Jump to content

మనిషి మోసే ట్యాంకు విధ్వంసక క్షిపణి

వికీపీడియా నుండి
(MPATGM నుండి దారిమార్పు చెందింది)
మనిషి మోసుకెళ్ళే ట్యాంకు విధ్వంసక క్షిపణి
2019 సెప్టెంబరు 11 ని పరీక్షించిన క్షిపణి
రకంట్యాంకు విధ్వంసక గైడెడ్ క్షిపణి
అభివృద్ధి చేసిన దేశంభారతదేశం
ఉత్పత్తి చరిత్ర
డిజైనరుDRDO & వేమ్ టెక్నాలజీస్
తయారీదారుభారత్ డైనమిక్స్ లిమిటెడ్[1]
విశిష్టతలు
బరువు14.5 కి.గ్రా. (32 పౌ.)[2]
పొడవు1,300 mమీ. (4 అ. 3 అం.)[2]
వ్యాసం120 mమీ. (4.7 అం.)[2]
వార్‌హెడ్High-explosive anti-tank warhead (HEAT)[1]

ఆపరేషను
పరిధి
2.5 కి.మీ.
గైడెన్స్
వ్యవస్థ
Imaging infra-red (IIR) seeker

మనిషి మోసే ట్యాంకు విధ్వంసక క్షిపణి [3] మ్యాన్ పోర్టబుల్ యాంటీ-ట్యాంక్ గైడెడ్ క్షిపణి (ఎమ్‌పిఎటిజిఎమ్), ఇది భారతీయ మూడవ తరం ఫైర్-అండ్- ఫర్గెట్ ట్యాంకు విధ్వంసక గైడెడ్ క్షిపణి. దీన్ని భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ అభివృద్ధి చేస్తోంది. [2] [1] [4] ఈ క్షిపణికి మాతృక నాగ్ క్షిపణి.

రూపకల్పన

[మార్చు]

ఎమ్‌పిఎటిజిఎమ్ తక్కువ బరువుతో, ఫైర్-అండ్-ఫర్గెట్ ట్యాంకు విధ్వంసక క్షిపణి. [4] దీనికి హై-ఎక్స్ప్లోజివ్ యాంటీ ట్యాంక్ (HEAT) వార్‌హెడ్‌ను అమర్చారు. ఈ క్షిపణి పొడవు 1,300 మి.మీ., వ్యాసం 120 మి.మీ. బరువు 14.5 kg. దాని కమాండ్ లాంచ్ యూనిట్ (CLU) బరువు 14.25 కిలోలు. దీని పరిధి సుమారు 2.5 కి.మీ.. ఎమ్‌పిఎటిజిఎమ్ లో ఇంటెగ్రేటెడ్ ఏవియానిక్స్‌తో కూడుకున్న అధునాతన ఇమేజింగ్ ఇన్‌ఫ్రారెడ్ రాడార్ (IIR) సీకర్‌ ఉంది. ఈ క్షిపణికి పైనుండి దాడి చేసే (టాప్ ఎటాక్) సామర్ధ్యం ఉంది.

ఇది FGM-148 జావెలిన్, వంటి వ్యవస్థలతో పోటీగా నిలుస్తుంది. స్పైక్ (ATGM) కంటే సాంకేతికంగా మెరుగైనదిగా భావిస్తున్నారు. [5]

అభివృద్ధి

[మార్చు]

DRDO 2005 లో నాగ్ క్షిపణి యొక్క మ్యాన్-పోర్టబుల్ రకంపై పని ప్రారంభించింది. [6] ఎమ్‌పిఎటిజిఎమ్ అభివృద్ధి కోసం సాంకేతిక పరిజ్ఞానం కొనాల్సిన అవసరం లేదని నిర్ణయించిన తరువాత భారత్, 2017 డిసెంబర్ 20 న, DRDO ఇజ్రాయిల్‌కు చెందిన స్పైక్ (ATGM) ను కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. [7] అయితే, 2018 జనవరిలో ఇజ్రాయిల్ ప్రధాన మంత్రి భారతదేశంలో పర్యటించిన సందర్భంగా ఈ ఒప్పందాన్ని పునరుద్ధరించింది.[8] 2021 నాటికి ఎమ్‌పిఎటిజిఎమ్ ని అందిస్తామని DRDO వాగ్దానం చేయడంతో 2019 జూన్‌లో భారత్ ఒప్పందాన్ని మళ్లీ రద్దు చేసుకుంది. [9] అయితే, ఈ క్షిపణి మోహరింపుకు సిద్ధమయ్యే లోపు అవసరాల కోసం భారత సైన్యం పరిమిత సంఖ్యలో స్పైక్ (ATGM) ను కొనుగోలు చేసింది. [5]

ఉత్పత్తి సౌకర్యాలు

[మార్చు]

ఎమ్‌పిఎటిజిఎమ్ ను భారత్ డైనమిక్స్ లిమిటెడ్ తెలంగాణలోని భానూరులో ఉన్న కర్మాగారంలో తయారు చేస్తుంది. ఈ కర్మాగారాన్ని 2018 సెప్టెంబరు 29 న ప్రారంభించారు. [10]

పరీక్షలు

[మార్చు]
ఎమ్‌పిఎటిజిఎమ్ ను 2018 సెప్టెంబరు 16 న పరీక్షించారు.

2018 సెప్టెంబరు 15 న, DRDO ఎమ్‌పిఎటిజిఎమ్ యొక్క మొదటి పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. ఆ తరువాత 2018 సెప్టెంబరు 16 న మరోసారి విజయవంతంగా పరీక్షించింది. [3] [11]

2019 మార్చి 13 న రాజస్థాన్ ఎడారిలో ఎమ్‌పిఎటిజిఎమ్ ను విజయవంతంగా పరీక్షించింది. మరుసటి రోజునే మరో విజయవంతమైన పరీక్ష జరిపింది. [12] [13]

2019 సెప్టెంబరు 11 న మళ్లీ ఈ క్షిపణిని పరీక్షించారు. పరీక్షలో మనిషి మోసుకెళ్ళగల త్రిపాద లాంచరును ఉపయోగించారు. ఈ పరీక్షలో క్షిపణి తన లక్ష్యమైన డమ్మీ ట్యాంకును పైనుంచి దాడి పద్ధతిలో ఛేదించింది. [14]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 "MPATGM: Man Portable Anti-Tank Guided Missile production facility opened at Bharat Dynamics Ltd". 1 October 2018.
  2. 2.0 2.1 2.2 2.3 Dhingra, Jayesh (22 February 2019). "Aero India 2019: DRDO details short-range MPATGM".
  3. 3.0 3.1 "Second Flight Test of MPATGM Successful". 16 September 2018.
  4. 4.0 4.1 Geetanath, V. (14 March 2019). "Anti-tank missile developed by DRDO successfully fired". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2019-08-13.
  5. 5.0 5.1 "Army inducts Israeli 'tank killers' till DRDO develops indigenous ones". The Times of India. October 4, 2019. Retrieved 4 October 2019.
  6. M. Somasekhar (24 March 2005). "Helicopter version of Nag under way". Archived from the original on 27 నవంబరు 2006. Retrieved 19 అక్టోబరు 2019.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  7. "India scraps mega Israeli deal for anti-tank missiles in favor of DRDO product" (PDF). 6 March 2018.
  8. Gady, Franz-Stefan. "Report: India Scraps Israel Anti-Tank Guided Missiles Deal (Again)".
  9. Ranjan, Amitav (2019-06-24). "India scraps Israel anti-tank missile deal after DRDO says it will deliver".
  10. "Production facility for man-portable anti-tank missiles opened". The Economic Times. 1 October 2018. Retrieved 2019-08-15.
  11. Gady, Franz-Stefan (September 16, 2018). "India's DRDO Test Fires Indigenous Man Portable Anti-Tank Guided Missile".
  12. "Twin Success for Man Portable Anti Tank Guided Missile". 14 March 2019.
  13. "Anti-tank guided missile test-fired successfully". The Economic Times. 14 March 2019. Retrieved 2019-07-08.
  14. Reporter, Staff (2019-09-11). "DRDO successfully tests indigenous anti-tank missile". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2019-09-12.