Jump to content

మాలగుండ్ల శంకర నారాయణ

వికీపీడియా నుండి
మాలగుండ్ల శంకర నారాయణ
మాలగుండ్ల శంకర నారాయణ


రోడ్లు, భవనాల శాఖ మంత్రి
పదవీ కాలం
22 జులై 2020 – 7 ఏప్రిల్ 2022
ముందు ధర్మాన కృష్ణ దాస్

బీసీ సంక్షేమ శాఖ మంత్రి
పదవీ కాలం
08 జూన్ 2019 – 21 జులై 2020
ముందు కింజరాపు అచ్చెన్నాయుడు
తరువాత చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ

ఎమ్మెల్యే
పదవీ కాలం
2019 – 2024
ముందు బీ.కే. పార్థసారథి
తరువాత ఎస్. సవిత
నియోజకవర్గం పెనుకొండ శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1965-01-01) 1965 జనవరి 1 (వయసు 60)
ధర్మవరం, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ
జీవిత భాగస్వామి ఎం.జయలక్ష్మి
సంతానం 2
నివాసం పెనుకొండ
వృత్తి రాజకీయ నాయకుడు

మాలగుండ్ల శంకర నారాయణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ఆయన 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పెనుకొండ శాసనసభ నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచాడు.[2] శంకర నారాయణ ప్రస్తుతం రోడ్లు, భవనాలశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.[3]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

మాలగుండ్ల శంకర నారాయణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనంతపురం జిల్లా, ధర్మవరంలో 1965, జనవరి 1న పెద్దయ్య, యశోదమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన నాగార్జున సాగర్ లోని ఏ.పి.రెసిడెన్సియల్ డిగ్రీ కళాశాల నుండి బీకామ్ పూర్తి చేశాడు. అనంతరం ఎస్.జె రేణుకాచార్య కళాశాల, బెంగళూరు యూనివర్సిటీ నుండి ఎల్.ఎల్.బి పట్టా అందుకున్నాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

శంకర నారాయణ 1995లో తెలుగుదేశం పార్టీలో చేరాడు. 2005లో జరిగిన ధర్మవరం మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి కౌన్సిలర్ గా గెలుపొందాడు. శంకర నారాయణ 2011లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఆయన 2012 నుండి అనంతపురం జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాడు. ఆయన 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నుండి పెనుకొండ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పెనుకొండ నియోజకవర్గం నుండి రెండవసారి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచాడు. శంకర నారాయణ 2019, జూన్ 8న వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ లో బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు.[4][5][6] మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా 26 జూలై 2020న రోడ్లు, భవనాలశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.[7]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (8 June 2019). "శంకరనారాయణ అనే నేను." Archived from the original on 23 September 2021. Retrieved 23 September 2021.
  2. Sakshi. "Penukonda Constituency Winner List in AP Elections 2019 | Penukonda Constituency Election Results 2019". www.sakshi.com. Archived from the original on 10 May 2021. Retrieved 10 May 2021.
  3. Sakshi (29 July 2020). "బాధ్యతలు చేపట్టిన మంత్రి శంకర్‌ నారాయణ". Sakshi. Archived from the original on 10 May 2021. Retrieved 10 May 2021.
  4. Mana Telangana (8 June 2019). "కొలువుదీరిన ఎపి కొత్త మంత్రులు..." Archived from the original on 10 May 2021. Retrieved 10 May 2021.
  5. The Hans India, Sambasiva Rao (8 June 2019). "AP new Cabinet Ministers portfolios". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 10 May 2021. Retrieved 10 May 2021.
  6. Sakshi (21 July 2020). "సంతోషంగా బీసీలు". Archived from the original on 10 May 2021. Retrieved 10 May 2021.
  7. Sakshi (30 July 2020). "మంత్రుల బాధ్యతల స్వీకరణ". Archived from the original on 10 May 2021. Retrieved 10 May 2021.