1829
స్వరూపం
1829 గ్రెగోరియన్ కాలెండరు మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1826 1827 1828 - 1829 - 1830 1831 1832 |
దశాబ్దాలు: | 1800లు 1810లు - 1820లు - 1830లు 1840లు |
శతాబ్దాలు: | 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]- మే 24: నాసిరుద్దౌలా, హైదరాబాదు నిజాంగా గద్దెనెక్కాడు.
- జూలై 23: విలియం ఆస్టిన్ బర్ట్ 'టైపోగ్రాఫర్' (టైప్రైటర్) కి పేటెంట్ పొందాడు.
- డిసెంబరు 7: భారత గవర్నరు జనరల్ విలియం బెంటింక్ సతీసహగమనాన్ని నిషేధించాడు.[1]
- తేదీ తెలియదు: లూయీస్ బ్రెయిలీ సంగీత నొటేషన్లకు బ్రెయిలీ లిపిలో సంకేతాలను రూపొందించాడు.
- తేదీ తెలియదు: స్కాటిష్ చర్చ్ కాలేజీని స్థాపించిన అలెగ్జాండర్ డఫ్ మిషనరీగా భారతదేశం వచ్చాడు
జననాలు
[మార్చు]- జూన్ 6: ఎ. ఓ. హ్యూమ్, ఆంగ్లేయుల పరిపాలనా కాలంలో భారతదేశపు ప్రభుత్వ అధికారి, రాజకీయ సంస్కర్త, పక్షి శాస్త్రవేత్త, వృక్ష శాస్త్రవేత్త, కాంగ్రెస్ పార్టీ సహ వ్యవస్థాపకుడు. (మ. 1912)
- ఫిబ్రవరి 26: లెవీ స్ట్రాస్, బ్లూ జీన్స్ రూపొందించిన తొలి సంస్థ లెవీ స్ట్రాస్ అండ్ కో. స్థాపకుడు (మ.1902)
- సెప్టెంబరు 7: ఫ్రెడ్రిక్ అగస్ట్ కెకూలే జర్మను రసాయన శాస్త్రవేత్త (మ. 1896)
- తేదీ తెలియదు: సత్తెనపల్లి ఫీరోజీ మహర్షి, అచల తత్వాన్ని బోధించిన ఉత్తర భారత తత్వవేత్త (మ. 1889)
- తేదీ తెలియదు: మీర్ తురాబ్ అలీ ఖాన్, సాలార్ జంగ్ I, హైదరాబాద్ రాజ్య దివాన్. (మ. 1883)
మరణాలు
[మార్చు]- ఫిబ్రవరి 21: కిత్తూరు చెన్నమ్మ [2] బ్రిటిషు ఈస్టు ఇండియా కంపెనీ పాలనాకాలంలో, కన్నడ దేశానికి చెందిన కిత్తూరు అనే చిన్నరాజ్యానికి రాణి. (జ. 1778)
- మే 10: థామస్ యంగ్, ఇంగ్లీష్ శాస్త్రవేత్త (జ.1773)
- మే 21: సికిందర్ జా, హైదరాబాదు రాజ్యానికి మూడవ నిజాం (జ. 1769)
- మే 29: సర్ హంఫ్రీ డేవీ, ప్రముఖ రసాయన శాస్త్రవేత్త. (జ.1778)
- జూన్ 27: జేమ్స్ స్మిత్సన్ స్మిత్సోనియన్ సంస్థ స్థాపనకు నిధులిచ్చిన బ్రిటిష్ శాస్తవేత్త . (జ. 1765)
- డిసెంబర్ 18: జీన్ బాప్టిస్ట్ లామార్క్, నేచురలిస్ట్. (జ.1744)
పురస్కారాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Suttees, or the Burning of Widows", in The World's Progress: A Dictionary of Dates, ed. by George P. Putnam and F. B. Perkins (G. P. Putnam's Sons, 1878) p604
- ↑ "Rani Chennamma of Kitturu". pib.nic.in. Retrieved 2018-02-21.