1828
స్వరూపం
1828 గ్రెగోరియన్ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.
సంవత్సరాలు: | 1825 1826 1827 - 1828 - 1829 1830 1831 |
దశాబ్దాలు: | 1800లు 1810లు - 1820లు - 1830లు 1840లు |
శతాబ్దాలు: | 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]- జూలై 4: భారత గవర్నరు జనరల్ గా నియమితుడైన విలియం బెంటింక్ బ్రిటన్ నుండి కలకత్తా చేరుకున్నాడు.[1]
- ఆగస్టు 20: బ్రహ్మసమాజపు మొదటి సమావేశం, ఉత్తర కలకత్తాలో ఫిరంగీ కమల్ బోస్ ఇంట్లో జరిగింది. ఈ దినాన్ని, "భద్రోత్సవం" పేరుతో ఏటా జరుపుకుంటారు. [2][3]
- సెప్టెంబరు 17: జపాన్ లోని క్యుషులో వచ్చిన టైఫూన్లో 10,000 మంది మరణించారు.[4]
- సెప్టెంబరు 25: సైమన్ బొలివర్ను హత్య చేసేందుకు విఫల యత్నం జరిగింది
- అక్టోబరు 23: పూరీ జిల్లాను పూరీ, బాలాసోర్, కటక్ జిల్లాలుగా విభజించారు
- డిసెంబరు 3: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆండ్రూ జాక్సన్, అప్పటి అధ్యక్షుడు జాన్ క్విన్సీ ఆడమ్స్ ను ఓడించాడు.
- తేదీ తెలియదు: అన్యోస్ జెడ్లిక్ తొట్టతొలి ఎలక్ట్రిక్ మోటారును తయారు చేసాడు.
జననాలు
[మార్చు]- మార్చి 20: హెన్రిక్ ఇబ్సన్, నార్వే దేశానికి చెందిన నాటక రచయిత, దర్శకుడు (మ. 1906)
- మే 8: హెన్రీ డ్యూనాంట్, రెడ్ క్రాస్ సంస్థ స్థాపకుడు.
- నవంబరు 19: ఝాన్సీ లక్ష్మీబాయి, భారత స్వాతంత్ర్య పోరాట యోధురాలు. (మ.1858)*
- మార్చి 22: అమరావతి శేషయ్య శాస్త్ర్రి, ఎండోమెంటు డిప్యూటీ కలెక్టరుగా రెండున్నర లక్షల ఒరిజనల్ క్లైమ్సు పత్రాలను పరిశీలించి అనేక వేలఎండోమెంటు క్లైమ్సులు పరిష్కరించాడు. (మ.1903)
- సెప్టెంబరు 9: లియో టాల్స్టాయ్, రష్యన్ రచయిత. (మ. 1910)
- సెప్టెంబరు 30: లాహిరి మహాశయులు, యోగీశ్వరుడు, గురువు (మ. 1895)
- తేదీ తెలియదు: నరసింహదేవర వేంకటశాస్త్రి, తెలుగు కవి (మ. 1915)
- తేదీ తెలియదు: పాల్వాయి రంగయ్య నాయుడు, స్వాతంత్ర్య సమర యోధుడు (మ. 1902)
మరణాలు
[మార్చు]పురస్కారాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ John Clark Marshman, History of India from the Earliest Period to the Close of the East India Company's Government (William Blackwood and Sons, 1876) p357; reprinted by Cambridge University Press, 2010)
- ↑ "Socio-Religious Reform Movements in British India" By Kenneth W. Jones page 33-34, publ. 1989 Cambridge Univ. Press. ISBN 0521249864
- ↑ "Modern Religious movements in India, J.N.Farquhar (1915)"
- ↑ "Japan", in Encyclopedia of Hurricanes, Typhoons, and Cyclones, by David Longshore (Infobase Publishing, 2010) p272