హెన్రీ డెరోజియో

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కలకత్తాలోని ఎస్ప్లనేడ్ లో హెన్రీ డెరోజియో విగ్రహం

హెన్రీ లూయీ వివియన్ డెరోజియో (ఏప్రిల్ 18, 1809 – డిసెంబర్ 26, 1831) కలకత్తా లోని హిందూ కళాశాల యొక్క నియమిత అధ్యాపకుడు, పండితుడు, కవి. ఈయన యురేషియన్, పోర్చుగీసు సంతతికి చెందిన విద్యావేత్త. ఈయన తనను తాను భారతీయునిగా భావించుకొన్నాడు. నా మాతృభూమికి (టు మై నేటివ్ లాండ్) అన్న పద్యములో ఈ విధంగా రాశాడు:

My Country! In the days of Glory Past

A beauteous halo circled round thy brow
And worshipped as deity thou wast,
Where is that Glory, where is that reverence now?

తొలి జీవితం

[మార్చు]

ఫ్రాన్సిస్ డెరోజియో కుమారుడైన హెన్రీ డెరోజియో 1809 ఏప్రిల్ 18కలకత్తా లోని ఎంతల్లీ-పద్మపుకూరులో జన్మించాడు. ధర్మొతల్లాలోని డేవిడ్ డ్రమ్మండ్ పాఠశాల విద్యార్థిగా ఉండగా హెన్రీ, చరిత్ర, తత్త్వశాస్త్రము, ఆంగ్ల సాహిత్యముతో పాటు మూఢనమ్మకాలకు అతీతమైన హేతువాద ఆలోచనా విధానంలో తొలిశిక్షణ పొందాడు. డ్రమ్మండ్ తన స్వతంత్ర భావాలకు ప్రసిద్ధిచెందిన బాగా చదువుకున్న స్కాటిష్ మిషనరీ.

హెన్రీ 14 యేళ్లవయసులో విద్యాభ్యాసానికి స్వస్తిచెప్పి కలకత్తాలో తండ్రికి వృత్తిలో సహాయం చేయటం ప్రారంభించాడు. ఆ తరువాత భగల్ పూర్ కు మారాడు. గంగా నది ఒడ్డున దృశ్యసౌందర్యానికి పరవశుడై కవిత్వం వ్రాయటం ప్రారంభించాడు. ఈయన కవితలు కొన్ని డా. గ్రాంట్ యొక్క ఇండియా గజెట్ పత్రికలో ప్రచురించబడ్డాయి. ఇమ్మాన్యూయేల్ కాంట్ వ్రాసిన ఒక పుస్తకంపై హెన్రీ యొక్క విమర్శనాత్మక సమీక్ష అప్పటి మేధావివర్గాన్ని ఆకర్షించింది. 1828లో తన కవిత్వాన్ని పుస్తకంగా అచ్చువేయించే ఉద్దేశముతో కలకత్తా వెళ్ళాడు. కొత్తగా స్థాపించబడిన హిందూ కళాశాలలో ఒక అధ్యాపక పదవి ఖాళీగా ఉందని తెలుసుకొని, దానికి దరఖాస్తు చేసుకొని, ఆ పదవికి ఎంపికయ్యాడు. ఈయన కవితలలో ఫకీర్ ఆఫ్ ఝంగీరా ప్రసిద్ధమైనది.

1828లో రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజాన్ని స్థాపించాడు. ఈ సంఘటన సనాతన హిందూ సమాజంలో పెద్ద దుమారాన్ని లేపింది. ఈ మతవిప్లవాన్ని అంతమొందించడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఈ సామాజిక విప్లవ నేపథ్యంలో వెలువడిన హెన్రీ డెరోజియో ఆలోచనలు సామాజిక తిరుగుబాటును పురికొల్పాయి.

మరణం

[మార్చు]

ఇతడు తన 22వ ఏట డిసెంబరు 26, 1831 న చనిపోయాడు.