Jump to content

ఇంఫాల్ తూర్పు జిల్లా

వికీపీడియా నుండి
(ఇంఫాల్ ఈస్ట్ జిల్లా నుండి దారిమార్పు చెందింది)
ఇంఫాల్ ఈస్ట్ జిల్లా
జిల్లా
ఇంఫాల్ తూర్పు జిల్లా
ఇంఫాల్ తూర్పు జిల్లా
దేశం భారతదేశం
రాష్ట్రంమణిపూర్
ముఖ్య పట్టణంపోరోంపాట్
విస్తీర్ణం
 • Total710 కి.మీ2 (270 చ. మై)
జనాభా
 (2011)
 • Total4,52,661
 • జనసాంద్రత640/కి.మీ2 (1,700/చ. మై.)
భాషలు
 • అధికారికమీటిలాన్ (మణిపురి)
Time zoneUTC+5:30 (భారత కాలమానం)

ఇంఫాల్ తూర్పు జిల్లా, మణిపూర్ రాష్ట్ర జిల్లా. 2011 గణాంకాలను అనుసరించి మణిపూర్ రాష్ట్ర జిల్లాలలో ఈ జిల్లా జనసాంధ్రతలో 2 వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో వెస్ట్ ఇంఫాల్ జిల్లా ఉంది.[1]

చరిత్ర

[మార్చు]

ఈస్ట్ ఇంఫాల్ 1997 జూన్ 18 ఉనికిలోకి వచ్చింది. జిల్లా కేంద్రమైన పోరోంపాత్, ఇంఫాల్ జిల్లా తూర్పు భూభాగంలో ఉంది. ఈ జిల్లా రెండు ప్రత్యేకమైన లోయలలో (సెంట్రల్ లోయ, జిరిబం లోయ ఉపస్థిథితమై ఉంది. జిల్లా మొత్తం వైశాల్యం దాదాపు 469.44 చ.కి.మీ ఉంటుంది. ఈ జిల్లా సముద్రమట్టానికి 790 మీటర్ల ఎత్తులో ఉంది. జిల్లాలో ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొని ఉంది. అలాగే జిల్లా ఉష్ణమండల వర్షపాతం కలిగి ఉంది. శీతాకాలంలో అత్యల్పంగా ఉష్ణోగ్రత 0.6 డిగ్రీల సెల్షియస్ ఉంటుంది. వేసవి కాలంలో అత్యధికంగా 41 డిగ్రీల సెల్షియస్ ఉంటుంది. జిల్లాలో రైలు మార్గం లేదు. కనుక రవాణా మొత్తం రహదారి మీద ఆధారపడి ఉంది. జిల్లా ఉపవిభాగమైన జిరిబం సరిహద్దులలో ఉన్న అస్సాం రాష్ట్రానికి చెందిన కచార్ జిల్లా లో ఉన్న రైల్ స్టేషను ద్వారా ఈస్ట్ ఇంఫాల్ ప్రజలు రైలుమార్గ సేవలను అందుకుంటున్నారు. ఈ జిల్లా జాతీయ రహదారి 39, జాతీయ రహదారి 53, జాతీయ రహదారి 150 రహదార్లు ఈ జిల్లాను మిగిలిన దేశంతో అనుసంధానిస్తున్నాయి.

1991 లో గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య 3,30,460
గ్రామప్రాంత జనసంఖ్య 2,54,644 (77.06%)
నగరప్రాంత జనసంఖ్య 75,816 (22.94%).
స్త్రీలసంఖ్య 1,62,335.
పురుషులసంఖ్య 1,68,125
షెడ్యూల్డ్ జాతిసంఖ్య 13,153 ( is 3.98% )
షెడ్యూల్డ్ తెగలసంఖ్య 19,191 (5.81%)
ఇది దాదాపు దేశ జనసంఖ్యకు సమానం
అమెరికాలోని నగర జనసంఖ్యకు సమం
640 భారతదేశ జిల్లాలలో వ స్థానంలో ఉంది
1చ.కి.మీ జనసాంద్రత
2001-11 కుటుంబనియంత్రణ శాతం
స్త్రీ పురుష నిష్పత్తి
జాతియ సరాసరి (928) కంటే
అక్షరాస్యత శాతం 68.05%
జాతియ సరాసరి (72%) కంటే

వ్యవసాయం

[మార్చు]

ఈస్ట్ ఇంఫాల్ జిల్లా ప్రధానవృత్తులలో వ్యవసాయం ఒకటి. జిల్లాలో 27,000 వ్యవసాయ భూములు ఉన్నాయి. ఇందులో 4,100 హెక్టార్ల భూమిలో అధికదిగుబడిని ఇచ్చే పంటలు పండుతుంటాయి. అలాగే వరిపొలాలు క్రమంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఇందులో 450 హెక్టార్లలో మొక్కజొన్నలు, 60 హెక్టార్లలో గోధుమలు, 350 హెక్టార్లలో ఉర్లగడ్డలు పండుతున్నాయి. పంటలలో ప్రధానమైనవి వరి, ఉర్లగడ్డలు, కూరగాయలు.వాణిజ్య పంటలలో చెరకు, మొక్కజొన్నలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు, ఇతర కూరగాయలు మొదలైనవి. 1991 గణాంకాలను అనుసరించి వ్యసాయంలో కృషిచేస్తున్న వారి సంఖ్య 42,473. వీరిలో పురుషుల సంఖ్య 28,661 స్త్రీల సంఖ్య 13,812. ఎర్రగడ్డలు, మిరపకాయలు, అల్లం, పసుపు, కొత్తమల్లి మొదలైనవి జిల్లాలోనే పండించబడుతున్నాయి.

  1. వరి 27.00 80.14 హెక్టార్లు
  2. ప్రాంతీయ వరిజాతి 4.10 5.44
  3. మొక్కజొన్న 0.45 0.80
  4. చెరుకు 0.29 17.84
  5. కరీఫ్ పప్పుధాన్యాలు 0.22 0.26
  • రబి పంటలు
  1. గోధుమలు 0.06 0.08
  2. బఠాణీలు & ఇతర పప్పు ధాన్యాలు 1.53 1.09
  3. ఉర్లగడ్డలు 0.35 1.52
  4. ఆవాలు& ఇతర నూనె విత్తనాలు పంటలు 0.60 1.22

తోటకళ

[మార్చు]

తోటకల ఉత్పత్తులు ఈ జిల్లాకు ఖ్యాతి తీసుకువచ్చాయి. అనాస, అరటి, నిమ్మ, బొప్పాయి మొదలైన పండ్లు జిల్లాలో బాగాపండినచబడుతున్నాయి. న్గరియాన్ కొండలలో అనాస పండ్లు విస్తారంగా పండినబడుతున్నాయి. తోటకళ పంటలను పండించడానికి జిల్లాలో అనుకూల అవకాశాలు ఉన్నాయి. మట్టి, వాతావరణం విస్తారంగా తోటకు అవసరమైన మొక్కలను పెంచడానికి అనుకూలంగా ఉంది.

  • 1998-99లో జిల్లాలో అధికంగా హార్టికల్చర్ ఉత్పత్తులు లభిస్తున్న ప్రాంతాలు.
  1. అనాస 650 3,700
  2. అరటి 50 392
  3. నిమ్మ 56 224
  4. ప్లం, Pear & Peach 30 180
  5. బొప్పాయి 230 1,150
  6. మామిడి 12 60
  7. జామ 30 138
  8. ఇతరాలు 250 397
  • మొత్తం - 1,358 6,646

జంతుజాలం

[మార్చు]

ఈస్ట్ ఇంఫాల్ జిల్లాలో ఒక డైరీ ఫాం, వెటరినరీ శిక్షణాకేంద్రం ఉన్నాయి. అంతేకాక జిల్లాలో 5 పశువుల ఆసుపత్రులు, 19 వెటరినరీ డిస్పెంసరీలు ఉన్నాయి. 3 ఎయిడ్స్ కేంద్రాలు ఉన్నాయి. 1997 గణాంకాలను అనుసరించి కింద పెంపుడు జంతువుల వివరణ ఇవ్వబడింది.

  1. పశువులు 85,964
  2. బర్రెలు 2,310
  3. గొర్రెలు 461
  4. మేకలు 2,189
  5. గుర్రాలు & పోనీగుర్రాలు 542
  6. పందులు 10,563
  7. కుక్కలు 15,940
  8. కుందేళ్ళు 799
  • పెంపుడుపక్షులు ( పౌల్ట్రీ)
  1. కోడిపుంజులు 30,719
  2. కోడిపెట్టలు 2,37,704
  3. కోడిపిల్లలు (3 మాసాలకంటే చిన్నవి) 1,60,018
  4. మగబాతులు 21,029
  5. ఆడ బాతులు 35,832
  6. బాతు పిల్లలు ( 6 మాసాలకంటే చిన్నవి ) 21,512
  7. ఇతరపక్షులు 5,784

వన్యసంపద

[మార్చు]

1 వంటచెరకు 16.8 43.560 మె.ట 2 వెదురు లేదు 3 రాక్షసి బొగ్గు 1 80 క్యూబిక్ టన్నులు 4 భూమి C.M. 1,060 16,620 5 రాళ్ళు C.M. 31,610 4,77,340 6 ఇసుక C.M. 23,542 3,29,685

పర్యాటకం

[మార్చు]

ఈస్ట్ ఇంఫాల్ జిల్లాలో 2 మోటేల్ టూరిస్ట్ హోంలు ఉన్నాయి. ఒకటి కైనాలో మరొకటి జిరిబంలో ఉంది. జిల్లాలో సహజసౌందర్యం కలిగిన పొయిరౌపాత్ ఒక చిన్న కొండగుట్టను చుట్టి ఉండడం వర్ణిచడానికి అనువుకాని విధంగా చూపరులకు ఆకర్ష్ణీయంగా ఉంటుంది. రాజభవన ప్రాకారంలో అనదంగా మెరుస్తున్న శ్రీ శ్రీ గోవిందరాజ ఆలయం జిల్లాకు ప్రత్యేక అకర్షణగా ఉంది. బ్రిటిష్ ప్రభుత్వ యుద్ధకాలంలో ఏర్పాటుచేయబడిన 2 మరుభూములు కూడా పర్యాటక ఆకర్షణలలో ఒకటి. అదనంగా కైనాలో ఉన్న హిందూ దేవాకయం పర్యాటకులను ఆకర్షిస్తుంది. మహాబలిలో ఉన్న హనుమాన్ ఆలయం రాష్ట్రంలోని చారిత్రకాలానికి ముందునాటి ప్రాంతాలలో ఒకటని భావిస్తున్నారు. మంత్రముగ్ధులను చేసే సుందర ప్రాంతాలకు, ప్రకృతి సహజ సౌందర్యానికి, అహ్లాదకరమైన వాతావరణానికి మణిపూర్ రాష్ట్రం ప్రత్యేకత సంతరించుకుంది. అంతేకాక సుసంపన్నమైన సంస్కృతి పర్యాటక అభివృద్ధికి చక్కగా సహకరిస్తుంది.

భౌగోళికం

[మార్చు]

ఈస్ట్ ఇంఫాల్ జిల్లా కేంద్రంగా పొరొంపత్ పట్టణం ఉంది.

వాతావరణం

[మార్చు]
Imphal
Climate chart (explanation)
ఫిమామేజూజుసెడి
 
 
13
 
21
4
 
 
31
 
23
7
 
 
61
 
27
11
 
 
101
 
29
15
 
 
146
 
29
18
 
 
284
 
29
21
 
 
231
 
29
22
 
 
197
 
29
21
 
 
124
 
29
20
 
 
120
 
28
17
 
 
36
 
25
10
 
 
10
 
22
5
Average max. and min. temperatures in °C
Precipitation totals in mm
Source: IMD

గణాంకాలు

[మార్చు]

2001 లో గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య 452,661, [1]
ఇది దాదాపు మాల్టా దేశ జనసంఖ్యకు సమానం.[2]
అమెరికాలోని నగర జనసంఖ్యకు సమం
640 భారతదేశ జిల్లాలలో 531 వ స్థానంలో ఉంది [1]
1చ.కి.మీ జనసాంద్రత 638 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం 14.63%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి 1011:1000, [1]
జాతియ సరాసరి (928) కంటే అధికం
అక్షరాస్యత శాతం 82.81%.[1]
జాతియ సరాసరి (72%) కంటే అధికం

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Malta 408,333 July 2011 est.

వెలుపలి లింకులు

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]