అంబికా లక్ష్మీనారాయణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అంబికా జి లక్ష్మీనారాయణ వాల్మీకి

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2024
ముందు తలారి రంగయ్య
నియోజకవర్గం అనంతపురం

వ్యక్తిగత వివరాలు

జననం 1964
శ్రీ సత్యసాయి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు జి చలపతి
జీవిత భాగస్వామి శ్యామల దేవి
సంతానం పావని, అంబికా వీక్షిత్
నివాసం 9-1-58-30, పాండురంగ నగర్, హిందూపూర్ టౌన్, శ్రీ సత్యసాయి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
వృత్తి రాజకీయ నాయకుడు

అంబికా జి లక్ష్మీనారాయణ వాల్మీకి భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో అనంతపురం నియోజకవర్గం నుండి తొలిసారి ఎంపీగా లోక్‌సభకు ఎన్నికయ్యాడు.[1][2]

రాజకీయ జీవితం

[మార్చు]

అంబికా లక్ష్మీనారాయణ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2009లో జరిగిన శాసనసభ ఎన్నికలలో హిందూపురం నియోజకవరం నుండి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి 30,768 ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచాడు. ఆయన ఆ 2014లో కాంగ్రెస్ పార్టీని వీడి,[3] తెలుగుదేశం పార్టీలో చేరి అంబికా ఫౌండేషనను స్థాపించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూనే టీడీపీ శ్రీసత్యసాయి జిల్లా ప్రధాన కార్యదర్శిగా, కడప, ఆదోని  నియోజకవర్గాల పరిశీలకుడిగా పని చేశాడు. అంబికా లక్ష్మీనారాయణ 2014 ఎన్నికల్లో హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి అవకాశం వచ్చిన ఆఖరి నిమిషంలో నందమూరి బాలకృష్ణ హిందూపురం నుంచి పోటీ చేయడంతో ఆ ఎన్నికల్లో బాలకృష్ణ విజయానికి తన వంతు కృషి చేశాడు.[4]

అంబికా లక్ష్మీనారాయణ శ్రీసత్యసాయి జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శిగా పని చేస్తూ 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో అనంతపురం నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి మాలగుండ్ల శంకర్ నారాయణపై 1,88,555 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎంపీగా లోక్‌సభకు ఎన్నికయ్యాడు.[5][6][7]

మూలాలు

[మార్చు]
  1. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Ananthapur". Archived from the original on 12 June 2024. Retrieved 12 June 2024.
  2. Andhrajyothy (6 June 2024). "అంబికాకు అదిరే మెజార్టీ". Archived from the original on 12 June 2024. Retrieved 12 June 2024.
  3. Deccan Chronicle (23 January 2014). "Congress man joins Telugu Desam" (in ఇంగ్లీష్). Archived from the original on 12 June 2024. Retrieved 12 June 2024.
  4. Andhrajyothy (30 March 2024). "ఇంక రెడీ..!". Archived from the original on 13 June 2024. Retrieved 13 June 2024.
  5. The Indian Express (8 June 2024). "Meet new TDP MPs: first-timers to veterans, political heirs to YSRCP turncoats, ex-officers to industrialists" (in ఇంగ్లీష్). Archived from the original on 12 June 2024. Retrieved 12 June 2024.
  6. Eenadu (5 June 2024). "అనంత ఎంపీగా 'అంబికా' విజయఢంకా". Archived from the original on 12 June 2024. Retrieved 12 June 2024.
  7. Andhrajyothy (9 May 2024). "డబుల్‌ ఇంజిన ప్రభుత్వంతోనే అభివృద్ధి". Archived from the original on 12 June 2024. Retrieved 12 June 2024.