Jump to content

అభయ్ వర్మ

వికీపీడియా నుండి
అభయ్ వర్మ
2024లో అభయ్ వర్మ
జననం
అభయ్ వర్మ

(1998-07-27) 1998 జూలై 27 (వయసు 26)
పానిపట్, హర్యానా, భారతదేశం
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు2018–ప్రస్తుతం
బంధువులుఅభిషేక్ వర్మ (సోదరుడు)

అభయ్ వర్మ (జననం 1998 జూలై 27) హిందీ సినిమాల్లో పనిచేసే భారతీయ నటుడు. అతను థ్రిల్లర్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ (2021) రెండవ సీజన్‌లో తన సహాయక పాత్రకు మొదట గుర్తింపు పొందాడు. కామెడీ-హారర్ చిత్రం ముంజ్యా (2024)లో అతని ప్రధాన పాత్రతో మరింత ప్రసిద్ధి చెందాడు.[1]

ప్రారంభ జీవితం

[మార్చు]

అతను హర్యానాలోని పానిపట్‌కు చెందినవాడు.[2] అతను సెయింట్ మేరీస్ కాన్వెంట్ స్కూల్ నుండి తన పాఠశాల విద్యను పూర్తి చేసాడు. ఆ పై చదువు అబ్బని అతను సమయం వృధా అని భావించాడు. నటనలో కెరీర్ కొనసాగించడానికి అతను తన తల్లిదండ్రులతో కలిసి ముంబైకి వచ్చాడు.[3] అతనికి అభిషేక్ వర్మ అనే ఒక సోదరుడు ఉన్నాడు. అతను యే హై మొహబ్బతేన్‌లో "ఆది" పాత్ర పోషించాడు.[4]

కెరీర్

[మార్చు]

అభయ్ వర్మ తన నటనా జీవితాన్ని మర్జీతో ప్రారంభించాడు, ఆ తర్వాత లిటిల్ థింగ్స్‌లో నటించాడు. ఈ ప్రాజెక్ట్‌లతో పాటు, అతను టెలివిజన్ వాణిజ్య ప్రకటనలలో పాల్గొన్నాడు.[5] సూపర్ 30 సెట్‌లో జూనియర్ ఆర్టిస్ట్‌గా ఉన్నాడు.[6]

ది ఫ్యామిలీ మ్యాన్ 2లో మనోజ్ బాజ్‌పేయి పక్కన పాత్ర అతనికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అతను తీవ్రవాదులతో సంబంధం ఉన్న కళ్యాణ్, ధృతి (ఆశ్లేషా ఠాకూర్ పాత్ర పోషించాడు) స్నేహితుడిగా నటించాడు. 2023లో, అతను సఫేద్‌లో లింగమార్పిడి పాత్రలో కనిపించి తన సినీ రంగ ప్రవేశం చేశాడు.[7] సఫేద్‌లో అభయ్ వర్మ నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.[8]

2024లో, అతను కన్నన్ అయ్యర్ దర్శకత్వం వహించిన ఏ వతన్ మేరే వతన్‌లో సారా అలీ ఖాన్‌తోకలిసి నటించాడు. ఇక జూన్‌ 2024లో, అతను ముంజ్యా చిత్రంలో ప్రధాన పాత్రలో తన అద్భుతమైన నటనను ప్రదర్శించాడు. ఈ చిత్రం భారతీయ జానపద కథలు, పురాణాల నుండి ప్రేరణ పొందింది, ఇది ముంజ్యా పురాణంపై దృష్టి పెట్టింది.

మన్ బైరాగి చిత్రంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ చిన్నప్పటి పాత్ర పోషిస్తున్నాడు. సంజయ్ త్రిపాఠి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సంజయ్ లీలా బన్సాలీ నిర్మించాడు.[9]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]
సినిమా
సంవత్సరం సినిమా పాత్ర భాష గమనిక మూలం
2018 సూపర్ 30 - హిందీ జూనియర్ ఆర్టిస్ట్ [6]
2023 సేఫ్డ్ చాండీ హిందీ [6]
2024 ఏ వతన్ మేరే వతన్ కౌశిక్ హిందీ [10]
ముంజ్య బిట్టు హిందీ [1]
TBA మన్ బైరాగి నరేంద్ర మోదీ (యువకుడు) హిందీ [9]
టెలివిజన్
సంవత్సరం శీర్షిక పాత్ర గమనిక మూలం
2019 లిటిల్ థింగ్స్ [1]
2020 మార్జి అయాన్ [1]
గోర్మింట్ బబ్లూ కుమార్ [1]
2021 ది ఫ్యామిలీ మ్యాన్ కళ్యాణ్/సల్మాన్ సీజన్ 2 [11]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 "Who is Abhay Verma? All you need to know about 'Munjya' star". The Times of India. 2024-06-11. ISSN 0971-8257. Retrieved 2024-06-21.
  2. "'Munjya' actor Abhay Verma: Yet to digest I'm part of such a big film". India Today (in ఇంగ్లీష్). 2024-06-10. Retrieved 2024-06-21.
  3. Jain, Vaishali (2021-06-15). "EXCLUSIVE | My struggle ended the moment I reached Mumbai, Abhay Verma aka Kalyan from Family Man 2". India TV News (in ఇంగ్లీష్). Retrieved 2024-06-21.
  4. "Did you know Yeh Hai Mohabbatein's Abhishek Verma aka Adi is Munjya's Abhay Verma's real-life brother?". Pinkvilla (in ఇంగ్లీష్). 2024-06-09. Archived from the original on 2024-06-22. Retrieved 2024-06-22.
  5. "[EXCL.] Abhay Verma aka Kalyan's mom's reaction to The Family Man 2: 'Tu namaste bolega ya As-salamu alaykum?'". Times Now (in ఇంగ్లీష్). 2021-06-13. Retrieved 2024-06-22.
  6. 6.0 6.1 6.2 "Karan Johar Messaged Me For My Performance In Munjya, Reveals Actor Abhay Verma (Exclusive)". The Free Press Journal (in ఇంగ్లీష్). Retrieved 2024-06-21.
  7. "Actor Abhay Verma Talks About Playing A Transgender In His Debut Film 'Safed'". The Free Press Journal (in ఇంగ్లీష్). Retrieved 2024-06-21.
  8. "'Safed' Review: A well-intentioned film that falters due to average performances". India Today (in ఇంగ్లీష్). 2023-12-29. Retrieved 2024-06-22.
  9. 9.0 9.1 "EXCLUSIVE: Munjya star Abhay Verma on playing PM Narendra Modi, "Can't be a bigger opportunity & responsibility than this"". Bollywood Hungama (in ఇంగ్లీష్). 2024-06-19. Retrieved 2024-06-21.
  10. VERMA, SUKANYA. "Ae Watan Mere Watan Review: Radio Ga Ga!". Rediff (in ఇంగ్లీష్). Retrieved 2024-06-21.
  11. "The Family Man 2 actor Abhay Verma reveals what his mom asked after watching the show". Hindustan Times. Retrieved 2024-06-22.
"https://te.wikipedia.org/w/index.php?title=అభయ్_వర్మ&oldid=4311668" నుండి వెలికితీశారు