Jump to content

అశ్లేషా ఠాకూర్

వికీపీడియా నుండి
ఆశ్లేషా ఠాకూర్
జననం (2003-10-19) 2003 అక్టోబరు 19 (వయసు 21)
జాతీయతభారతీయురాలు
వృత్తి
  • నటి
  • మోడల్
క్రియాశీల సంవత్సరాలు2017-ప్రస్తుతం

ఆశ్లేషా ఠాకూర్ (జననం 2003 అక్టోబరు 19) భారతీయ నటి, మోడల్. వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్‌లో మనోజ్ బాజ్‌పేయి కుమార్తెగా ధృతి తివారీ పాత్రను పోషించినందుకు అశ్లేష బాగా ప్రసిద్ది చెందింది.[1] అమెజాన్ ప్రైమ్ లో ఇది బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీంతో ఆమె సోషల్ మీడియా ఫాలోయింగ్‌లో గణనీయమైన పెరుగుదలకు దారితీసింది.[2][3]

2023లో, త్రివిక్రమ్ శేషు దర్శకత్వంలో రూపొందుతున్న తెలుగు చలనచిత్రం శాంతలలో ఆమె ప్రధాన పాత్ర పోషిస్తోంది.[4] కాగా, నిహాల్‌‌ కోదాటి హీరోగా నటిస్తున్న ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, మరాఠీ, తమిళం, కన్నడం, మలయాళ భాషల్లో కూడా విడుదల కానుంది.

బాల్యం

[మార్చు]

మహారాష్ట్రలోని ముంబైలో 2003 అక్టోబరు 19న అశ్లేషా ఠాకూర్ జన్మించింది.

కెరీర్

[మార్చు]

2017లో, ఆమె కలర్స్ టీవీలో శక్తి - అస్తిత్వ కే ఎహసాస్ కి అనే టీవీ షోలో పాత్రతో నటిగా అరంగేట్రం చేసింది. అదే సంవత్సరంలో, ఆమె బాలీవుడ్ చిత్రం జీనా ఇసి కా నామ్ హైలో నటించింది. ఆమె పగ్లైట్, సర్వం శక్తి మాయం, గుటూర్ గు,గుప్త్ జ్ఞాన్ వంటి పలు సినిమాల్లో నటించింది.

ది ఫ్యామిలీ మ్యాన్ అనే వెబ్ సిరీస్‌లో మనోజ్ బాజ్‌పేయి, ప్రియమణిల కుమార్తె ధృతి తివారీ పాత్రతో ఆమె మంచి గుర్తింపు పొందింది. షారుఖ్ ఖాన్, సన్యా మల్హోత్రా జంటగా, 2023లో వచ్చిన జవాన్ సినిమాలోనూ ఆమె చేసింది. ఈ చిత్రంలో, ఆమె కాళీ కుమార్తె పాత్రను పోషించింది, ఇందులో విజయ్ సేతుపతి కాళీ పాత్రను పోషించాడు.

ఆమె హిమాలయ, కిస్సాన్, క్యాడ్‌బరీ, రిలయన్స్ ఫ్రెష్, అమెజాన్, స్విగ్గీ, శామ్‌సంగ్, ఎల్&టి వంటి బ్రాండ్‌లకు కూడా ప్రకటనలు చేసింది.

మూలాలు

[మార్చు]
  1. Handoo, Ritika. 2021. "The Family Man Actress Ashlesha Thakur Aka Dhriti Says Kissing Scene Was No Fun and She Has a Lot of Rishtas in Her DMs!" Zee News, July 10, 2021. Accessed September 9, 2023. https://zeenews.india.com/entertainment/web-series/the-family-man-actress-ashlesha-thakur-aka-dhriti-says-kissing-scene-was-no-fun-and-she-has-a-lot-of-rishtas-in-her-dms-2375296.html.
  2. Pandey, Devasheesh (2021-07-09). "The Family Man Actor Ashlesha Thakur aka Dhriti: I've a Lot of 'Rishtas' in My DMs". News18 India (in ఇంగ్లీష్). Retrieved 2023-04-30.
  3. Handoo, Ritika, ed. (2021-07-10). "The Family Man actress Ashlesha Thakur aka Dhriti says 'kissing scene was no fun' and she has 'a lot of rishtas' in her DMs!". Zee News (in ఇంగ్లీష్). Retrieved 2023-04-30.
  4. "'శాంతల' పాటను విడుదల చేసిన త్రివిక్రమ్‌ | Popular Director Trivikram Srinivas Released The First Song From The Rise Of Shantala Movie - Sakshi". web.archive.org. 2023-10-22. Archived from the original on 2023-10-22. Retrieved 2023-10-22.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)