ఆకాశ్ క్షిపణి
ఆకాశ్ క్షిపణి | |
---|---|
రకం | మొబైలు భూమి నుండి గాల్లోకి క్షిపణి వ్యవస్థ |
అభివృద్ధి చేసిన దేశం | భారతదేశం |
సర్వీసు చరిత్ర | |
సర్వీసులో | 2009 నుండీ |
వాడేవారు | భారత సైన్యం భారతీయ వాయు సేన |
ఉత్పత్తి చరిత్ర | |
డిజైనరు | DRDO |
తయారీదారు | Ordnance Factories Board భారత్ డైనమిక్స్ లిమిటెడ్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ |
తయారీ తేదీ | 2009-present |
తయారు చేసిన సంఖ్య | 3000 క్షిపణులు[1] |
విశిష్టతలు | |
బరువు | 720 కి.గ్రా. (1,590 పౌ.) |
పొడవు | 578 cమీ. (228 అం.) |
వ్యాసం | 35 cమీ. (14 అం.) |
వార్‌హెడ్ | High-explosive, pre-fragmented warhead |
వార్‌హెడ్ బరువు | 60 కి.గ్రా. (130 పౌ.) |
పేలుడు మెకానిజమ్ | RF ప్రాక్సిమిటీ ఫ్యూజు |
ప్రొపెల్లెంటు | integral rocket motor/ramjet booster and sustainer motor |
ఆపరేషను పరిధి | 30 కి.మీ. (19 మై.)[2] |
ఫ్లైట్ సీలింగు | 18 కి.మీ. (59,000 అ.) |
వేగం | మ్యాక్ 2.5[2] |
గైడెన్స్ వ్యవస్థ | Command guidance |
ఆకాశ్, భారత రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ అభివృద్ధి చేసిన మధ్యమ పరిధి క్షిపణి రక్షక వ్యవస్థ. భారత్ డైనమిక్స్ లిమిటెడ్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ బోర్డ్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లు కూడా ఇందులో పాలుపంచుకున్నాయి.[3][4] 30 కి.మీ. దూరంలో, 18,000 మీ. ఎత్తులో ఎగురుతున్న విమానాలను ఈ క్షిపణి ఛేదించగలదు.[5] గాల్లో ఎగురుతున్న యుద్ధ విమానాలు, క్రూయిజ్ క్షిపణులు, గాలి నుండి భూమికి ప్రయోగించే క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణులనూ నిర్వీర్యం చెయ్యగల సామర్థ్యం ఈ క్షిపణికి ఉంది.[6][7][8][9] దీన్ని భారత సైన్యం, భారతీయ వాయుసేనల్లో మోహరించారు.
ఒక్కో ఆకాశ్ బ్యాటరీలో నాలుగు లాంచర్లు, ఒక్కో లాంచరులో మూడేసి క్షిపణులూ ఉంటాయి. ఇందులో ఒక రాజేంద్ర 3D పాసివ్ ఎలక్ట్రానికల్లీ స్కాన్‌డ్ ఎర్రే రాడార్ కూడా ఉంటుంది. ప్రతీ బ్యాటరీ ఏకకాలంలో 64 లక్ష్యాలను పరిశీలించగలదు. వాటిలో 12 లక్ష్యాలను ఛేదించగలదు. ఒక్కో క్షిపణిలో 60 కి.గ్రా. శకలాలతో కూడుకున్న వార్‌హెడ్ ఉంటుంది. ఆకాశ్ వ్యవస్థ తేలిగ్గా ప్రయాణించగలిగినది, వాహన శ్రేణితో కలిసి ప్రయాణిస్తూ దాన్ని సంరక్షించగల సామర్థ్యం కలిగినది. లాంచి ప్లాట్‌ఫారము చక్రాల బళ్ళమీదా, ట్రాకు బళ్ళ మీదా కూడా ప్రయాణించ గలదు. ఆకాశ్ వ్యవస్థను ప్రాథమికంగా గగన రక్షక వ్యవస్థగా రూపొందించినప్పటికీ, దాన్ని క్షిపణి రక్షక వ్యవస్థగా కూడా పరీక్షించారు. ఇది 2,000 చదరపు కి.మీ. ప్రాంతంలో గగన తలాన్ని రక్షించగలదు. ఆకాశ్ క్షిపణులు, సంబంధిత రాడార్ల కోసం భారతీయ సైనిక దళాలు ₹ 23,300 కోట్ల వరకూ ఆర్డర్లు వేసారు.[10][11]
అభివృద్ధి, చరిత్ర
[మార్చు]మార్క్-1
మొట్టమొదటి ఆకాశ్ పరీక్ష 1990 లో జరిగింది. 1997 వరకూ అభివృద్ధి పరీక్షలు జరిగాయి.
2005 లో వేగంగా కదులుతున్న రెండు లక్ష్యాలను, రెండు ఆకాశ్ క్షిపణులు ఛేదించాయి. 3-D సెంట్రల్ ఎక్విజిషన్ రాడార్ పనితీరు కూడా పూర్తిగా నిరూపితమయింది.[12][13]
ఆకాశ్ క్షిపణి అభివృద్ధికి ₹ 1,000 కోట్లు ఖర్చైంది. ఇలాంటి క్షిపణుల కోసం ఇతర దేశాలు పెట్టిన ఖర్చులో ఇది 8 నుండి పదో వంతు మాత్రమే. ఆకాశ్‌కు కొన్ని ప్రత్యేకతలున్నాయి: ఒకచోటి నుండి మరోచోటికి ప్రయాణించగల వీలు, లక్ష్యాన్ని ఛేదించే వరకూ చోదక స్థితిలో ఉండడం, బహుళ లక్ష్యాలను ఛేదించ గలగడం, పూర్తి ఆటోమాటిక్ ఆపరేషను.
మార్క్-2
2010 జూన్ 11 నాటి రిపోర్టు ప్రకారం, ఆకాశ్ మార్క్-2 అభివృద్ధి మొదలైంది, రెండేళ్ళలో తొలి పరీక్షకు సిద్ధమౌతుంది. అది ఆకాశ్-1 దూర పరిధి గల, మరింత వేగం గల, మరింత కచ్చితత్వం గల క్షిపణి. ఆకాశ్ మార్క్-2 లో ఒక సీకరును అమర్చి దాని మరింత పెద్ద ప్రొఫైలులో ప్రయోగించే సంభావ్యతను పరిశీలిస్తున్నారు.[14]
వివరణ
[మార్చు]క్షిపణి
[మార్చు]30 కి.మీ. పరిధి గల ఆకాశ్ క్షిపణి[2] 35 సెం.మీ. వ్యాసంతో, 5.78 మీ. పొడవుతో 720 కి.గ్రా. బరువుంటుంది. సూపర్‌సోనిక్ వేగంతో ప్రయాణించే ఆకాశ్ వేగం మ్యాక్ 2.5. 18 కి.మీ. ఎత్తున ప్రయాణించే ఆకాశ్‌ను చక్రాల బండి నుండి, ట్రాకు బండి నుండి కూడా ప్రయోగించవచ్చు. 55 కి.గ్రా. శకలాలుగల వార్‌హెడ్‌తో డిజిటల్ ప్రాక్సిమిటీ స్విచ్చి చేర్చి ఉంటుంది. ఈ క్షిపణిలో స్వీయ-నాశక వ్యవస్థ కూడా అమర్చబడి ఉంది. దీన్ని ర్యామ్‌జెట్ రాకెట్ ఇంజను నడుపుతుంది. ఈ ఇంజను కారణంగా క్షిపణి ఒకే వేగంతో ప్రయాణిస్తుంది.[15] దాని ప్రయాణం మొత్తమంతా కమాండ్ గైడెన్స్ నియంత్రణలో ఉంటుంది.[16]
ఆకాశ్ క్షిపణి డిజైను SA-6 ను పోలి ఉంటుంది. రెక్కల మధ్య ఉన్న క్షిపణి దేహపు మధ్యభాగంలో ర్యామ్‌జెట్ ఇంజన్లకు గాలిని తీసుకెళ్ళేందుకు అవసరమైన నాలుగు గొట్టాలుంటాయి. పిచ్/యా నియంత్రణ కోసం నాలుగు త్రికోణాకారపు రెక్కలను అమర్చారు. రోల్ నియంత్రణ కోసం తోకకు కొద్దిగా ముందు ఏలెరాన్‌లు కలిగిన నాలుగు డెల్టా రెక్కలను అమర్చారు. ఆకాశ్‌లో రేడియో ప్రాక్సిమిటీ ఫ్యూజును అమర్చారు.
వ్యవస్థ
[మార్చు]ఒక్కో ఆకాశ్ బ్యాటరీలో నాలుగు లాంచర్లు, ఒక్కో లాంచరులో మూడేసి క్షిపణులూ ఉంటాయి. ఒక రాజేంద్ర రాడారు, ఓ కమాండ్ పోస్టు (బ్యాటరీ నియంత్రణ కేంద్రం) కూడా ఉంటాయి. వాయుసేనలో రెండేసి బ్యాటరీలు ఒక స్క్వాడ్రనుగా మోహరిస్తారు. సైన్యంలో నాలుగు బ్యాటరీలను ఒక ఆకాశ్ గ్రూపుగా ఏర్పాటు చేసారు. రెండు చోట్లా అదనంగా ఒక గ్రూప్ కంట్రోలు సెంటరును (జిసిసి) చేర్చారు. ఇది ఆ స్క్వాడ్రను లేదా గ్రూపుకు కమాండ్ కంట్రోల్ హెడ్‌క్వార్టరుగా పనిచేస్తుంది. ముందస్తు హెచ్చరికల కోసం జిసిసి, సెంట్రల్ ఎక్విజిషన్ రాడారుపై ఆధారపడుతుంది. అయితే, 100 కి.మీ. పరిధిగల బ్యాటరీ సర్వైలెన్స్ రాడారు సాయంతో ఈ బ్యాటరీలను విడివిడిగా కూడా మోహరించవచ్చు .
స్థితి
[మార్చు]ఒక్కో క్షిపణి ధర ₹ 2 కోట్లకు పైనే ఉంది. ఇది పశ్చిమదేశాల క్షిపణుల ధరలో సగాని కంటే తక్కువ.[17] ఉత్పత్తి పెరిగే కొద్దీ ఈ ధర తగ్గుతుంది. భారత సైన్యం, వాయుసేనల ఆర్డర్లు ₹ 23,300 కోట్ల దాకా ఉంది.[18] 2012 మే 24 న ఆకాశ్ సాంకేతికను, సామర్థ్యాన్నీ విజయవంతంగా తిరిగి పరీక్షించారు.[19] జూన్ 1 న 25 కి.మీ. ఆకాశ్ వాయుసేన కూర్పును విజయవంతంగా పరీక్షించారు.[20] 2014 ఆగస్టు 3 న కూడా విజయవంతంగా పరీక్షించారు. ఆకాశ్‌ను వాయుసేనలో ఈసరికే మోహరించగా, సైన్యంలోకి 2015 మే 5 న చేర్చుకున్నారు.[21][22] ఆకాశ్ ఉత్పత్తిని నెలకు 50-60 స్థాయి నుండి 100 కు పెంచనున్నట్లు డి.ఆర్.డి.ఎల్ డైరెక్టరు 2016 మార్చి 16 న ప్రకటించాడు.[23][24]
భారతీయ వాయుసేన
[మార్చు]2007 డిసెంబరులో భారతీయ వాయుసేన వాడుకరి పరీక్షలను పూర్తిచేసింది. 10 రోజుల పాటు జరిగిన ఈ పరీక్షల్లో క్షిపణి బహుళ లక్ష్యాల ఛేదన సామర్థ్యాన్ని పరీక్షించారు. ఈ పరీక్షలు విజయవంతమయ్యాయి. పరీక్షల ఫలితం పట్ల సంతృప్తి చెందిన వాయుసేన, సేనలోకి క్షిపణులను చేర్చుకునేందుకు నిర్ణయించింది. 2009 లో రెండు స్క్వాడ్రన్లను చేర్చుకోగా, మరో 16 స్క్వాడ్రన్ల కోసం ఆర్డరు వేయదలచింది.[25]
వాయుసేన మరో 6 స్క్వాడ్రన్ల కోసం ఆర్డరు వేసినట్లుగా 2010 జనవరిలో వెల్లడైంది. ఒక్కో స్క్వాడ్రనులో 125 క్షిపణులుంటాయి.[26] మొదటి రెండు స్క్వాడ్రన్లలో 48 చొప్పున క్షిపణులుంటాయి[27] మిగతా స్క్వాడ్రన్లలో క్షిపణుల సంఖ్య మారుతూంటుంది. ఈ ఆర్డరు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ పై ₹ 4279 కోట్లకు వేసింది.[28]
2012 మార్చి 3 న హైదరాబాదులో జరిగిన వేడుకలో క్షిపణిని అధికారికంగా వాయుసేనలో చేర్చుకున్నారు.[29]
భారత సైన్యం
[మార్చు]2010 జూన్‌లో రక్షణ రంగ సేకరణ మండలి ₹12,500 కోట్ల విలువైన ఆకాశ్ క్షిపణుల కోసం ఆర్డరు వేసింది.[30]
2015 మే 5 న ఆకాశ్ క్షిపణిని భారత సైన్యంలో చేర్చుకున్నారు.[31]
2015 ఏప్రిల్ 11 నుండి 13 వరకు, భారత సైన్యం ఈ క్షిపణిని ఆరు సార్లు పరీక్షించింది. ఈ పరీక్షల్లో, పైలట్ లేని విమానమైన లక్ష్య ను, మానవరహిత ఎగిరే వాహనమైన బన్‌శీ నీ లక్ష్యాలుగా వాడారు.[32][33][34][35][36][37]
2016 మార్చి 30 న ఆకాశ్ క్షిపణి తమ అవసరాలకు అనుగుణంగా లేదనీ, తమ దాడి దళాలను శత్రు దాడుల నుండి రాక్షించుకునేందుకు అనువుగా లేదనీ భారత సైన్యం ప్రకటించింది. కొత్త రెజిమెంట్ల కోసం దీన్ని ఆర్డరు చెయ్యడం లేదని కూడా తెలిపింది.[38][39]
ఇతరులు
[మార్చు]మలేషియా, థాయిలాండ్, బేలారస్, యుఏఈ, వియత్నామ్, ఆర్మేనియా లు ఆకాశ్ క్షిపణులపై ఆసక్తి చూపించినట్లు వార్తలు వచ్చాయి.[40][41] 2020 డిసెంబరు 30 న భద్రతపై క్యాబునెట్ కమిటీ, ఆకాశ్ క్షిపణి ఎగుమతులకు ఆమోదం తెలిపింది. భారతదేశం నుండి ఆయుధాల దిగుమతి కోసం ఫిలిప్పీన్‌స్, 2021 మార్చిలో ఒక ఒప్పందం చేసుకుంది., అందులో ఆకాశ్ క్షిపణి కూడా భాగం. [42][43][44]
మోహరింపు
[మార్చు]భారతీయ వాయుసేన తన గ్వాలియర్, జల్పాయ్‌గురి, తేజ్‌పూర్, జోర్హాట్, పూనే స్థావరాల వద్ద ఆకాశ్ క్షిపణులను మోహరించింది.[45][46]
భారత సైన్యం మొదటి ఆకాశ్ రెజిమెంటును 2015 జూన్-జూలైల్లో స్థాపించింది. రెండోదాన్ని 2016 లో స్థాపించే ప్రతిపాదన ఉంది.[47]
ఆపరేటర్లు
[మార్చు]- భారతీయ వాయుసేన - 8 ఆకాశ్ స్క్వాడ్రన్లున్నాయి. మరో 7, ఆర్డర్లో ఉన్నాయి (ఒక్కో స్క్వాడ్రన్లో 8 లాంచర్లు, 125 క్షిపణులూ ఉంటాయి) [48]
- భారత సైనిక దళం - 2 ఆకాశ్ రెజిమెంట్లు (ఒక్కో రెజిమెంటులో 24 లాంచర్లుంటాయి)
మూలాలు
[మార్చు]- ↑ "Indian Army Orders Akash Missile System". Aviation Week. 2011-03-25. Archived from the original on 2017-08-27. Retrieved 2012-05-28.
- ↑ 2.0 2.1 2.2 Sify Archived 2010-11-27 at the Wayback Machine article dated 2 Feb 2010, accessed 25 Feb 2010.
- ↑ "AkashSAM.com". Archived from the original on 2012-12-28. Retrieved 2017-01-22.
- ↑ "Guided Threat Systems". International Electronic Countermeasures Handbook. Artech House. 2004. p. 115. ISBN 1-58053-898-3.
{{cite book}}
:|work=
ignored (help) - ↑ Asian tribune: Upgraded version of ‘Akash’ test fired; By Hemanta Kumar Rout[permanent dead link]
- ↑ Akash missile successfully test fired for second day, Dated:November 18, 2014
- ↑ "India Successfully Test Fires Medium-Range Akash Missile". ndtv.com. Retrieved 26 July 2016.
- ↑ http://articles.timesofindia.indiatimes.com/2007-12-13/india/27973517_1_akash-missile-nuclear-capable-multi-target-missile Archived 2012-11-07 at the Wayback Machine Nuclear-capable Akash missile test fired
- ↑ http://www.army-technology.com/projects/akashsurfacetoairmis/ kash Surface-to-Air Missile System, India[నమ్మదగని మూలం?]
- ↑ "Akash Missile Users Give Feedback To DRDO | AVIATION WEEK". Archived from the original on 2017-08-27. Retrieved 2021-12-28.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-08-27. Retrieved 2021-12-28.
- ↑ "IAF initiates process for inducting Akash and Trishul SAM's". Frontier India. Archived from the original on 25 మార్చి 2010. Retrieved 24 December 2014.
- ↑ "Defense19". Retrieved 24 December 2014.
- ↑ "Interview with Dr Avinash Chander, DRDO Chief and Scientific Adviser to Defence Minister". ibnlive. Archived from the original on 10 జనవరి 2015. Retrieved 24 December 2014.
- ↑ The Hindu Archived 2005-12-12 at the Wayback Machine article dated 11 December 2005, accessed 18 October 2006.
- ↑ "AKASH AIR DEFENSE WEAPON SYSTEM". Archived from the original on 2008-01-15. Retrieved 2017-01-22.
- ↑ "The Hindu : National : Akash missile achieves a milestone". Archived from the original on 12 December 2005. Retrieved 24 December 2014.
- ↑ "Bharat Dynamics Limited Signs Largest Ever Deal With Army for Akash Missiles". Archived from the original on 24 డిసెంబరు 2014. Retrieved 24 December 2014.
- ↑ "Surface-to-air Akash missile test fired successfully". The Times Of India. Archived from the original on 2017-08-27. Retrieved 24 May 2012.
- ↑ "Defence News - India Test-Fires Air Force Version Of Akash". Archived from the original on 14 ఆగస్టు 2012. Retrieved 24 December 2014.
- ↑ "Surface-to-air short range Akash missile system to be inducted into Indian Army today". 5 May 2015. Archived from the original on 8 మే 2015. Retrieved 22 జనవరి 2017.
- ↑ "Akash missile system handed over to Indian Army today". 5 May 2015.
- ↑ "India looks to double missile production to 100 per month".
- ↑ "India To Double Akash Missile Production To 100 Per Month". Archived from the original on 2016-03-19. Retrieved 2017-01-22.
- ↑ "IAF Slams Chinese Protest to PM's Arunachal Visit". Archived from the original on 18 జూలై 2011. Retrieved 24 December 2014.
- ↑ IAF orders another 750 Akash surface-to-air missiles
- ↑ "IAF To Get Akash Missiles This Year". Archived from the original on 2017-08-27. Retrieved 2021-12-28.
- ↑ "IAF orders another 750 Akash SAMs". Thaindian News. Archived from the original on 24 December 2014. Retrieved 24 December 2014.
- ↑ Subramanian, T. S. (2 March 2012). "Torpedo, Akash missile to be handed over to Navy and IAF on Saturday". The Hindu. Chennai, India.
- ↑ "Akash Missile System For Indian Army OK'd". Archived from the original on 2017-08-27. Retrieved 2022-01-01.
- ↑ "Akash Missile Supersonic System inducted by Indian Army". Defence Wire. 5 May 2015. Retrieved 5 May 2015.
- ↑ "India test fires Akash supersonic missile".
- ↑ "User Trial of Akash Missile System By Indian Army Successful". Archived from the original on 2016-04-15. Retrieved 2017-01-22.
- ↑ "Akash missile test fired for second consecutive day | Latest News & Updates at Daily News & Analysis" (in అమెరికన్ ఇంగ్లీష్).
- ↑ "Surface-to-air Akash missile successfully test fired in Odisha". Archived from the original on 2016-04-23. Retrieved 2017-01-22.
- ↑ "Akash Missile System Successfully Demonstrates Killing Efficiency". Archived from the original on 2016-04-16. Retrieved 2017-01-22.
- ↑ "Akash missile test fired successfully for third consecutive".
- ↑ "Enough of Akash, says Army as it opts for Israeli missiles - Times of India".
- ↑ "India's Missile Program in Peril as Army Dumps Rs 1,000 Cr Akash Missiles | Indian Defence News".
- ↑ "India, Russia yet to reach breakthrough on Gorshkov". The Times Of India. 9 January 2008. Archived from the original on 2017-08-27. Retrieved 2017-01-22.
- ↑ "Wary of China, India offers Akash surface-to-air missile sys ." The Times Of India. 9 January 2017. Retrieved 2023-01-15.
- ↑ "India, Russia yet to reach breakthrough on Gorshkov". The Times of India. 9 January 2008. Archived from the original on 27 August 2017.
- ↑ "Wary of China, India offers Akash surface-to-air missile systems to Vietnam". Archived from the original on 10 January 2017.
- ↑ "Make in India gets a boost! UAE expresses interest in the Akash surface-to-air missile system". Financial Express. 19 October 2018. Retrieved 19 October 2018.
- ↑ "Akash Air Defence System to be Formally Inducted Into IAF". Archived from the original on 2015-10-30. Retrieved 2015-12-30.
- ↑ "Surface-to-air missile 'Akash' inducted in IAF - Times of India". Retrieved 2015-12-30.
- ↑ "Indian Army gets muscle with Akash missile system - Rediff.com India News". Retrieved 2015-12-30.
- ↑ "Air Force places order with BEL for Akash missile". The Hindu. Chennai, India. 12 January 2009. Archived from the original on 23 September 2009. Retrieved 22 జనవరి 2017.