సాగరిక క్షిపణి
K-15/సాగరిక | |
---|---|
దస్త్రం:BO5 K15 missile.jpg | |
రకం | Short-range SLBM |
అభివృద్ధి చేసిన దేశం | భారత దేశము |
సర్వీసు చరిత్ర | |
సర్వీసులో | 2010 |
వాడేవారు | భారత నావికా దళం |
ఉత్పత్తి చరిత్ర | |
తయారీదారు | భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO) |
విశిష్టతలు | |
బరువు | 6–7 ట. (6.6–7.7 short tons)[1][2] |
పొడవు | 10 మీ. (33 అ.) |
వ్యాసం | 0.74 మీ. (2.4 అ.) |
వార్‌హెడ్ | 1,000 కి.గ్రా. (2,200 పౌ.) |
ఇంజను | రెండు దశల ఘన ఇంధన రాకెట్ మోటార్లు |
ఆపరేషను పరిధి | |
లాంచి ప్లాట్‌ఫారం | అరిహంత్ శ్రేణి జలాంతర్గాములు |
సాగరిక (K-15) జలాంతర్గామి నుంచి ప్రయోగించే అణ్వాయుధ సామర్థ్యం గల బాలిస్టిక్ క్షిపణి. దీని పరిధి 750 కిలోమీటర్లు.[3] ఇది కె క్షిపణి కుటుంబానికి చెందినది. భారత అణ్వాయుధ త్రయంలో ఇది ఒక భాగం. ప్రత్యర్థులపై ప్రతీకార దాడులకు ఇది ఉపయోగపడుతుంది.[6]
అభివృద్ధి
[మార్చు]K-15 క్షిపణి అభివృద్ధి 1990 ల చివర్లో మొదలైంది. అరిహంత్ శ్రేణి జలాంతర్గాముల నుండి ప్రయోగించగల బాలిస్టిక్ క్షిపణిని తయారుచెయ్యడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం.[7][8] హైదరాబాదులోని డిఫెన్స్ రిసెర్చి అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) యొక్క క్షిపణి ప్రాంగణంలో దీన్ని తయారుచేసారు.[9]
నీటి లోపలి నుండి ప్రయోగించగల క్షిపణి ప్రయోగ వేదిక, ప్రాజెక్ట్-420, ని తయారుచేసి పరీక్షల కోసం 2001 లో భారత నావికా దళానికి అందజేసారు. దీన్ని గుజరాత్ లోని హజీరాలో తయారుచేసారు.[10] సాగరిక క్షిపణిని అరిహంత్ జలాంతర్గామితో మేళవించి, నౌకాశ్రయ పరీక్షలు చెయ్యడం 2009 జూలై 26 న మొదలైంది.[11]
2008 నాటికి క్షిపణిని 7 సార్లు విజయవంతంగా పరీక్షించారు. నాలుగు సార్లు దాని పూర్తి పరిధిని పరీక్షించారు. 2008 ఫిబ్రవరి 26 న విశాఖపట్నంతీరప్రాంతంలో సముద్రంలో 50 మీటర్ల లోతున ఒక పాంటూన్ నుండి పరీక్షించారు.[7][9][12][13] 2008 నవంబరు 12 న భూమ్మీద నుండి ప్రయోగించగల సాగరికను విజయవతంగా ప్రయోగించారు.[14] 2012 మార్చి 11 న పూర్తి స్థాయి పరీక్ష జరిపారు.[15] 2013 జనవరి 27 న 12 వది, చిట్టచివరిదీ అయిన పరీక్షను జరిపారు. 'ఈ పరీక్ష అన్ని లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో సాధించింది' అని DRDO డైరెక్టర్ జనరల్, వికె సరస్వత్ చెప్పాడు.[16] ఆ తరువాత క్షిపణిని అరిహంత్ లో చేర్చడానికి ప్రయత్నాలు మొదయ్యాయి.[17][18][19] 2015 నవంబరు 15 న ఆయుధాలు లేని డమ్మీ K-15 సాగరిక క్షిపణిని అరిహంత్ నుండి విజయవంతంగా పరీక్షించారు[20]. 2015 డిసెంబరులో సాగరిక ఉత్పత్తి మొదలైందని వార్తలు వచ్చాయి.[21]
ఇవి కూడా చూడండి
[మార్చు]References
[మార్చు]- ↑ "India successfully test-fires underwater missile". The Hindu. 27 January 2013. Retrieved 1 February 2013.
- ↑ "Sagarika missile test-fired successfully". The Hindu. 27 February 2008. Archived from the original on 29 ఫిబ్రవరి 2008. Retrieved 1 February 2013.
- ↑ 3.0 3.1 http://www.timesofindia.com/india/India-tests-new-underwater-nuclear-missile/articleshow/32694060.cms
- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2018-09-21. Retrieved 2016-07-22.
- ↑ Rajat Pandit (2008-05-13). "Going ballistic: India looks to join elite missile club". The Times of India. Archived from the original on 2013-12-08. Retrieved 2013-05-02.
- ↑ "India gets sub-marine missile power". Ibnlive.com. 2007-07-07. Archived from the original on 2008-06-17. Retrieved 2013-05-02.
- ↑ 7.0 7.1 "Final test of K-15 ballistic missile on Tuesday : Latest Headlines, News - India Today". Indiatoday.intoday.in. 2008-02-25. Retrieved 2013-05-02.
- ↑ "India ready for new missile test". BBC News. 1998-09-04. Retrieved 2013-05-02.
- ↑ 9.0 9.1 "Sagarika missile test-fired successfully". Hindu.com. 2008-02-27. Archived from the original on 2008-02-29. Retrieved 2013-05-02.
- ↑ "In a workshop at Hazira, Indian underwater missile launcher gets ready for trial". Indianexpress.com. 2001-05-28. Retrieved 2013-05-02.
- ↑ "thaindian.com/newsportal/india-news India joins elite group". Thaindian.com. 2009-07-27. Archived from the original on 2012-10-06. Retrieved 2013-05-02.
- ↑ Rajat Pandit (2008-02-19). "India ready to join elite N-strike club". The Times of India. Archived from the original on 2012-10-19. Retrieved 2013-05-02.
- ↑ "India can now fire missiles from under water". Ibnlive.com. 2008-05-12. Archived from the original on 2008-09-16. Retrieved 2013-05-02.
- ↑ India test-fires nuclear-capable missile[permanent dead link] [dead link]
- ↑ "K15 test fired". Ibnlive.in.com. 2012-03-13. Archived from the original on 2012-03-16. Retrieved 2013-05-02.
- ↑ "K-15 SLBM is a beast with gen-next tech". Indian Express. 30 January 2013. Archived from the original on 4 ఫిబ్రవరి 2013. Retrieved 5 February 2013.
- ↑ "India test fires missile from under sea, completes nuclear triad". NDTV. 27 January 2013. Retrieved 27 January 2013.
- ↑ "India successfully test-fires underwater missile". The Hindu. 27 January 2013. Retrieved 27 January 2013.
- ↑ "Report: India successfully tests nuclear-capable, medium-range missile". The Washington Post. 27 January 2013. Archived from the original on 28 జనవరి 2013. Retrieved 27 January 2013.
- ↑ Luthra, Gulshan (26 November 2015). "Nuclear capable Arihant submarine successfully test-fires unarmed missile". The Economic Times. Archived from the original on 28 జనవరి 2016. Retrieved 26 November 2015.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-09. Retrieved 2016-07-22.