజన్‌లో జట్టు పేరును " ఉత్తరప్రదేశ్ "గా మార్చారు.
రంజీ ట్రోఫీ క్రికెట్‌లో ఉత్తరప్రదేశ్ జట్టు చరిత్ర చాలాకాలం పాటు అంత బలంగా లేదు. రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్‌లో వారి ఏకైక విజయం 2005-06 సీజన్‌లో మాత్రమే. ఆ విజయం, రంజీ ట్రోఫీ క్రికెట్ చరిత్రలో అత్యంత అద్భుతమైన పునరాగమనాల్లో ఒకటి. ఎందుకంటే ఆ సీజన్‌లో ఒకానొక సమయంలో ఉత్తరప్రదేశ్ పతనం అంచున ఉంది.
వారు అంతకు ముందు రెండుసార్లు రన్నరప్‌గా నిలిచారు, 1997-98లో ఒకసారి బలమైన కర్ణాటక జట్టుపై, ఒకసారి 1977-78లో మహ్మద్ షాహిద్ కెప్టెన్సీలో అదే జట్టుపై ఫైనల్లో ఓడిపోయారు. 2007-08 సీజన్‌లో జట్టు రన్నరప్‌గా నిలిచింది. 2005-06 సీజన్‌లో చీఊపిన ప్రదర్శన మాదిరిగానే, వారు ఛాంపియన్‌షిప్‌ను గెలవడానికి బహిష్కరణ అంచు నుండి పుంజుకుంది. అయితే ఈసారి ఫైనల్‌లో ఢిల్లీ చేతిలో ఓడిపోయింది.
సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన వారిలో 3వ స్థానంలో నిలిచిన వారి కెప్టెన్, మీడియం పేసర్ సుదీప్ త్యాగి, సీజన్‌లో 2వ అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడు. రంజీ ట్రోఫీ ఫైనల్‌లో 8 వికెట్లు తీసిన ప్రవీణ్ కుమార్ ఈ సీజన్‌లో అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చారు.
విజయ్ హజారే ట్రోఫీలో వారి అత్యుత్తమ ప్రదర్శన 2004–05లో తమిళనాడుతో ఉమ్మడి విజేతగా నిలవడం. 2006 లో వారు ధర్మశాలలో సియాల్‌కోట్ క్రికెట్ జట్టును ఓడించి నిస్సార్ ట్రోఫీని గెలుచుకున్నారు. ఇరానీ ట్రోఫీలో వారి ఏకైక ప్రదర్శన 2006-07 సీజన్‌లో జరిగింది, దీనిలో వారు రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టుతో ఓడిపోయారు.
రంజీ ట్రోఫీలో అత్యుత్తమ ప్రదర్శన (ఫైనల్)
[మార్చు]సంవత్సరం | స్థానం |
---|---|
2008–09 | ద్వితియ విజేత |
2007–08 | ద్వితియ విజేత |
2005–06 | విజేత |
1997–98 | ద్వితియ విజేత |
1977–78 | ద్వితియ విజేత |
1939–40 | ద్వితియ విజేత |
విజయ్ హజారే ట్రోఫీలో అత్యుత్తమ ప్రదర్శన (ఫైనల్)
[మార్చు]సంవత్సరం | స్థానం |
---|---|
2020–21 | ద్వితియ విజేత |
2004–05 | విజేత |
ప్రముఖ ఆటగాళ్లు
[మార్చు]భారతదేశం తరపున టెస్ట్ క్రికెట్ ఆడిన ఉత్తరప్రదేశ్ ఆటగాళ్ళు. బ్రాకెట్లలో తొలి మ్యాచ్ ఆడిన సంవత్సరం:
- గోపాల్ శర్మ (1985)
- మహ్మద్ కైఫ్ (2000)
- నిఖిల్ చోప్రా (2000)
- రుద్ర ప్రతాప్ సింగ్ (2006)
- పీయూష్ చావ్లా (2006)
- సురేష్ రైనా (2010)
- ప్రవీణ్ కుమార్ (2011)
- భువనేశ్వర్ కుమార్ (2013)
- కుల్దీప్ యాదవ్ (2017)
భారతదేశం కోసం వన్‌డే ఆడిన (కానీ టెస్ట్ క్రికెట్ ఆడని) ఉత్తర ప్రదేశ్ ఆటగాళ్ళు. బ్రాకెట్లలో తొలి మ్యాచ్ ఆడిన సంవత్సరం:
- రుద్ర ప్రతాప్ సింగ్ (1986)
- జ్ఞానేంద్ర పాండే (1999)
- సుదీప్ త్యాగి (2009)
భారతదేశం కోసం T20I ఆడిన (కానీ టెస్ట్ లేదా వన్‌డేలు ఆడని) ఉత్తరప్రదేశ్ ఆటగాళ్ళు. బ్రాకెట్లలో తొలి మ్యాచ్ ఆడిన సంవత్సరం:
- శివం మావి (2023)
ప్రస్తుత స్క్వాడ్
[మార్చు]అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆదిన ఆటగాళ్ల పేర్లను బొద్దుగా చూపించాం.
పేరు | పుట్టినరోజు | బ్యాటింగు శైలి | బౌలింగు శైలి | గమనికలు |
---|---|---|---|---|
బ్యాటర్లు | ||||
రింకూ సింగ్ | 1997 అక్టోబరు 12 | ఎడమచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | Plays for Kolkata Knight Riders in IPL |
అక్షదీప్ నాథ్ | 1993 మే 10 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం ఫాస్ట్ | Vice-Captain |
ప్రియమ్ గార్గ్ | 2000 నవంబరు 30 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం | Plays for Delhi Capitals in IPL |
మాధవ్ కౌశిక్ | 1998 జనవరి 3 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | |
సమీర్ చౌదరి | 1999 డిసెంబరు 19 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | |
దివ్యాన్ష్ జోషి | 2001 సెప్టెంబరు 24 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం | |
అభిషేక్ గోస్వామి | 1997 నవంబరు 6 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | |
సమీర్ రిజ్వీ | 2003 డిసెంబరు 6 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | |
ఆల్ రౌండర్లు | ||||
కరణ్ శర్మ | 1998 అక్టోబరు 31 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | Captain Plays for Lucknow Super Giants in IPL |
వికెట్ ల్కీపర్లు | ||||
ఆర్యన్ జూయాల్ | 2001 నవంబరు 11 | కుడిచేతి వాటం | ||
ధ్రువ్ జూరెల్ | 2001 జనవరి 21 | కుడిచేతి వాటం | Plays for Rajasthan Royals in IPL | |
స్పిన్ బౌలర్లు | ||||
సౌరభ్ కుమార్ | 1993 మే 1 | ఎడమచేతి వాటం | ఎడమచేతి స్లో ఆర్థడాక్స్ | |
శివం శర్మ | 1995 నవంబరు 14 | కుడిచేతి వాటం | ఎడమచేతి స్లో ఆర్థడాక్స్ | |
శివ సింగ్ | 1999 అక్టోబరు 16 | కుడిచేతి వాటం | ఎడమచేతి స్లో ఆర్థడాక్స్ | |
కుల్దీప్ యాదవ్ | 1994 డిసెంబరు 14 | ఎడమచేతి వాటం | Slow left-arm unorthodox | Plays for Delhi Capitals in IPL |
పేస్ బౌలర్లు | ||||
శివం మావి | 1998 నవంబరు 26 | కుడిచేతి వాటం | కుడిచేతి ఫాస్ట్ మీడియం | Plays for Gujarat Titans in IPL |
అంకిత్ రాజ్‌పూత్ | 1993 డిసెంబరు 4 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం ఫాస్ట్ | |
యువరాజు యాదవ్ | 1998 జనవరి 2 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం | |
ఆకిబ్ ఖాన్ | 2003 డిసెంబరు 25 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం | |
కార్తీక్ త్యాగి | 2000 నవంబరు 8 | కుడిచేతి వాటం | కుడిచేతి ఫాస్ట్ | Plays for Sunrisers Hyderabad in IPL |
కార్తికేయ జైస్వాల్ | 1997 నవంబరు 28 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం | |
యశ్ దయాళ్ | 1997 డిసెంబరు 13 | కుడిచేతి వాటం | ఎడమచేతి మీడియం ఫాస్ట్ | Plays for Gujarat Titans in IPL |
కోచింగ్ సిబ్బంది
[మార్చు]- ప్రధాన కోచ్: విజయ్ దహియా [1]
- అసిస్టెంట్ కోచ్: విక్రమ్‌జీత్ మాలిక్
- శిక్షకుడు: రషీద్ జిరాక్
- ఫిజియో: జీషన్ రైస్
- మేనేజర్: దీపన్నకర్ మాళవ్య
- వీడియో విశ్లేషకుడు : సుబ్బారావు
- ఫీల్డింగ్ కోచ్ : మూసీ రజా
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Vijay Dahiya replaces Gyanendra Pandey as Uttar Pradesh coach". ESPN Cricinfo. Retrieved 30 September 2021.