Jump to content

2019–2023 క్రికెట్ ప్రపంచ కప్ లీగ్ 2

వికీపీడియా నుండి
2019–2023 ICC క్రికెట్ ప్రపంచ కప్ లీగ్ 2
తేదీలు14 August 2019 – 16 March 2023
నిర్వాహకులుఅంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్
క్రికెట్ రకంవన్ డే ఇంటర్నేషనల్
టోర్నమెంటు ఫార్మాట్లుట్రై సీరీస్
ఆతిథ్యం ఇచ్చేవారువివిధ
ఛాంపియన్లు స్కాట్‌లాండ్
(1st title)
పాల్గొన్నవారు7
ఆడిన మ్యాచ్‌లు126
అత్యధిక పరుగులునమీబియా గెర్‌హార్డ్ ఎరాస్మస్ (1298)
అత్యధిక వికెట్లుఒమన్ బిలాల్ ఖాన్ (76)

2019–2023 ఐసిసి క్రికెట్ ప్రపంచ కప్ లీగ్ 2 అనేది 2023 క్రికెట్ ప్రపంచ కప్ అర్హత ప్రక్రియలో భాగంగా ఏర్పడిన క్రికెట్ టోర్నమెంట్. [1] [2] టోర్నమెంటు 2019 ఆగస్ట్ నుండి 2023 మార్చి వరకు జరిగింది.[3] అన్ని మ్యాచ్‌లు వన్ డే ఇంటర్నేషనల్స్ గా ఆడారు. [4] ఈ టోర్నమెంటు లోని మ్యాచ్‌లన్నీ ట్రై-సిరీస్‌ రూపంలో మూడేసి జట్లు పాల్గొని ఆడాయి.[5]

స్కాట్లాండ్, నేపాల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జట్లు, 2019 ఐసిసి వరల్డ్ క్రికెట్ లీగ్ డివిజన్ టూ టోర్నమెంటు లోని మొదటి నాలుగు జట్లతో చేరాయి. [6] మొదటి రౌండు 2019 ఆగస్ట్ 1లో స్కాట్లాండ్‌లోని అబెర్డీన్‌లో జరిగింది.[7]


ప్రమోషన్ కోసం, ఈ CWC లీగ్ 2లో అగ్రశ్రేణి జట్టు 2023 క్రికెట్ ప్రపంచ కప్ క్వాలిఫైయర్ లో 13వ స్థానంలో నిలిచిన సూపర్ లీగ్ జట్టు కంటే మెరుగైన స్థానంలో నిలిచినట్లయితే, 2020–2023 ఐసిసి క్రికెట్ ప్రపంచ కప్ సూపర్ లీగ్‌కి ప్రమోట్ అయ్యే అవకాశాన్ని పొందుతుందని మొదట ఉద్దేశించారు. . [6] [8] అయితే, 2021 నవంబరులో ఐసిసి, సూపర్ లీగ్ రెండవ ఎడిషన్ ఉండదని ప్రకటించింది. వచ్చేసారి స్కాట్లాండ్, లీగ్ 2లో ఉంటుందనేది ఖాయమైంది.[9]

బహిష్కరణ కోసం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, పాపువా న్యూ గినియాలు 6వ, 7వ స్థానాల్లో నిలిచాయి. ఫలితంగా, వారి కోసం ప్లే-ఆఫ్ టోర్నమెంటు ప్రపంచ కప్‌కు అర్హతను మాత్రమే కాకుండా, వారు ఛాలెంజ్ లీగ్‌కు వెళ్తారో లేదో కూడా నిర్ణయించారు. ఆ ప్లే-ఆఫ్‌లోని ఆరు జట్లలో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని రెండు జట్లు, పపువా న్యూ గినియా, కెనడా, జెర్సీ (ఛాలెంజ్ లీగ్‌లో మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి) లీగ్ 2 తదుపరి ఎడిషన్‌కు అర్హత సాధిస్తాయి. 4వ, 5వ స్థానాల్లో నిలిచిన నమీబియా, యునైటెడ్ స్టేట్స్ జట్లకు, ప్లే-ఆఫ్ వారి ప్రపంచ కప్ అర్హతను మాత్రమే నిర్ణయిస్తుంది. ఆ జట్లకు చివరి స్థానంలో నిలిచినా కూడా బహిష్కరణకు దారితీయదు. [10]

2023 ఫిబ్రవరి 15న నమీబియాపై 10 వికెట్ల తేడాతో గెలిచి స్కాట్లాండ్, లీగ్‌లో మొదటి స్థానంలో నిలిచింది. [11] కీర్తిపూర్‌లో జరిగిన టోర్నమెంటు 19వ రౌండ్ ముగింపులో వారికి ట్రోఫీని అందించారు. [12] ఒమన్, నేపాల్‌లు రెండవ, మూడవ స్థానాల్లో నిలిచాయి. నేపాల్ చివరి 12 మ్యాచ్‌లలో 11 ని గెలిచి టోర్నమెంటు చివరి మ్యాచ్‌లో నమీబియాను అధిగమించి 2023 క్రికెట్ ప్రపంచ కప్ క్వాలిఫైయర్ టోర్నమెంట్‌లో చోటు దక్కించుకుంది.

జట్లు

[మార్చు]
A diagram that explains the qualification structure for the 2023 ICC Cricket World Cup
2023 ఐసిసి క్రికెట్ ప్రపంచ కప్‌కు అర్హత నిర్మాణాన్ని వివరించే రేఖాచిత్రం.

ఐసిసి క్రికెట్ ప్రపంచ కప్ లీగ్ 2లో మొదటి మూడు జట్లు ప్రపంచ కప్ క్వాలిఫైయర్‌కు అర్హత సాధించగా, దిగువన ఉన్న నాలుగు జట్లు క్వాలిఫయర్ ప్లే-ఆఫ్‌కు వెళ్లాయి. [13]

జట్టు అర్హత విధానం
 నేపాల్ [14] మునుపటి ODI స్థితి
 స్కాట్‌లాండ్ [14]
 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్[14]
 నమీబియా [15] 2019 ఐసిసి వరల్డ్ క్రికెట్ లీగ్ డివిజన్ టూ నుండి ప్రమోట్ చేయబడింది
 ఒమన్ [16]
 పపువా న్యూగినియా [17]
 యు.ఎస్.ఏ [18]

పాయింట్ల పట్టిక

[మార్చు]

 మూస:2019–2023 ICC Cricket World Cup League 2

గణాంకాలు

[మార్చు]

అత్యధిక పరుగులు

[మార్చు]
బ్యాటరు మ్యాచ్‌లు ఇన్నింగ్సులు నాటౌట్లు పరుగులు సగటు సమ్మె రేటు HS 100లు 50లు
గెర్హార్డ్ ఎరాస్మస్ 34 33 3 1,298 43.26 77.91 121* 1 11
అసద్ వాలా 36 36 1 1,290 36.85 70.37 104 1 6
మోనాంక్ పటేల్ 35 35 2 1,219 36.93 80.30 130 2 8
ఆరోన్ జోన్స్ 31 31 3 1,184 42.29 72.59 123* 1 8
జతీందర్ సింగ్ 36 35 1 1,098 32.29 77.92 118* 3 6
మూలం: ESPN Cricinfo [19]

అత్యధిక వ్యక్తిగత స్కోరు

[మార్చు]
బ్యాటరు పరుగులు బంతులు 4సె 6సె ప్రత్యర్థి గ్రౌండ్ మ్యాచ్ తేదీ
జీన్-పియర్ కోట్జే 136 109 11 8  యు.ఎస్.ఏ లాడర్‌హిల్ 2019 సెప్టెంబరు 20
కాలమ్ మాక్లియోడ్ 133* 144 13 2  యు.ఎస్.ఏ అబెర్డీన్ 2022 ఆగస్టు 17
మైఖేల్ వాన్ లింగేన్ 133 137 9 5  నేపాల్ ఖాట్మండు 2023 ఫిబ్రవరి 14
మోనాంక్ పటేల్ 130 101 11 6  ఒమన్ పెర్లాండ్ 2022 జూన్ 8
క్రెయిగ్ విలియమ్స్ 129* 94 13 6  ఒమన్ మస్కట్ 2020 జనవరి 8
మూలం: ESPN Cricinfo [20]

అత్యధిక వికెట్లు

[మార్చు]
బౌలర్ మ్యాచ్‌లు ఇన్నింగ్సులు వికెట్లు పరుగులు ఓవర్లు BBI సగటు ఎకాన్ SR 4WI 5WI
బిలాల్ ఖాన్ 35 35 76 1,419 298.4 5/31 18.67 4.75 23.5 3 3
సందీప్ లామిచానే 31 30 72 1,142 282.0 6/16 15.86 4.04 23.5 5 2
సౌరభ్ నేత్రవల్కర్ 35 34 58 1,234 298.3 5/32 21.27 4.13 30.8 1 2
మార్క్ వాట్ 31 30 54 969 269.0 5/33 17.94 3.60 29.8 3 1
రూబెన్ ట్రంపెల్మాన్ 29 29 51 1,123 236.5 5/30 22.01 4.74 27.8 2 2
మూలం: ESPN Cricinfo [21]

ఒక ఇన్నింగ్స్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు

[మార్చు]
బౌలర్ వికెట్లు పరుగులు ఓవర్లు Mdns ఎకాన్ ప్రత్యర్థి గ్రౌండ్ మ్యాచ్ తేదీ
సందీప్ లామిచానే 6 16 6 1 2.66  యు.ఎస్.ఏ కీర్తిపూర్ 2020 ఫిబ్రవరి 12
తంగేని లుంగమేని 6 42 9 0 4.66  పపువా న్యూగినియా విండ్‌హోక్ 2022 నవంబరు 23
ఖవార్ అలీ 5 13 4.2 1 3.00  పపువా న్యూగినియా మస్కట్ 2021 అక్టోబరు 1
బాసిల్ హమీద్ 5 17 6.2 0 2.68  ఒమన్ మస్కట్ 2022 ఫిబ్రవరి 6
రిలే హెకురే 5 20 8 1 2.50  యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దుబాయ్ 2023 మార్చి 5
మూలం: ESPN Cricinfo [22]

మూలాలు

[మార్చు]
  1. "Namibia crowned ICC World Cricket League Division 2 champions with victory over Oman". International Cricket Council. Archived from the original on 27 April 2019. Retrieved 27 April 2019.
  2. "Associates pathway to 2023 World Cup undergoes major revamp". ESPN Cricinfo. Archived from the original on 20 October 2018. Retrieved 20 October 2018.
  3. "ICC Men's Cricket World Cup League 2 series announced". International Cricket Council. Archived from the original on 7 May 2019. Retrieved 7 May 2019.
  4. "New qualification pathway for ICC Men's Cricket World Cup approved". International Cricket Council. Archived from the original on 20 October 2018. Retrieved 20 October 2018.
  5. "ICC Men's Cricket World Cup Qualification Pathway frequently asked questions". International Cricket Council. Archived from the original on 6 November 2018. Retrieved 6 November 2018.
  6. 6.0 6.1 "The road to World Cup 2023: how teams can secure qualification, from rank No. 1 to 32". ESPN Cricinfo. Archived from the original on 14 August 2019. Retrieved 14 August 2019. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "Road" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  7. "Scotland cricket: new head coach Shane Burger targets World Cup and Test status". BBC Sport. Archived from the original on 30 October 2020. Retrieved 13 May 2019.
  8. de Jong, Bertus (16 August 2019). "Explainer: With 2023 Cricket World Cup qualifying process underway, here's a breakdown of ICC's new-look league structure". Firstpost. Archived from the original on 16 August 2019. Retrieved 16 August 2019.
  9. "Cricket takes another backward step in Super League scrapping". Emerging Cricket. Archived from the original on 18 November 2021. Retrieved 18 November 2021.
  10. "ICC Men's Cricket World Cup 2023 Qualification Pathway Frequently Asked Questions" (PDF). International Cricket Council. 12 August 2019. Archived (PDF) from the original on 12 August 2019. Retrieved 6 March 2020. Then, two places will be up for grabs in the next edition of the CWC League Two: a. This will be decided between four sides, comprising the sixth and seventh ranked teams from CWC League Two 2019-2021 and table-toppers from CWC Challenge League A and B 2019-2021. b. The top two sides from this group of four will feature in the CWC League 2 in the next edition. c. The bottom two sides from this group will play in CWC Challenge League A and B for the next edition.
  11. "ICC Men's World Cup League 2: Scotland thump Namibia to clinch top spot". BBC Sport. Retrieved 15 February 2023.
  12. "World Cup League 2: Scotland lift trophy after loss to Nepal". BBC Sport. Retrieved 21 February 2023.
  13. "New cricket calendar aims to give all formats more context". ESPN Cricinfo. 4 February 2017. Archived from the original on 20 October 2017. Retrieved 20 October 2017.
  14. 14.0 14.1 14.2 "Xavier Marshall in USA squad for WCL Division Two". ESPN Cricinfo. Archived from the original on 11 April 2019. Retrieved 11 April 2019.
  15. "USA, Oman, PNG, Namibia secure ODI status for coming World Cup Qualifying cycle". The Indian Express. Archived from the original on 26 April 2019. Retrieved 26 April 2019.
  16. "Oman and USA gain One-Day International status". CricTracker. Archived from the original on 24 April 2019. Retrieved 24 April 2019.
  17. "USA team attains ODI status, makes history". Cricket Country. Archived from the original on 24 April 2019. Retrieved 24 April 2019.
  18. "Papua New Guinea secure top-four finish on dramatic final day". International Cricket Council. Archived from the original on 26 April 2019. Retrieved 26 April 2019.
  19. "Most Runs ICC Men's Cricket World Cup League 2". ESPN Cricinfo. Retrieved 16 March 2023.
  20. "High Scores ICC Cricket World Cup League 2". ESPN Cricinfo. Retrieved 16 March 2023.
  21. "Most Wickets ICC Men's Cricket World Cup League 2". ESPN Cricinfo. Retrieved 16 March 2023.
  22. "Best Bowling Figures in an Innings ICC Men's Cricket World Cup Super League". ESPN Cricinfo. Retrieved 16 March 2023.