ఆత్రం సుగుణ
ఆత్రం సుగుణ | |||
| |||
కాంగ్రెస్ లోక్‌సభ ఎంపీ అభ్యర్తి
| |||
నియోజకవర్గం | ఆదిలాబాద్ లోకసభ నియోజకవర్గం | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1975 ఆగష్టు 16 పుల్లార, సిర్పూర్ (యు) మండలం, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా, తెలంగాణ. | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ (INC) | ||
తల్లిదండ్రులు | కనక రాజు,బుదుబాయి | ||
జీవిత భాగస్వామి | ఆత్రం భుజంగ్ రావు | ||
సంతానం | డా.ఆత్రం విప్లవ్,ఆత్రం సాయుధ్ | ||
నివాసం | ఫకీర్ గుట్ట, ఉట్నూర్ మండలం, ఆదిలాబాద్ జిల్లా, తెలంగాణ, ఇండియా |
ఆత్రం సుగుణ తెలంగాణ రాష్ట్రనికి చెందిన రాజకీయ నాయకురాలు. ఈమె ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుండి 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి పాలైంది.[1] [2][3][4]
జననం,విద్య
[మార్చు]ఆత్రం సుగుణ 16 ఆగస్టు 1975 లో తెలంగాణ రాష్ట్రం కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు) మండలంలోని పుల్లార అనే మారుమూల ఆదివాసి గోండు గూడలో గోండు సామాజిక వర్గానికి చెందిన కనక రాజు ,బుదుబాయి దంపతులకు జన్మించింది. తన బాల్య జీవితమంత అమ్మమ్మ వాళ్ళ ఊరైన మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని తిమ్మాపూర్ లో గడిచింది. పదవ తరగతి వరకు జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల తపాల్ పూర్ ల్లో చదివి పదమూడవ ఏట అదే మండలం మురిమడుగు కొమ్ముగూడ కు చెందిన ఆత్రం భుజంగరావుతో 1992లో వివాహం జరిగినది. ఆ తర్వాత భర్త ప్రోత్సహంతో ఎంఏ, బీఈడీ పూర్తి చేసి 2008లో ఉపాధ్యాయ ఉద్యోగానికి ఎంపికైంది.[5][6]
రాజకీయ జీవితం
[మార్చు]ఆత్రం సుగుణ రాజకీయాల మీద ఆసక్తితో రాజకీయ రంగంలో అడుగుపెట్టింది. 2008లో ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం సాధించి, ఉపాధ్యాయురాలిగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ యందు విధులు నిర్వర్తిస్తు తేదీ:12 మార్చి2024 న ఉద్యోగానికి రాజీనామా చేసి తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మహిళా,శిశు సంక్షేమం,పంచాయితీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క [7],ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బోజ్జు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరింది. 1995 లో అప్పటి ఉమ్మడి ఆదిలాబాదు జిల్లా జన్నారం మండలం లోని మురిమడుగు ఎంపీటిసీ గా గెలిచి సేవలందించింది.
ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో,ఆదివాసి మహిళా హక్కుల, పరిరక్షణ కోసం ఆ సంఘానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సేవలందించింది.బీడీ కార్మిక సంఘంలోను, అవ్వాల్ కమిటీలోను,ఉట్నూరు సాహితీ వేదిక లో కూడా చురుకైన పాత్ర పోషించింది. తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి జిల్లా అధ్యక్షురాలిగా, తెలంగాణ యునైటెడ్ ప్రంట్ జిల్లా చైర్మన్ గా, టీపిటీఎఫ్ జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలిగా మానవ హక్కుల వేదిక జిల్లా కార్యదర్శిగా వ్యవహరించింది. సామాజిక కార్యకర్తగా అనేక ప్రజా ఉద్యమాలలో క్రియశీలక పాత్ర పోషించింది. ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్తిగా పోటీ చేసే తొలి ఆదివాసీ మహిళగా నిలిచింది.[8][9][10] [11]
2024 జూన్ 4 న భారత సార్వత్రిక ఎన్నికల్ల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గోడం నగేష్ చేతులో అత్రం సుగుణ 4,77,516 ఓట్ల సాధించి ఓటమి పాలైంది.
మూలాలు
[మార్చు]- ↑ EENADU (28 March 2024). "కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ." Archived from the original on 26 April 2024. Retrieved 26 April 2024.
- ↑ Desk 22, Disha Web (2024-03-21). "కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆత్రం సుగుణ". www.dishadaily.com. Retrieved 2024-04-06.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Sridhar, P. (2024-03-28). "Adivasi rights activist hand-picked by Congress for Adilabad LS seat". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2024-04-07.
- ↑ India, The Hans. "Congress to rope in tribal teacher for Adilabad LS seat". The Hans India (in ఇంగ్లీష్). Retrieved 2024-04-07.
- ↑ Chary, Maheshwaram Mahendra. "Adilabad Congress MP Candidate : నిన్నటి టీచర్, ఇవాళ ఎంపీ అభ్యర్థి - 'ఆత్రం సుగుణ' గురించి ఆసక్తికరమైన విషయాలివే". Hindustantimes Telugu. Retrieved 2024-04-06.
- ↑ "కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ." EENADU. Retrieved 2024-04-06.
- ↑ "TS: మంత్రి సీతక్కని కలిసిన ఆత్రం సుగుణ." Prabha News (in అమెరికన్ ఇంగ్లీష్). 2024-03-20. Retrieved 2024-04-27.
- ↑ "TS: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఆదిలాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ". Prabha News (in అమెరికన్ ఇంగ్లీష్). 2024-03-29. Retrieved 2024-04-06.
- ↑ Velugu, V6 (2024-04-03). "ఆడ బిడ్డగా ముందుకొచ్చా.. ఆదరించండి : అత్రం సుగుణ". V6 Velugu. Retrieved 2024-04-06.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Today, Telangana (2024-03-28). "Lok Sabha polls: Clash of teachers in Adilabad". Telangana Today (in ఇంగ్లీష్). Retrieved 2024-04-07.
- ↑ Chary, Maheshwaram Mahendra. "Adilabad Congress MP Candidate : నిన్నటి టీచర్, ఇవాళ ఎంపీ అభ్యర్థి - 'ఆత్రం సుగుణ' గురించి ఆసక్తికరమైన విషయాలివే". Hindustantimes Telugu. Retrieved 2024-04-07.