అనుకృతి వాస్
అందాల పోటీల విజేత | |
జననము | 1998/1999 (age 25–26) తిరుచిరాపల్లి, తమిళనాడు, భారతదేశం |
---|---|
విద్య | బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (ఫ్రెంచ్ భాష) |
పూర్వవిద్యార్థి | లయోలా కాలేజ్, చెన్నై |
వృత్తి | మోడల్, నటి, అందాల పోటీ టైటిల్ హోల్డర్ |
ఎత్తు | 1.70 మీ. (5 అ. 7 అం.) |
జుత్తు రంగు | నలుపు |
కళ్ళ రంగు | నలుపు |
బిరుదు (లు) |
|
ప్రధానమైన పోటీ (లు) |
|
అనుకృతి వాస్ (జననం 1999 సెప్టెంబరు 28) భారతీయ మోడల్, అందాల పోటీ టైటిల్ హోల్డర్. ఆమె ఫెమినా మిస్ ఇండియా 2018 కిరీటం పొందిన నటి.[1] 2018 డిసెంబరు 8న చైనాలోని సన్యాలో జరిగిన మిస్ వరల్డ్ పోటీల 68వ ఎడిషన్‌లో ఆమె భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది, అక్కడ ఆమె టాప్ 30 సెమీ ఫైనలిస్ట్‌లలో స్థానం సంపాదించింది.[2]
2023 అక్టోబరు 20న విడుదల కాబోతున్న టైగర్ నాగేశ్వరరావు చిత్రంతో ఆమె తెలుగుతెరపై కనిపించనుంది.[3]
కెరీర్
[మార్చు]అవుట్‌గోయింగ్ టైటిల్‌హోల్డర్, మిస్ వరల్డ్ 2017 మానుషి చిల్లర్ చేత ఆమె ఫెమినా మిస్ ఇండియా 2018 కిరీటాన్ని పొందింది. దీనికి ముందు, ఆమె ఫిబ్రవరి 2018లో ఫెమినా మిస్ ఇండియా తమిళనాడు 2018 కిరీటాన్ని కైవసం చేసుకుంది. ఈ పోటీలో, ఆమె మిస్ బ్యూటిఫుల్ స్మైల్ కిరీటాన్ని పొందింది. అలాగే బ్యూటీ విత్ ఎ పర్పస్ అవార్డును గెలుచుకుంది. 2018 డిసెంబరు 8న చైనాలోని సాన్యాలో జరిగిన మిస్ వరల్డ్ 2018 పోటీలో ఆమె భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది, అక్కడ ఆమె టాలెంట్ రౌండ్‌లో టాప్ 18కి చేరుకుంది. ఆమె తన రౌండ్ హెడ్-టు-హెడ్ ఛాలెంజ్‌ను గెలుచుకోవడం ద్వారా పోటీలో టాప్ 30లోకి కూడా ప్రవేశించింది.[4]
ఇక ఆమె 2022లో తమిళ సినిమా డి.ఎస్.పి ద్వారా సినీరంగ ప్రవేశం చేసింది.[5] కాగా ఆమె నటించిన మరో తమిళ చిత్రం నిర్మాణంలో ఉంది.[6][7]
వ్యక్తిగత జీవితం
[మార్చు]ఆమె తమిళనాడులోని తిరుచిరాపల్లిలో జన్మించింది. ఆమెకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. అయితే, ఆమె ఏడు సంవత్సరాల వయస్సులో తండ్రి కుటుంబాన్నివిడిచిపెట్టాడు, దీంతో పిల్లలు ఇద్దరూ తల్లి సెలీనా వద్ద పెరిగారు.
ఆమె తిరుచిరాపల్లిలోని మాంట్‌ఫోర్ట్ స్కూల్‌లో చదివింది.[8] ఆమె తన సీనియర్ సెకండరీ విద్యను ఆర్. ఎస్. కృష్ణన్ హయ్యర్ సెకండరీ స్కూల్ నుండి పూర్తి చేసింది. ఆ తరువాత, ఆమె చెన్నైలోని లయోలా కాలేజీలో ఫ్రెంచ్ సాహిత్యం అభ్యసించడానికి బీఏ డిగ్రీలో చేరింది.[9][10] ఆమె స్పోర్ట్స్ పర్సన్, అలాగే మోటర్‌బైక్ ప్రియురాలు.
మూలాలు
[మార్చు]- ↑ "Tamil Nadu college student Anukreethy Vas crowned Miss India 2018".
- ↑ "Tamil Nadu's Anukreethy Vas crowned Miss India 2018". Archived from the original on 14 March 2020. Retrieved 16 November 2018.
- ↑ "టైగర్ నాగేశ్వరరావు". Archived from the original on 2023-10-14. Retrieved 2023-10-14.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Bollywood News update June 20: Anukriti Vas crowned Miss India 2018, Rajkummar Rao wraps up Fanne Khan shoot". Archived from the original on 16 November 2018. Retrieved 16 November 2018.
- ↑ "DSP Movie Showtimes". The Times of India. Retrieved 27 November 2022.
- ↑ "Miss India Anukreethy Vas to debut in Prashanth's next". Cinema Express. Retrieved 2019-07-12.
- ↑ "Prashanth to romance Miss India 2018 Anukreethy Vas in his next film". in.com (in ఇంగ్లీష్). Archived from the original on 2019-07-12. Retrieved 2019-07-12.
- ↑ "Miss India visits her alma mater Montfort School".
- ↑ "Interview with her mom".
- ↑ "Atharvaa Murali: Movies, Photos, Videos, News, Biography & Birthday | eTimes". The Times of India.