1975 షిల్లాంగ్ ఒప్పందం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

1975 షిల్లాంగ్ ఒప్పందం భారత ప్రభుత్వం, నాగాలాండ్ అజ్ఞాత ప్రభుత్వాలు కుదుర్చుకున్న ఒప్పందం. నాగాలాండ్ అజ్ఞాత ప్రభుత్వాన్ని నాగా ఫెడరల్ ప్రభుత్వం అని, నాగా గెరిల్లాలు, నాగా తిరుగుబాటుదారులు అనీ కూడా అంటారు. షరతులు లేకుండా భారత రాజ్యాంగం ఆధిపత్యాన్ని అంగీకరించడానికి, తమ ఆయుధాలను అప్పగించి, భారతదేశం నుండి నాగాలాండ్‌ను విడదీయాలనే డిమాండ్‌ను విరమించుకుంటానికీ నాగా తిరుగుబాటు నాయకులు అంగీకరించారు.[1][2][3][4][5][6]

ఈ చారిత్రాత్మక ఒప్పందంపై మేఘాలయలోని షిల్లాంగ్‌లో 1975 నవంబరు 11 న సంతకం చేసారు. అందువలననే దీన్ని 1975 షిల్లాంగ్ ఒప్పందం అని అంటారు.[7][8][9]

ప్రతినిధులు

[మార్చు]
  • భారత ప్రభుత్వం తరపున నాగాలాండ్ గవర్నర్ లల్లన్ ప్రసాద్ సింగ్ ప్రాతినిధ్యం వహించారు. గవర్నరుకు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) జాయింట్ సెక్రటరీ ML కంపానీ, నాగాలాండ్‌కి చెందిన ఇద్దరు సలహాదారులు -M. రామున్నీ, హెచ్. జోపియాంగా సహాయం చేసారు
  • నాగాలాండ్ అజ్ఞాత సంస్థలకు I. టెంజెంబా, S. దహ్రు, వీనియిల్ రఖో, Z. రామ్యో, M. అస్సా, కెవి యాలీ - అప్పటి నాగా నేషనల్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఉన్న అంగామి జాపు ఫిజో తమ్ముడు - వంటి నాయకులు ప్రాతినిధ్యం వహించారు. ఫిజో, 1956 నుండి 1990 లో మరణించే వరకు లండన్‌లో ప్రవాసంలో ఉన్నాడు.
  • నాగాలాండ్ పీస్ కౌన్సిల్ (NPC) అనుసంధాన కమిటీకి లాంగ్రి అవో, ఎం. ఆరామ్, ఎల్. లుంగాలాంగ్, కెన్నెత్ కెర్హువో, లుంగ్‌షిమ్ షైజా వంటి ఐదుగురు చర్చి నాయకులు ప్రాతినిధ్యం వహించారు.[7][8][9][10][11]

చర్చలు

[మార్చు]

గవర్నరుతో మాత్రమే వరుసగా నాలుగు సార్లు చర్చలు జరిగాయి; కొన్ని సమయాల్లో, అతని సలహాదారులు, MHA జాయింట్ సెక్రటరీలు సహాయం చేసారు. 1975 నవంబరు 10, 11 తేదీల్లో జరిగిన నాలుగు చర్చల్లో అజ్ఞాత ప్రభుత్వం, అనుసంధాన కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.[7][8][9][10][11]

ఒప్పందం వివరాలు

[మార్చు]

చర్చల ఫలితాలు మూడు పాయింట్ల ఒప్పందంగా సంకలనం చేయబడ్డాయి, చివరికి అది చారిత్రాత్మక "షిల్లాంగ్ ఒప్పందం 1975"గా పిలువబడింది. [7] [8] [9] [10] [12] [11]

  1. అజ్ఞాత సంస్థల ప్రతినిధులు, తాము భారత రాజ్యాంగాన్ని ఎటువంటి షరతులు లేకుండా అంగీకరిస్తామని తమ స్వచ్ఛంద నిర్ణయాన్ని తెలియజేసారు.
  2. ప్రస్తుతం భూగర్భంలో ఉన్న ఆయుధాలను బయటకు తీసుకొచ్చి నిర్ణీత ప్రదేశాల్లో నిక్షిప్తం చేసేందుకు అంగీకరించారు. ఈ ఒప్పందం అమలుకు సంబంధించిన వివరాలపై వారు, ప్రభుత్వ ప్రతినిధులు, భద్రతా దళాలు, అనుసంధాన కమిటీ సభ్యులు పనిచేస్తారు.
  3. అంతిమ పరిష్కారం కోసం అవసరమైన ఇతర అంశాలను రూపొందించడానికి చర్చల కోసం అజ్ఞాత సంస్థల ప్రతినిధులకు సహేతుకమైన సమయం ఉండాలని అంగీకరించారు.

సంతకం చేసినవారు

[మార్చు]

"షిల్లాంగ్ ఒప్పందం" 1975 నవంబరు 11 న షిల్లాంగ్‌లో, భారత ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నాగాలాండ్ గవర్నర్ LP సింగ్, నాగాలాండ్ అజ్ఞాత నాయకత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కెవి యాలీ, M. అస్సా, S. దహ్రు, వీనియల్ రఖో, Z. రామ్యోలు సంతకాలు చేసారు.[7][8][9][10]

అనుబంధ ఒప్పందం

[మార్చు]

1975 షిల్లాంగ్ ఒప్పందంలోని క్లాజ్ 2 ప్రకారం ఆయుధాలను సమర్పించే ప్రక్రియను వివరించే అనుబంధ ఒప్పందంపై 1976 జనవరి 5 న సంతకాలు చేసారు. ఈ ఒప్పందంలో శాంతి శిబిరాల్లో అజ్ఞాత ఉద్యమకారులకు వసతి కల్పించే విధానాలతో సహా క్లాజ్ 2 అమలు ప్రక్రియ ఉంది.

  1. మొదటగా సేకరణ కేంద్రాల వద్ద, ఆయుధాల సేకరణ వీలైనంత త్వరగా ప్రారంభించాలని 1976 జనవరి 25 నాటికి పూర్తి చేయాలని నిర్ణయించబడింది. కమీషనర్, అజ్ఞాత సంస్థల ప్రతినిధులు అనుసంధాన కమిటీ సభ్యుల మధ్య చర్చల ద్వారా, సేకరణ స్థలాలను నిర్ణయిస్తారు.
  2. అన్ని ఆయుధాలు సేకరించిన తర్వాత, వీటిని సేకరించిన ప్రదేశాల లోని శాంతి మండలి బృందానికి అప్పగిస్తారు.
  3. శాంతి మండలి సభ్యుల బృందం ఆయుధాలను సేకరణ కేంద్రాల నుండి చెడెమా శాంతి శిబిరానికి రవాణా చేయడానికి ఏర్పాట్లు చేస్తుంది. ఆయుధాల సురక్షిత కస్టడీ కోసం గార్డులను ఏర్పాటు చేస్తుంది.
  4. మణిపూర్ ప్రభుత్వ సమ్మతితో మణిపూర్‌లో అంగీకరించిన స్థలం/స్థలాల వద్ద ఇలాంటి ఏర్పాటు చేయబడుతుంది.
  5. అజ్ఞాత ఉద్యమకారులు అనువైన ప్రదేశాలలో స్థాపించబడే శాంతి శిబిరాలలో ఉండవచ్చు. వాటి నిర్వహణను శాంతి మండలి మాత్రమే ఏర్పాటు చేస్తుంది. ఎవరైనా అందజేసే ఏ స్వచ్ఛంద సహకారమైనా శాంతి మండలికే అందజేస్తారు. అవసరాలకు అనుగుణంగా వారు ఆ నిధిని ఉపయోగిస్తారు.

సంతకాలు చేసినవారు

[మార్చు]

"సప్లిమెంటరీ అగ్రిమెంట్" 1976 జనవరి 5 న షిల్లాంగ్‌లో, భారత ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నాగాలాండ్ గవర్నర్ LP సింగ్, నాగాలాండ్ అజ్ఞాత నాయకత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బిసెటో మెడోమ్ కీహో, పుక్రోవ్ నఖ్రో, I. టెంజెంబా, Z. రామ్యోలు సంతకాలు చేసారు.[7][10][12]

ఒప్పందం అనంతర పరిణామాలు

[మార్చు]

షిల్లాంగ్ ఒప్పందంపై సంతకం ఇరవై సంవత్సరాలుగా అనేక బాధలకు నిర్లక్ష్యానికీ కారణమైన సంఘర్షణకు తుది పరిష్కారాన్ని అందించింది; తదనుగుణంగా, పెద్ద ఎత్తున ఆయుధాలను త్యజించారు. అజ్ఞాతం నుండి బయటకు వచ్చి ప్రధాన స్రవంతిలో చేరేలా నాగా తిరుగుబాటుదారులను ఒప్పించడంలో గ్రామస్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. నాగా తిరుగుబాటుదారులు స్వచ్ఛందంగా భారత రాజ్యాంగాన్ని ఆమోదించడానికి, ఆయుధాలను సమర్పించడానికి, తుది పరిష్కారంలో భాగంగా చర్చల కోసం ఇతర అంశాలను రూపొందించడానికీ అంగీకరించడంతో ఈ ఒప్పందం భారత ప్రభుత్వ విజయంగా కనిపిస్తోంది.[9][13]

విమర్శ

[మార్చు]

షిల్లాంగ్ ఒప్పందపు వ్యతిరేకులు, విమర్శకులు "అంతిమ పరిష్కారం కోసం ఇతర సమస్యలను చర్చించడానికి అజ్ఞాత ప్రతినిధులకు సహేతుకమైన సమయం" అని పేర్కొన్న క్లాజ్ 3, ఇప్పటికీ అమలు కాలేదని చాలా మంది నాగా ప్రజలు, నాగా నేషనల్ కౌన్సిల్ కు చెందిన విదేశాల్లోని (ఎన్‌ఎన్‌సి) నాయకులు ఈ ఒప్పందాన్ని ఆమోదించడానికి అంగీకరించలేదనీ అన్నారు. ఎన్‌ఎన్‌సి లేదా ఫెడరల్ గవర్నమెంట్ ఆఫ్ నాగాలాండ్ (ఎఫ్‌జిఎన్) వంటి సంస్థలు కాకుండా "నాగా అజ్ఞాత ప్రతినిధులు" ఒప్పందంపై సంతకం చేశారని వారు విమర్శించారు.[10][12][14]

అయితే, భారత రాష్ట్రాల యూనియన్‌లో భాగం కావడం జీర్ణించుకోలేని చాలా మంది నాగాలు, ఒప్పందాన్ని ఖండించారు. చివరికి తిరుగుబాటుదారుల మధ్య చీలిక ఏర్పడింది. ఒప్పందంపై సంతకం చేయడానికి ముందు చర్చలు జరుగుతున్నప్పుడు, 150 మంది తిరుగుబాటుదారులతో అప్పటి ఎన్‌ఎన్‌సి ఉపధ్యక్షుడు ఇసాక్ చిషి స్వూ, అప్పటి ఎన్‌ఎన్‌సి జనరల్ సెక్రటరీ థ్యూంగాలెంగ్ ముయివా చైనా, బర్మాల నుండి తిరిగి వస్తున్నట్లు చెప్పబడింది. ఆ దేశాల్లో వారు తమ స్థావరాన్ని స్థాపించి ఉన్నారు. 1956 నుండి లండన్‌లో ప్రవాసంలో ఉన్న అప్పటి ఎన్‌ఎన్‌సి అధ్యక్షుడు ఫిజో, ఈ ఒప్పందాన్ని ఆమోదించలేదు లేదా తిరస్కరించనూ లేదని కొందరు విమర్శకులు అభిప్రాయపడుతున్నారు; కానీ, అతని తమ్ముడు కెవి యాల్లీ మాత్రం అజ్ఞాతంలో ఉన్న సంస్థలకు ప్రాతినిధ్యం వహించి, షిల్లాంగ్ ఒప్పందంపై సంతకం చేశాడు. ఇసాక్, ముయివా లిద్దరూ తమ సహచరులలో కొందరిని, ప్రత్యేకించి ఫిజోను, ఈ ఒప్పందాన్ని ఖండించాలని ఒప్పించేందుకూ, షిల్లాంగ్ ఒప్పందాన్ని ఆలస్యం చేయకుండా ఖండించాలని ఫిజోను కోరుతూ ఏడుగురు సభ్యుల ప్రతినిధి బృందాన్ని పంపించేందుకూ తమ శాయశక్తులా ప్రయత్నించారని భావిస్తున్నారు. అయినప్పటికీ, ఫిజో మౌనంగా ఉండడంతో, వారి గొంతు వినబడకుండా పోయింది.[10][12][11]

ఒప్పందంపై సంతకాలు చేసిన ఐదు సంవత్సరాల తర్వాత, భారత రాజ్యాంగాన్ని అంగీకరించినందున దెబ్బతిన్న ఎన్‌ఎన్‌సి ఇమేజ్‌ను పునరుద్ధరించాలని ఇసాక్, ముయివా ఇద్దరూ నిర్ణయించుకున్నారు. "ద్రోహం"గా పేర్కొంటూ ఆ ఒప్పందాన్ని బహిరంగంగా తిరస్కరించారు. "అమ్ముడు పోవడం" గా దాన్ని నిందించారు. ఫిజోపై అవమానకరమైన వ్యాఖ్యలు చేసారు. తిరుగులేని సార్వభౌమాధికారం కోసం పోరాడతామని ప్రతిజ్ఞ చేసారు; ఆ విధంగా ముయివా, ఐజాక్, S. ఖప్లాంగ్ ల త్రయం తమ పాత సంస్థ ఎన్‌ఎన్‌సి నుండి విడిపోయి 1980 ఫిబ్రవరి 2 న నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ (NSCN)ని స్థాపించారు. NSCN, ఒక బలమైన తిరుగుబాటు సమూహంగా ఉద్భవించినప్పటికీ, ఎన్‌ఎన్‌సి దాని గరిష్ట స్థాయికి చేరుకున్న ప్రజాదరణను ఎప్పుడూ పొందలేదు. 1988 నాటికి, NSCN గిరిజన శ్రేణులలో రెండు విభిన్న వర్గాలుగా చీలిపోయింది- NSCN(K), ఖప్లాంగ్ నాయకత్వంలోను, NSCN(IM), ఇసాక్, ముయివాల నాయకత్వంలోనూ ఏర్పడ్డాయి. లండన్‌లో 1990 ఏప్రిల్ 30 న ఫిజో మరణించిన తర్వాత, ఎన్‌ఎన్‌సి మరో రెండు వర్గాలుగా చీలిపోయింది-ఫిజో కుమార్తె అడినో నాయకత్వంలో ఎన్‌ఎన్‌సి(A), మునుపటి ఎన్‌ఎన్‌సి ఉపాధ్యక్షుడు ఖోడావో యంథాన్ నేతృత్వంలో ఎన్‌ఎన్‌సి(K) ఏర్పడ్డాయి.[10][12][11][15][16][17]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Nagaland Accord - The Shillong Agreement of November 11, 1975". satp.org/. Retrieved 27 April 2012. representatives of the underground organisations met the Governor of Nagaland, Shri L.P. Singh representing the Government of India, at Shillong on 10th and 11th November, 1975.
  2. "THE SHILLONG ACCORD OF 11 NOVEMBER 1975 BETWEEN THE GOVERNMENT OF INDIA AND THE UNDERGROUND NAGAS". npmhr.org. Archived from the original on 28 అక్టోబరు 2014. Retrieved 27 April 2012. There was a series of four discussions. Some of the discussions were held with the Governor alone; at others, the Governor was assisted by the two Advisers for Nagaland, Shri Ramunny and Shri H. Zopianga, and Shri M.L. Kampani, Joint Secretary in the Ministry of Home Affairs. All the five members of the Liaison Committee namely Rev. Longri Ao, Dr. M. Aram, Shri L. Lungalang, Shri Kenneth Kerhuo and Shri Lungshim Shaiza, participated in the discussions.
  3. "Dawn of Peace in Nagaland - SHILLONG ACCORD". nagaland.nic.in. Archived from the original on 14 March 2012. Retrieved 27 April 2012. the historic "Shillong" signed at Shillong on November 11, 1975, by the Governor of Nagaland Mr. L.P Singh representing the Government of India and the underground leadership represented by Mr. Assa and Mr. Kevi Yalley
  4. Reisang, Vashum (December 2000). Nagas' Rights to Self Determination. Mittal Publications. pp. 93–211. ISBN 9788170997740.
  5. "The Peace Process in Nagaland". safhr.org. Retrieved 27 April 2012. An Accord that never was: a critique of the 1975 Shillong Accord
  6. "Nagaland: The Beginning of Insurgency - II : The Shillong Accord". indiandefencereview.com. 10 May 2011. Retrieved 22 January 2012. The liaison committee held talks with Biesto Medom, Keviyalle (Phizo's brother), Ramyo and M Asa of the underground. When it became clear to the Governor, Shri LP Singh, that the agreement had a fair chance of success, he met the committee at Shillong. The Governor was assured that the underground on their own volition accepted without condition the Constitution of India and promised to deposit their arms at an appointed place. The agreement, which came to be called the Shillong Accord, was finally signed on November 11, 1975 - When the Shillong Accord was being negotiated, Isak Swu and Muivah with a group of 150 hardcore rebels were on their way back from China - When Muivah and Isak Swu were informed about the developments, they rejected the Accord and termed it as betrayal by the NNC and swore to fight on. - Soon cracks developed in the group. Isak and Muivah made derogatory remarks against Phizo and the policy adopted by the NNC.
  7. 7.0 7.1 7.2 7.3 7.4 7.5 "Nagaland Accord - The Shillong Agreement of November 11, 1975". satp.org/. Retrieved 27 April 2012. representatives of the underground organisations met the Governor of Nagaland, Shri L.P. Singh representing the Government of India, at Shillong on 10th and 11th November, 1975."Nagaland Accord - The Shillong Agreement of November 11, 1975". satp.org/. Retrieved 27 April 2012. representatives of the underground organisations met the Governor of Nagaland, Shri L.P. Singh representing the Government of India, at Shillong on 10th and 11th November, 1975.
  8. 8.0 8.1 8.2 8.3 8.4 "THE SHILLONG ACCORD OF 11 NOVEMBER 1975 BETWEEN THE GOVERNMENT OF INDIA AND THE UNDERGROUND NAGAS". npmhr.org. Archived from the original on 28 అక్టోబరు 2014. Retrieved 27 April 2012. There was a series of four discussions. Some of the discussions were held with the Governor alone; at others, the Governor was assisted by the two Advisers for Nagaland, Shri Ramunny and Shri H. Zopianga, and Shri M.L. Kampani, Joint Secretary in the Ministry of Home Affairs. All the five members of the Liaison Committee namely Rev. Longri Ao, Dr. M. Aram, Shri L. Lungalang, Shri Kenneth Kerhuo and Shri Lungshim Shaiza, participated in the discussions."THE SHILLONG ACCORD OF 11 NOVEMBER 1975 BETWEEN THE GOVERNMENT OF INDIA AND THE UNDERGROUND NAGAS" Archived 2018-04-05 at the Wayback Machine. npmhr.org. Retrieved 27 April 2012. There was a series of four discussions. Some of the discussions were held with the Governor alone; at others, the Governor was assisted by the two Advisers for Nagaland, Shri Ramunny and Shri H. Zopianga, and Shri M.L. Kampani, Joint Secretary in the Ministry of Home Affairs. All the five members of the Liaison Committee namely Rev. Longri Ao, Dr. M. Aram, Shri L. Lungalang, Shri Kenneth Kerhuo and Shri Lungshim Shaiza, participated in the discussions.
  9. 9.0 9.1 9.2 9.3 9.4 9.5 "Dawn of Peace in Nagaland - SHILLONG ACCORD". nagaland.nic.in. Archived from the original on 14 March 2012. Retrieved 27 April 2012. the historic "Shillong" signed at Shillong on November 11, 1975, by the Governor of Nagaland Mr. L.P Singh representing the Government of India and the underground leadership represented by Mr. Assa and Mr. Kevi Yalley"Dawn of Peace in Nagaland - SHILLONG ACCORD". nagaland.nic.in. Archived from the original on 14 March 2012. Retrieved 27 April 2012. the historic "Shillong" signed at Shillong on November 11, 1975, by the Governor of Nagaland Mr. L.P Singh representing the Government of India and the underground leadership represented by Mr. Assa and Mr. Kevi Yalley
  10. 10.0 10.1 10.2 10.3 10.4 10.5 10.6 10.7 Reisang, Vashum (December 2000). Nagas' Rights to Self Determination. Mittal Publications. pp. 93–211. ISBN 9788170997740.Reisang, Vashum (December 2000). Nagas' Rights to Self Determination. Mittal Publications. pp. 93–211. ISBN 9788170997740.
  11. 11.0 11.1 11.2 11.3 11.4 "Nagaland: The Beginning of Insurgency - II : The Shillong Accord". indiandefencereview.com. 10 May 2011. Retrieved 22 January 2012. The liaison committee held talks with Biesto Medom, Keviyalle (Phizo's brother), Ramyo and M Asa of the underground. When it became clear to the Governor, Shri LP Singh, that the agreement had a fair chance of success, he met the committee at Shillong. The Governor was assured that the underground on their own volition accepted without condition the Constitution of India and promised to deposit their arms at an appointed place. The agreement, which came to be called the Shillong Accord, was finally signed on November 11, 1975 - When the Shillong Accord was being negotiated, Isak Swu and Muivah with a group of 150 hardcore rebels were on their way back from China - When Muivah and Isak Swu were informed about the developments, they rejected the Accord and termed it as betrayal by the NNC and swore to fight on. - Soon cracks developed in the group. Isak and Muivah made derogatory remarks against Phizo and the policy adopted by the NNC."Nagaland: The Beginning of Insurgency - II : The Shillong Accord". indiandefencereview.com. 10 May 2011. Retrieved 22 January 2012. The liaison committee held talks with Biesto Medom, Keviyalle (Phizo's brother), Ramyo and M Asa of the underground. When it became clear to the Governor, Shri LP Singh, that the agreement had a fair chance of success, he met the committee at Shillong. The Governor was assured that the underground on their own volition accepted without condition the Constitution of India and promised to deposit their arms at an appointed place. The agreement, which came to be called the Shillong Accord, was finally signed on November 11, 1975 - When the Shillong Accord was being negotiated, Isak Swu and Muivah with a group of 150 hardcore rebels were on their way back from China - When Muivah and Isak Swu were informed about the developments, they rejected the Accord and termed it as betrayal by the NNC and swore to fight on. - Soon cracks developed in the group. Isak and Muivah made derogatory remarks against Phizo and the policy adopted by the NNC.
  12. 12.0 12.1 12.2 12.3 12.4 "The Peace Process in Nagaland". safhr.org. Retrieved 27 April 2012. An Accord that never was: a critique of the 1975 Shillong Accord"The Peace Process in Nagaland". safhr.org. Retrieved 27 April 2012. An Accord that never was: a critique of the 1975 Shillong Accord
  13. "SHILLONG ACCORD". nagaland.nic.in. Retrieved 29 January 2012. JThe signing of the Shillong Accord had ushered in a general feeling of well-being all throughout and hope for peace and for a final solution of the twenty-year-old conflict once again appeared in the horizon.
  14. "Clarification on 'Shillong Accord'". nagalandpost.com. 23 October 2011. Retrieved 29 April 2012. I say that in the name of Almighty God that the Naga National Council (NNC) never signed the Shillong Accord. Some of our leaders and I do have already clearly made known earlier about the signing of the Shillong Accord in 1975, that NNC was never a part of it. I therefore sincerely advise him to read once the text of Shillong Accord and not to repeat to write so in the near future, lest Mongaimo commits crime against the nation and it will be irreparable for him.
  15. Thomas, John (2016). Evangelising the Nation: Religion and the formation of Naga Political Identity (First ed.). New Delhi: Routledge. p. 176. ISBN 9781138639928.
  16. "Naga solution: 'Supra state' may don new avatar". sevensisterspost.com. Archived from the original on 28 April 2012. Retrieved 28 April 2012. NSCN-IM general secretary Thuingaleng Muivah and chairman Isak Chishi Swu are in Delhi for another round of talks with the Government of India.{{cite web}}: CS1 maint: unfit URL (link)
  17. "NNC slams Shillong Accord". The Times of India. 30 May 2011. Archived from the original on 1 July 2012. Retrieved 28 April 2012. Naga National Council (NNC), led by Senka Yaden, reiterated that it was against the Shillong Accord and added that it would not budge an inch from its demand for Naga sovereignty - "Naga sovereignty is our birthright. We shall never compromise on this," NNC vice-president Kiumukam Yimchunger