Jump to content

వినుకొండ

అక్షాంశ రేఖాంశాలు: 16°03′N 79°45′E / 16.05°N 79.75°E / 16.05; 79.75
వికీపీడియా నుండి
(Vinukonda నుండి దారిమార్పు చెందింది)
వినుకొండ
విష్ణుకుండినపురం, శ్రుతగిరి
పట్టణం
వినుకొండ నంద్యాల రైలు మార్గం, నల్లమల అడివి హద్దు దగ్గర
వినుకొండ నంద్యాల రైలు మార్గం, నల్లమల అడివి హద్దు దగ్గర
వినుకొండ is located in ఆంధ్రప్రదేశ్
వినుకొండ
వినుకొండ
Location in Andhra Pradesh, India
Coordinates: 16°03′N 79°45′E / 16.05°N 79.75°E / 16.05; 79.75
Countryభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాపల్నాడు
పట్టణం29 May 2015
Government
 • Typeపురపాలక సంఘం
విస్తీర్ణం
 • Total22.82 కి.మీ2 (8.81 చ. మై)
Elevation95 మీ (312 అ.)
జనాభా
 (2011)[3][4]
 • Total59,725
 • జనసాంద్రత2,600/కి.మీ2 (6,800/చ. మై.)
భాషలు
 • అధికారతెలుగు
Time zoneUTC+5:30 (IST)
పిన్‌కోడ్
522 647
Vehicle registrationAP-39
వినుకొండ నుంచి హైదరాబాద్, గుంటూరుకు రోడ్డు
వినుకొండ

వినుకొండ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పల్నాడు జిల్లాలోని ఒక పట్టణం, వినుకొండ మండలానికి కేంద్రం.

చరిత్ర

[మార్చు]

వినుకొండ అన్న పేరు, శ్రీరాముడు సీతాదేవి అపహరణ గురించి వినడం జరిగింది కాబట్టి విను అన్న క్రియను బట్టి ఆ పేరు వచ్చిందని లోకనిరుక్తి ఉంది. ఈ నిరుక్తిని అనుసరించి తెలుగు, సంస్కృత పండితులు ఈ పేరును సంస్కృతీకరించి శృతగిరి పురం (శృత= విను, గిరి= కొండ, పురం= పట్టణం/నగరం) అన్న పదం కల్పించారు.[5] [నోట్ 1]

మెగాలిథిక్ కట్టడాలు పట్టణం చుట్టుప్రక్కల కనుగొనబడ్డాయి.[ఆధారం చూపాలి] 1000–1400 CE నాటి శిలాశాసనాలు చాలా పురాతన దేవాలయాలలో వున్నాయి. విష్ణుకుండినులనబడే రాజులు ఈ ప్రాంతాన్ని 1000 CE కాలంలో పరిపాలించారు. [ఆధారం చూపాలి] మధ్యయుగంలో కొండపై కోట వుండేది. 1640 లో నిర్మించిన జామియా మసీదు మహమ్మదీయ పాలకుల గుర్తుగా మిగిలివుంది[6].

భౌగోళికం

[మార్చు]

జిల్లా కేంద్రమైన నరసరావుపేట నుండి నైరుతి దిశలో 44 కి.మీ. దూరంలో వుంది.

జనగణన వివరాలు

[మార్చు]

2011 జనగణన ప్రకారం పట్టణ జనాభా 59,725.

పరిపాలన

[మార్చు]

1952లో వినుకొండ శాసనసభ్యులుగా గెలుపొందిన పులుపుల వెంకటశివయ్య, 1953లో వినుకొండ పంచాయతీ సర్పంచిగా ఎన్నికైనాడు. రెండు పదవులలో 1955 దాకా ఉన్నాడు. సర్పంచిగా 1964 వరకూ పనిచేశాడు. 1962లో మూడోసారి జరిగిన శాసనసభ ఎన్నికలలో గెలుపొంది శాసనసభ్యులుగా 8 ఏళ్ళు పనిచేశాడు. సర్పంచిగా 11 ఏళ్ళు పనిచేశాడు. నిరాడంబరుడైన ఇతని స్మృతి చిహ్నంగా పట్టణం నడిబొడ్డున స్మారకస్థూపం ఏర్పాటుచేశారు. పఠాన్ కాశింఖాన్ వినుకొండ గ్రామ సర్పంచిగా 20 ఏళ్ళు పనిచేశాడు. 29.1.2018 న ఇతని విగ్రహం కోటనాల బజారులో నెలకొల్పారు. ఇతను పులుపుల వెంకటశివయ్య శిష్యుడు.

2005 మే 29 న మూడవ గ్రేడ్ పురపాలక పట్టణం గా గుర్తింపు పొందింది. 2018 లో రెండవ గ్రేడ్ పురపాలక పట్టణం గా మార్చబడింది. మాచర్ల పురపాలక సంఘం పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది.

రవాణా సౌకర్యం

[మార్చు]
పటం
Map

పట్టణం రోడ్ల మొత్తం నిడివి106.70 కి.మీ. (66.30 మై.).[7] ఈ పట్టణం గుంటూరు -కర్నూలు -బళ్లారి ప్రధాన రహదారిపై వుంది. రైల్వే స్టేషన్ దక్షిణ మధ్య రైల్వే లోని గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో గుంటూరు - గుంతకల్ రైలు మార్గం పై వుంది.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]

దేవాలయాలు

[మార్చు]
  • శ్రీ ప్రసన్న రామలింగేశ్వరస్వామివారి ఆలయం: కొండమీద ఉంది
  • శ్రీ మదమంచిపాటి వీరాంజనేయస్వామివారి ఆలయం: వినుకొండకు ఏడు కి.మీ.దూరంలో, గుండ్లకమ్మ నదీ తీరాన వున్నది. ప్రతి సంవత్సరం చైత్ర బహుళ పంచమినాడు, స్వామివారి తిరునాళ్ళను వైభవంగా నిర్వహించుచున్నారు. . ఈ తిరునాళ్ళ సందర్భంగా ఎడ్ల బలప్రదర్శన పోటీలు నిర్వహించి, గెలుపొందిన ఎడ్ల యజమానులకు బహుమతులు అందజేసెదరు.
  • శ్రీ రంగనాయక స్వామి దేవాలయం, పద్మావతి సమేత వెంకటేశ్వర దేవాలయం, తిమ్మాయపాలెం: వినుకొండ పట్టణానికి కేవలం 3 కిలోమీటర్లు దూరంలో ఉన్న తిమ్మాయపాలెం గ్రామములో శ్రీ కృష్ణ దేవరాయలు కట్టించాడు. ఆ దేవాలయాల చుట్టూ పచ్చని పొలాలు,కోనేరు అలాగే తిమ్మాయపాలెం కొండ, చూడడానికి చాలా అద్భుతంగా ఉంటాయి కొన్నేళ్ల క్రితం తిమ్మాయపాలెం గ్రామస్థులు అక్కడ తిరునాళ్లు జరిపేవారు

వందేళ్ల చరిత్ర ఉన్న చెట్లు

[మార్చు]
  • వినుకొండ పట్టణానికి అతి చేరువగా ఉన్న విఠంరాజుపల్లె వాటి పుట్టిల్లు. నరసరావుపేట రోడ్డు అంచున గుబురుగా కనిపిస్తాయి. చెరువు గట్టు మీద ఉండటంతో చల్లటి ఆహ్లాదాన్నిస్తుంది. గ్రామస్థులు, ప్రయాణికులు ఏ మాత్రం ఖాళీ ఉన్నా ఈ చెట్టు నీడలో సేదదీరుతారు. వేసవిలో ఖాళీ ఉండకుండా ఉంటారు.
  • వివాహానికి ముందు వెంకటేశ్వర స్వామికి ఎదురు నడిచే ప్రతి ఒక్కరూ మార్కాపురం రోడ్డులో ఉన్న రావిచెట్టుకు పూజలు చేయాల్సిందే. ఇక్కడ పూర్వకాలం నుంచి వేపచెట్టు, రావిచెట్టు కలిసి ఉండేవి. రెండింటినీ కలిపి పూజించి వాటికి పెళ్ళిచేస్తే కొత్త దంపతులకు దోషాలు అన్నీ పోతాయన్నది ఇక్కడి వారి నమ్మకం. ఇటీవల రోడ్డు విస్తరణలో వేపచెట్టు మాయమైంది. మిగిలిన ఒక్క చెట్టుకు ఇప్పటికీ పూజలు జరుగుతున్నాయి.
  • ఏనుగుపాలెం రోడ్డులో గోనుగుంట్లవారిపాలెం ఉంది. గతంలో ఇక్కడ ఊరు ఉండేది కాదు. హసన్నాయునిపాలెం, పెదకంచర్ల గ్రామాల నుంచి వలస వచ్చి ఇళ్లు కట్టుకున్నారు. ఆర్‌.అండ్‌.బి. రోడ్డు అంచున పెద్ద రావి చెట్టు ఉంది. పక్క గ్రామాల ప్రజలు అక్కడే బస్సు దిగి వెళ్లే వారు. .
  • పట్టణంలోని అంకాళమ్మ గుడి ముందు ఏపుగా ఎదిగిన రావిచెట్టుకు వందేళ్లు ఉన్నాయి. నరసరావుపేట జమీందారు కాలంలో నిర్మించిన ఈ గుడికి నిత్యం వచ్చే భక్తులు అమ్మవారితోపాటు చెట్టును కూడా పూజించడం విశేషం. 108 సార్లు ప్రదిక్షణం చేస్తే కోరిన కోర్కెలు తీరుతాయన్నది ఇక్కడి వారి విశ్వాసం. చెట్టు కింద ఎత్త్తెన అరుగు వేశారు. అటు దానికి రక్షణ ఇటు ప్రజలకు ఉపయోగం ఒనగూరుతోంది.
  • ముళ్లమూరు బస్టాండులో శృంగారవనం ముందు మహాలక్ష్మమ్మ చెట్టు ఉంది. దీనికి నిత్య పూజలు చేస్తారు. ప్రారంభంలో వేప చెట్టు వరకు ఉండేది. ఇప్పుడు చుట్టుపక్కల వ్యాపారులు, ప్రజలు అరుగు కట్టించి అక్కడ అమ్మవారికి చిన్న గుడి కట్టించారు. ఏటా తొలిఏకాదశి నాడు చెట్టుకు విద్యుత్తు బల్బులు అలంకరిస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ప్రధాన పంటలు

[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

విశేషాలు

[మార్చు]

వినుకొండ పాలు, స్వీట్స్

[మార్చు]

నాణ్యత, రుచికి వినుకొండ పాలు ప్రసిద్ధి. మెట్ట ప్రాంతం కావడంతో పాలు నాణ్యంగా, అత్యంత ప్రత్యేకంగా ఉంటాయని పశు వైద్యాధికారులు నిర్ధారించారు. పాలలో వెన్న, ఇతర పదార్థాలు (ఎస్‌.ఎన్‌.ఎఫ్‌.) అత్యధికంగా ఉండటంతో 90 శాతం డెయిరీలు ఇక్కడి పాలను సేకరించేందుకు మక్కువ చూపుతున్నాయి. ఇక్కడి పాలు గది ఉష్ణోగ్రతలో ఎక్కువ సేపు నిల్వ ఉంటాయి. సంగం డెయిరీ, హెరిటేజ్‌, తిరుమల, జెర్సీతోపాటు మొత్తం ఆరు పాల శీతలీకరణ కేంద్రాలు ఏర్పాటయ్యాయి.

ప్రముఖులు

[మార్చు]

నోట్స్

[మార్చు]
  1. వినుకొండకు చెందిన జాషువా కవితలో "రఘురామ వీరవరుడు పృథివి జాతాపహరణంబు విన్నచోటు శృతగిరి పురంబు నాది" అని ఈ ఊరి గురించి చెప్పుకోవడంలో ఈ లోకనిరుక్తి, సంస్కృతీకరించిన గ్రామనామం రెండూ కనిపిస్తాయి.

మూలాలు

[మార్చు]
  1. "Municipalities, Municipal Corporations & UDAs" (PDF). Directorate of Town and Country Planning. Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 28 January 2016. Retrieved 29 January 2016.
  2. "Elevation for Vinukonda". Veloroutes. Archived from the original on 12 ఆగస్టు 2014. Retrieved 5 August 2014.
  3. "Census 2011". The Registrar General & Census Commissioner, India. Retrieved 5 August 2014.
  4. "Statistical Abstract of Andhra Pradesh, 2015" (PDF). Directorate of Economics & Statistics. Government of Andhra Pradesh. p. 43. Archived from the original (PDF) on 14 July 2019. Retrieved 26 April 2019.
  5. కేతు విశ్వనాథరెడ్డి. కడప ఊర్ల పేర్లు. p. 126.
  6. W. Francis (1989). Gazetteer of South India. Mittal Publications. pp. 328–. GGKEY:4Y158YFPNGZ. Retrieved 19 June 2012.
  7. "Details of Roads in Each ULB of Andhra Pradesh". Commissioner and Directorate of Municipal Administration. Municipal Administration and Urban Developmemt Department – Government of Andhra Pradesh. Archived from the original on 1 ఆగస్టు 2016. Retrieved 28 మార్చి 2017.

వెలుపలి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=వినుకొండ&oldid=4381483" నుండి వెలికితీశారు