హెచ్ సంస్కృతి సమాధులు
దక్షిణ ఆసియా చరిత్ర సారాంశం భారత ఉపఖండ చరిత్ర |
---|
సంస్కృతి భారత ఉపఖండంలోని ఉత్తర భాగంలో పంజాబు ప్రాంతంలో కాంస్య యుగం సంస్కృతి (క్రీ.పూ 1900 నుండి క్రీ.పూ 1300 వరకు) హెచ్ సమాధుల సంస్కృతి అని కూడా పేర్కొన్నారు. ఇది హరప్పా (సింధు లోయ) నాగరికత చివరి దశ ప్రాంతీయ రూపం (సింధు జుకరు సంస్కృతి, గుజరాతు రంగపూరు సంస్కృతి.
ఆరంభం
[మార్చు]హెచ్ సంస్కృతి సమాధులు ప్రస్తుత భారతదేశం, పాకిస్తాన్లలో పంజాబు పరిసరప్రాంతంలలో ఉంది. హరప్పా వద్ద లభించిన స్మశానవాటికకు "ఏరియా హెచ్" అని పేరు పెట్టారు. సంస్కృతి అవశేషాలు క్రీ.పూ 1900 నుండి క్రీ.పూ 1300 చెందినవని అంచనావేసారు.
రఫీకు మొఘలు అభిప్రాయం ఆధారంగా క్రీస్తుపూర్వం 1700 లో సింధు లోయ నాగరికత ఉత్తర భాగంలో హెచ్ సంస్కృతి సమాధుల సంస్కృతి అభివృద్ధి చెందింది. ఇది పంజాబు భూభాగంలో ఉంది.[1] సింధు లోయ సంప్రదాయం స్థానికీకరణ యుగంలో లేదా " హరప్పా దశ చివరి" లో అభివృద్ధి చెందిన మూడు సాంస్కృతిక దశలలో ఒకటి.[2][3]
కెనోయెరు అభిప్రాయం ఆధారంగా హెచ్ సమాధుల సంస్కృతి "మునుపటి హరప్పా దశ నమూనా నుండి స్థిరపడిన సంస్థలో మార్పును మాత్రమే ప్రతిబింబిస్తుంది. సాంస్కృతిక ముగింపు కాదు. పట్టణ క్షయం, విదేశీయుల ఆక్రమణ, ప్రాంతాన్ని వదిలివేయడం కాదు. ఇవన్నీ గతంలో ఉన్నాయని సూచించబడింది." [4]
కెన్నెడీ, మల్లోరీ & ఆడంసు అభిప్రాయం ఆధారంగా హెచ్ సమాధుల సంస్కృతి మునుపటి హరప్ప జనాభాతో "స్పష్టమైన జీవసంబంధమైన అనుబంధాలను చూపిస్తుంది.[5][6]
హెచ్ సంస్కృతి సమాధుల కొన్ని లక్షణాలు స్వాతు సంస్కృతితో సంబంధం కలిగి ఉన్నాయి. ఇది భారత ఉపఖండం వైపు ఇండో-ఆర్య ఉద్యమానికి సాక్ష్యంగా పరిగణించబడుతుంది.[7] పార్పోలా అభిప్రాయం ఆధారంగా హెచ్ సంస్కృతి క్రీస్తుపూర్వం 1900 నాటి నుండి ఇండో-ఆర్య వలసల మొదటి తరంగాన్ని సూచిస్తుంది. వారు తరువాత క్రీ.పూ. 1700 - 1400 లో పంజాబు ప్రాంతానికి వలస కొనసాగించారు. [8] కొచ్చరు అభిప్రాయం ఆధారంగా 4 వ స్వాతు పంజాబులో హరప్పా హెచ్ సమాధులు (క్రీ.పూ. 2000-1800) స్థాపించాడాని, 5 వ స్వాతు ఋగ్వేద ఇండో-ఆర్యన్లు తరువాత హెచ్ సమాధుల సంస్కృతికి చెందిన ప్రజలకు నాయకత్వం వహించిన తరువాత చిత్రిత బూడిదవర్ణ పాత్రల సంస్కృతికి చెందిన ప్రజలు (క్రీ.పూ 1400) ఉద్భవించారని భావిస్తున్నారు.[9]
గాంధార సమాధి సంస్కృతి, ఓచరు కలర్డు కుమ్మరి సంస్కృతితో కలిసి, హెచ్ సమాధుల సంస్కృతిని కొంతమంది పరిశోధకులు వేద నాగరికత ఏర్పడటానికి ఒక మూలకారకంగా భావిస్తారు.[9]
ప్రధానాంశాలు
[మార్చు]ఈ సంస్కృతి ప్రత్యేక లక్షణాలు:[10]
- మానవ అవశేషాల దహన సంస్కారం. మానవులు మరణించిన తరువాత అస్థులను ఖననంచేసే ప్రక్రియలో చిత్రించిన కుండలలో ఉంచారు. మృతదేహాలను చెక్క శవపేటికలలో ఖననం చేసిన సింధు నాగరికతకు ఇది పూర్తిగా భిన్నమైనది. పాత్రలలో ఖననం చేసే సంస్కృతి, "సమాధి అస్థిపంజరాలు" దాదాపు సమకాలీనమైనవి.[11]
- ఎర్రటి కుండలు, జింకలు, నెమళ్ళు మొదలైన వాటి బొమ్మలతో నలుపు రంగులో చిత్రాలు చిత్రించబడ్డాయి. సూర్యుడు, నక్షత్ర మూలాంశాలు, మునుపటి కాలానికి భిన్నమైన ఉపరితల శైలితో ఇవి చిత్రించబడ్డాయి.
- తూర్పున స్థావరాల విస్తరణ.
- వరి ప్రధాన పంటగా మారింది.
- సింధు నాగరికత విస్తృత వాణిజ్యం స్పష్టమైన విచ్ఛిన్నం, సముద్రపు షెల్సు వంటి పదార్థాలు తరువాత ఉపయోగించబడలేదు.
- భవననిర్మాణం కొరకు మట్టి ఇటుకను ఉపయోగించడం కొనసాగింది.
హెచ్ సమాధులు అంత్యక్రియల కుర్చీల మీద చిత్రీకరించబడిన కొన్ని చిత్రాలు వేద పురాణాల అంశాల ద్వారా వివరించబడ్డాయి: ఉదాహరణకు బోలు శరీరాలతో ఉన్న నెమళ్ళు, లోపల ఒక చిన్న మానవ రూపం, ఇది చనిపోయినవారి ఆత్మలుగా వ్యాఖ్యానించబడింది. ఒక మట్టిదిబ్బ యమధర్మరాజు మట్టిదిబ్గగా చూడవచ్చు.[12][13] ఈ కాలంలో కొత్త మత విశ్వాసాల ప్రవేశాన్ని ఇది సూచిస్తుంది. కాని హెచ్ సమాధుల సంస్కృతికి చెందిన ప్రజలు హరప్పా నగరాలను నాశనం చేసేవారు అనే ఊహకు పురావస్తు ఆధారాలు మద్దతు ఇవ్వవు. .[14]
పురాతత్వపరిశోధనలు
[మార్చు]పురాతన భారతీయ శ్మశానవాటిక సంస్కృతిలో " హెచ్ సమాధుల " సంస్కృతి ఆధారపూర్వకంగా ధృవీకరించబడిన మొదటి సంస్కృతిగా గుర్తించబడుతుంది. ఇది గతంలో వేదాలలో వివరించబడింది. ఋగ్వేదంలో ఋక్కు 10.15.14 లో ఉద్భవిస్తున్న ఈ అభ్యాసం గురించిన సూచన ఉంది. ఇక్కడ పూర్వీకులు "దహన సంస్కారాలు (అగ్నిదగ్ధా-), దహించబడని (అనాగ్నిదగ్ధ-)" విధానాలలో ఖననం చేయబడ్డారన్న సూచన ఉంది.
ఇవి కూడా చూడండి
[మార్చు]- సింధూ లోయ సంప్రదాయం
- కురు రాజ్యం
- ఝుకారు సంస్కృతి
- రంగులద్దిన బంకమట్టి పాత్రలు, రాగిపాత్రల సంస్కృతి
- భారత ఉపఖండంలో మృణ్మయపాత్రలు
మూలాలు
[మార్చు]- ↑ M Rafiq Mughal Lahore Museum Bulletin, off Print, vol.III, No.2, Jul-Dec. 1990 [1] Archived 2015-06-26 at the Wayback Machine
- ↑ Kenoyer 1991a.
- ↑ Shaffer 1992.
- ↑ Kenoyer 1991b, p. 56.
- ↑ Kennedy 2000, p. 312.
- ↑ Mallory & Adams 1997, pp. 103, 310.
- ↑ Mallory & Adams 1997, p. 103.
- ↑ Parpola 1998.
- ↑ 9.0 9.1 Kochhar 2000, pp. 185–186.
- ↑ "Archived copy". Archived from the original on 30 అక్టోబరు 2009. Retrieved 28 అక్టోబరు 2019.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link) - ↑ Sarkar 1964.
- ↑ Mallory & Adams 1997, pp. 102.
- ↑ Bridget and Raymond Allchin (1982), The Rise of Civilization in India and Pakistan, p.246
- ↑ Mallory & Adams 1997, pp. 102–103.
వనరులు
[మార్చు]- Kennedy, Kenneth A. R. (2000), God-Apes and Fossil Men: Palaeoanthropology of South Asia, Ann Arbor: University of Michigan Press
- Kenoyer, Jonathan Mark (1991a), "The Indus Valley tradition of Pakistan and Western India", Journal of World Prehistory, 5 (4): 1–64, doi:10.1007/BF00978474
- Kenoyer, Jonathan Mark (1991b), "Urban Process in the Indus Tradition: A preliminary model from Harappa", in Meadow, R. H. (ed.), Harappa Excavations 1986-1990: A multidiscipinary approach to Third Millennium urbanism, Madison, WI: Prehistory Press, pp. 29–60
- Kochhar, Rajesh (2000), The Vedic People: Their History and Geography, Sangam Books
- Mallory, J. P.; Adams, D. Q. (1997), Encyclopedia of Indo-European Culture, London and Chicago: Fitzroy-Dearborn, ISBN 1-884964-98-2
- Parpola, Asko (1998), "Aryan Languages, Archaeological Cultures, and Sinkiang: Where Did Proto-Iranian Come into Being and How Did It Spread?", in Mair, Victor H. (ed.), The Bronze Age and Early Iron Age Peoples of Eastern and Central Asia, Washington, D.C.: Institute for the Study of Man, ISBN 0-941694-63-1
- Sarkar, Sasanka Sekhar (1964), Ancient Races of Baluchistan, Panjab, and Sind
- Shaffer, Jim G. (1992), "The Indus Valley, Baluchistan and Helmand Traditions: Neolithic Through Bronze Age", in Ehrich, R. W. (ed.), Chronologies in Old World Archaeology (Second ed.), Chicago: University of Chicago Press, pp. I:441–464, II:425–446
వెలుపలి లింకులు
[మార్చు]- March 2018 from Use dmy dates
- March 2018 from Use Indian English
- All Wikipedia articles written in Indian English
- Archaeological cultures of South Asia
- Bronze Age cultures of Asia
- Archaeological cultures in Pakistan
- Prehistoric India
- History of Punjab
- Indus Valley Civilisation
- Societal collapse
- Archaeological sites in Punjab, India
- Archaeological cultures in India