హెలికాప్టర్ మనీ
ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉన్నప్పుడు ప్రజలకు నేరుగా డబ్బులు చేరవేసి వారి కొనుగోలు శక్తిని పెంచడం దీని వెనుకున్న ముఖ్య ఉద్దేశం. ప్రజల వద్ద డబ్బు లేక కొనుగోలు శక్తి తగ్గిపోయిన నేపథ్యంలో డబ్బులను విరివిగా ఇవ్వడం ద్వారా డిమాండ్‌ను, సప్లయ్‌ను పెంచడానికి ఈ విధానం దోహద పడుతుంది. వారికి ఉచితంగా డబ్బు పంపిణీ చేయడాన్ని హెలికాప్టర్ మనీ అంటారు. అమెరికాకు చెందిన ప్రఖ్యాత ఆర్థిక వేత్త ఫ్రెడ్‌మ్యాన్ 1969 హెలికాప్టర్ మనీ విధానాన్ని ప్రతిపాదించారు. 2002లో ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ బెన్ బెర్నాంకే దీన్ని ప్రాచుర్యంలోకి తెచ్చారు. ఈ విషయంలో భారతదేశంలో ఆర్‌బీఐది కీలక పాత్ర ఉంటుంది. దీని ప్రకారం నోట్ల ముద్రణ పెంచి ఆర్థిక వ్యవస్థలోకి పెద్దఎత్తున నగదును చలామణీలోకి తీసుకురావడం దీని ముఖ్య ఉద్దేశం.
కేంద్ర బ్యాంకు పాత్ర
[మార్చు]ఈ హెలీకాప్టర్ మనీ, క్వాంటిటేటివ్ ఈజింగ్ విధానాల్లో ఆయా దేశాల్లోని నోట్లు ముద్రించే కేంద్ర బ్యాంకుదే ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆర్‌బీఐ నోట్ల ముద్రణను బాగా పెంచి పెద్ద ఎత్తున నగదును ఆర్థిక వ్యవస్థలో చెలామణీలోకి తీసుకొస్తుంది. కరెన్సీ నోట్లను విపరీతంగా ముద్రించి మార్కెట్‌లోకి వదిలితే కొన్నాళ్లకు కరెన్సీ విలువే పడిపోయే ప్రమాదం ఉంటుంది. మరోవైపు ద్రవ్యోల్బణం కూడా విపరీతంగా పెరిగిపోవచ్చు. అందుకే దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఆర్థిక మాంద్యం, మందగమనం ఎదుర్కొనే పరిస్థితుల్లో మాత్రమే ఇలాంటి విధానాలు అవలంభిస్తారు.
అమలు చేసిన దేశాలు
[మార్చు]ఆర్థిక సంక్షోభం తార స్థాయికి చేరుకున్నప్పుడు హెలికాప్టర్ మనీ తుది పరిష్కారం. అమెరికా, జపాన్ వంటి దేశాలు హెలికాప్టర్ మనీ అమలు చేశాయి. 2008లో సంభవించిన మాంద్యం పరిస్థితులను ఎదుర్కొనేందుకు అమెరికా హెలికాప్టర్ మనీ విధానాన్ని అనుసరించింది. 2016లో జపాన్ సైతం హెలికాప్టర్ మనీ విధానాన్ని అమలు చేసింది.
హెలికాప్టర్ వల్ల విఫలమైన దేశాలు
[మార్చు]హెలికాప్టర్ మనీ వల్ల జింబాబ్వే, వెనుజ్వేలా దేశాలు ఈ ప్రయత్నంలో భారీగా విఫలం చెందాయి. ఈ దేశాల్లో హేతుబద్ధత లేకుండా నోట్లను ఎక్కువ సంఖ్యలో ముద్రించడంతో, వాటి విలువ పడిపోయింది.
మూలాలు
[మార్చు]వెలుపలి లంకులు
[మార్చు]- https://www.bbc.com/telugu/amp/india-52298264
- Helicopter money: A cure for what ails the euro area?, European Parliamentary Research Service, April 2016
- Helicopter Money: Why it works - Always, Willem Buiter, 2014
- Helicopter Money reloaded, Bruegel, 2016
- Recovery in the Eurozone: using money creation to Stimulate the economy[permanent dead link], Frank van Lerven, 2015
- What do people mean by helicopter money?, Simon Wren-Lewis, 2012
- From Zirp, Nirp, QE, and helicopter money to a better monetary system, Thomas Mayer, 2016
- Citizens' Monetary Dividend – Upgrading the ECB's Toolkit, Stan Jourdan and Eric Lonergan, 2016
- Helicopter money: Views of leading economists. Centre for Economic Policy Research, April 2016