ఇక్రా చౌదరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇక్రా చౌదరి
ఇక్రా చౌదరి


ప్రస్తుత పదవిలో
అధికార కాలం
24 జూన్ 2024
ముందు ప్రదీప్ కుమార్ చౌదరి
నియోజకవర్గం కైరానా నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1994-08-26) 1994 ఆగస్టు 26 (వయసు 30)
కైరానా , ఉత్తరప్రదేశ్ , భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ సమాజ్ వాదీ పార్టీ
తల్లిదండ్రులు చౌదరి మునవ్వర్ హసన్, బేగం తబస్సుమ్ హసన్
పూర్వ విద్యార్థి SOAS యూనివర్సిటీ ఆఫ్ లండన్
MSC ఇంటర్నేషనల్ లా అండ్ పాలిటిక్స్
వృత్తి రాజకీయ నాయకురాలు
మూలం [1]

ఇక్రా చౌదరి (జననం 26 ఆగస్టు 1994) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కైరానా నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.[1][2]

రాజకీయ జీవితం

[మార్చు]

ఇక్రా చౌదరి రాజకీయ నేపధ్యమున్న కుటుంబం నుండి రాజకీయాలలోకి వచ్చింది. ఆమె తాత అక్తర్ హసన్, తండ్రి మునవ్వర్ హసన్, తల్లి తబస్సుమ్ హసన్ కైరానా నుండి లో‍క్‍సభ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఇక్రా చౌదరి సోదరుడు నహిద్ హసన్ మూడుసార్లు శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆమె 2016లో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి జిల్లా పంచాయతీ ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయింది.

ఇక్రా చౌదరి 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కైరానా నియోజకవర్గం నుండి సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ప్రదీప్ కుమార్ పై 69116 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారిగా లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.[3][4][5]

మూలాలు

[మార్చు]
  1. "Uttar Pradesh Lok Sabha Election Result Winners Full List 2024: Narendra Modi leads from Varanasi, Rahul Gandhi ahead in Amethi". Zee Business. 4 June 2024. Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
  2. The Indian Express (4 June 2024). "Uttar Pradesh Lok Sabha Election Results 2024 : Full list of winners on all 80 seats of UP" (in ఇంగ్లీష్). Archived from the original on 18 June 2024. Retrieved 18 June 2024.
  3. "2024 Loksabha Elections Results - Kairana". 4 June 2024. Archived from the original on 30 September 2024. Retrieved 30 September 2024.
  4. TimelineDaily (5 June 2024). "Young Iqra Choudhary Who Broke BJP Fort In Kairana, Reclaims Family Stronghold" (in ఇంగ్లీష్). Archived from the original on 29 September 2024. Retrieved 29 September 2024.
  5. India Today (19 April 2024). "London-educated Kairana ki Beti takes on BJP in West UP seat" (in ఇంగ్లీష్). Archived from the original on 29 September 2024. Retrieved 29 September 2024.