Jump to content

కంచుయుగం

వికీపీడియా నుండి
Diffusion of metallurgy in Europe and Asia Minor – the darkest areas are the oldest.

మానవుడు కంచును వాడిన చారిత్రిక కాలాన్ని కంచుయుగం అంటారు. కొన్ని ప్రాంతాల లోని ఆదిమ కాలపు రాతలను, పట్టణ నాగరికతల తొలినాళ్ళను కూడా కంచుయుగం గానే భావిస్తారు. పురాతన సమాజాలను వర్గీకరించడానికి, అధ్యయనం చేయడానికీ క్రిస్టియన్ జుర్గెన్సెన్ థామ్సన్ ప్రతిపాదించిన రాతి-కంచు-ఇనుప అనే మూడు యుగాల వర్గీకరణలో రెండవది కంచుయుగం.

రాగిని కరిగించి, దానికి తగరం, ఆర్సెనిక్ లేదా ఇతర లోహాలను కలిపి కంచును తయారు చేయడం గాని. ఇతర ప్రాంతాలలో తయారైన ఉత్పత్తిని కొనుగోలు చేయడం గానీ చేసిన కాలాన్ని కంచుయుగంగా భావిస్తారు. ఆ కాలం నాటి ఇతర లోహాల కంటే కంచు దృఢమైనది, మన్నికైనదీ. దీంతో ఆనాటి నాగరికతలు సాంకేతికంగా పైచేయి పొందగలిగాయి.

భూమిలో ఇనుము సమృద్ధిగా లభిస్తున్నప్పటికీ దాని అధిక ద్రవీభవన స్థానం - 1,538 ° సెం (2,800 ° ఫా) - కారణంగా క్రీ.పూ రెండవ సహస్రాబ్ది చివరి వరకు ఇనుము వాడకం జరగలేదు. తగరం ద్రవీభవన స్థానం బాగా తక్కువ - 231.9 (సెం (449.4 ° ఫా). రాగి కూడా ఇనుము కంటే బాగా తక్కువ ఉష్ణోగ్రత వద్దనే కరుగుతుంది - 1,085 ° సెం (1,985 ° ఫా). క్రీ.పూ 6000 నాటి కొత్త రాతియుగపు బట్టీల ఉష్ణోగ్రత సామర్థ్యం 900 ° సెం (1,650 ° ఫా) కంటే ఎక్కువగానే ఉండేది. రాగి, తగరాలను కరిగించడానికి ఈ బట్టీల సామర్థ్యం సరిపోయేది.[1] రాగి-తగరపు ఖనిజాల లభ్యత తక్కువగా ఉండేది. క్రీ.పూ. మూడవ సహస్రాబ్దిలో కంచు వ్యాపారం ప్రారంభమయ్యే వరకు పశ్చిమ ఆసియాలో తగరపు కంచు లేకపోవడం దీన్ని బలపరుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కొత్త రాతి యుగం తరువాత కంచుయుగం వచ్చింది. ఈ రెండింటి సంధి కాలంలో రాగియుగం వచ్చింది. ఇనుప యుగం సాధారణంగా కంచుయుగాన్ని అనుసరించినప్పటికీ, కొన్ని ప్రాంతాలలో (ఉప-సహారన్ ఆఫ్రికా వంటి చోట్ల) ఇనుప యుగం క్రీ.పూ 2500 లోనే ప్రారంభమైంది.[2]

కంచుయుగ నాగరికతల్లో రాయడం మొదలవడం విభిన్న కాలాల్లో జరిగింది. పురావస్తు ఆధారాల ప్రకారం, మెసొపొటేమియా (క్యూనిఫాం స్క్రిప్టు), ఈజిప్టు (హైరోగ్లిఫ్సు) నాగరికతలు మొట్టమొదటి రాత వ్యవస్థలను అభివృద్ధి చేశాయి.

చరిత్ర

[మార్చు]

స్థూలంగా కంచును విస్తారంగా ఉపయోగించిన కాలాన్ని కంచుయుగంగా గుర్తించారు. అయితే, కంచు సాంకేతికత పరిచయము, అభివృద్ధీ విశ్వవ్యాప్తంగా ఒకే సమయంలో జరగలేదు.[3] తగరపు కంచు తయారీకి ఒక విశిష్ట ఉత్పత్తి పద్ధతులు అవసరం. ముందుగా తగరాన్ని తవ్వాలి (ముఖ్యంగా కాసిటరైటు అనే ధాతువు రూపంలో). దానిని విడిగా కరిగించి శుద్ధి చెయ్యాలి. తరువాత రాగిని కరిగించి దానికి తగరాన్ని కలిపి కంచును తయారు చేయాలి. కంచుయుగం లోహాలను విస్తారంగా ఉపయోగించిన, లోహాలతో వాణిజ్యం చేసిన కాలం. మొట్టమొదటి తగర-కంచు మిశ్రమం ప్లోస్నిక్ (సెర్బియా) లోని విన్స్కా నాగరికతలో క్రీ.పూ. 5 వ సహస్రాబ్ది మధ్యలో జరిగిందని, ఈ నాగరికత కంచుయుగంలో భాగంగా పరిగణించనప్పటికీ, 2013 నాటి నివేదిక సూచిస్తోంది.[4] దీని కాలనిర్ణయం వివాదాస్పదమైంది.[5][6]

సమీప ప్రాచ్య ప్రాంతం

[మార్చు]

పశ్చిమ ఆసియా, సమీప ప్రాచ్య ప్రాంతం కంచుయుగంలోకి ప్రవేశించిన మొదటి ప్రాంతం. క్రీ.పూ. 4 వ సహస్రాబ్ది మధ్యలో సుమేరులో మెసొపొటేమియను నాగరికత అభివృద్ధి చెందడంతో ఇది మొదలైంది. సమీప ప్రాచ్యంలోని ప్రాచీన నాగరికతల ప్రజలు (దీన్ని "నాగరికత పురిటిగడ్డ"లలో ఒకటిగా భావిస్తారు) ఏడాది పొడుగూతా వ్యవసాయం చేసారు, వ్రాతవిధాన వ్యవస్థను అభివృద్ధి చేశారు, కుమ్మరి చక్రాన్ని కనుగొన్నారు. కేంద్రీకృత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసారు, వ్రాతపూర్వక చట్టాన్ని నిర్మించారు. నగర రాజ్యాలు, సామ్రాజ్యాలు ఏర్పాటు చేసారు, ఆధునిక నిర్మాణాలను ప్రారంభించారు. సామాజిక వర్గీకరణ, ఆర్థిక - పౌర పరిపాలన, బానిసత్వాలను సృష్టించారు. వ్యవస్థీకృత యుద్ధం, వైద్యం, మతాలను ఆచరించారు. ఈ ప్రాంతంలోని సమాజాలే ఖగోళ శాస్త్రం, గణితం, జ్యోతిషశాస్త్రాలకు పునాదులు వేశాయి.

కింద ఇచ్చినవి ఉరామరిక తేదీలు
New Kingdom of EgyptMiddle Kingdom of EgyptOld Kingdom of EgyptEarly Dynastic Period of EgyptNaqada IIIAncient EgyptKassitesBabyloniaAssyriaThird Dynasty of UrAkkadian EmpireCities of the ancient Near EastAncient Near East

The Ancient Near East Bronze Age can be divided as following:

Near East Bronze Age Divisions

The archetypal Bronze Age divisions of the Near East have a well-established triadic clearness of expression. The period dates and phases below are solely applicable to the Near East and thus not applicable universally.[7][8][9]

Early Bronze Age (EBA)

3300–2100 BC

3300–3000: EBA I
3000–2700: EBA II
2700–2200: EBA III
2200–2100: EBA IV
Middle Bronze Age (MBA)
Also, Intermediate Bronze Age (IBA)

2100–1550 BC

2100–2000: MBA I
2000–1750: MBA II A
1750–1650: MBA II B
1650–1550: MBA II C
Late Bronze Age (LBA)

1550–1200 BC

1550–1400: LBA I
1400–1300: LBA II A
1300–1200: LBA II B (Bronze Age collapse)

అనటోలియా

[మార్చు]

క్రీ.పూ. 18 వ శతాబ్దంలో ఉత్తర అనటోలియాలోని హట్టుసాలో హిట్టైటు సామ్రాజ్యం స్థాపించబడింది. క్రీ.పూ. 14 వ శతాబ్దంలో హిట్టైటు రాజ్యం ఉచ్ఛ స్థాయిలో ఉంది. మధ్య అనటోలియా, నైరుతి సిరియా, ఉగారిటు, ఎగువ మెసొపొటేమియాలు ఇందులో భాగంగా ఉన్నాయి. క్రీ.పూ 1180 తరువాత సముద్రమార్గంలో ప్రజల ఆకస్మిక రాకకు, లెవాంటులో సంభవించిన సాధారణ గందరగోళాలకూ సంబంధం ఉందని భావించారు.[10][11] తరువాత ఈ రాజ్యం అనేక స్వతంత్ర "నియో-హిట్టైటు" నగర-రాజ్యాలుగా విచ్ఛిన్నమైంది. వీటిలో కొన్ని క్రీ.పూ. 8 వ శతాబ్దం వరకు మనుగడ సాగించాయి.

క్రీ.పూ. రెండవ సహస్రాబ్ది ద్వితీయార్ధంలో పశ్చిమ అనటోలియాలోని అర్జావా రాజ్యం, దక్షిణ అనటోలియా వెంట టర్కీ సరస్సుల ప్రాంతం నుండి ఏజియను తీరం వరకు విస్తరించింది. అర్జావా, న్యూ హిట్టైటు రాజ్యాలకు పశ్చిమాన - కొన్నిసార్లు ప్రత్యర్థిగాను, కొన్నిసార్లు సామంతరాజ్యంగానూ ఉండేది.

క్రీ.పూ 1400 లో పశ్చిమ అనటోలియాలోని రాజ్యాల సమాఖ్య " అసువా లీగు"ను మొదటి తుధాలియా నేతృత్వం లోని హిట్టీయుల చేతిలో ఓడిపోయింది. సాధారణంగా అర్జావాను, దానికి ఉత్తరాన ఉన్న అసువాతో అనుసంధించి చూస్తారు. బహుశా అది సరిహద్దు దేశంగా ఉండి ఉండేది. లేదా అసువా లీగుకే ఇది మరొక పేరు అయి ఉండవచ్చు (కనీసం కొన్ని కాలాల్లో).

ఈజిప్టు

[మార్చు]
తొలి కంచుయుగ రాజవంశాలు
[మార్చు]
Bronze mirror with a female human figure at the base, Eighteenth dynasty of Egypt (1540–1296 BC)
Sphinx-lion of Thutmose III 1479–1425 BC

ఈజిప్టులో కంచుయుగం ఆదిమ రాజవంశాల కాలంలో (సి. క్రీ.పూ. 3150) ప్రారంభమవుతుంది. ప్రాచీన ఈజిప్టు కంచుయుగం (ఈజిప్టు ప్రారంభ రాజవంశం కాలం అని కూడా పిలువబడింది).[12][13] c. క్రీ.పూ 3100 లో దిగువ, ఎగువ ఈజిప్టుల ఏకీకరణ జరిగిన వెనువెంటనే మొదలైంది. మొదటి, రెండవ రాజవంశాలను సమైఖ్యపరచడానికి ఈ నిర్ణయం తీసుకొనబడింది. ఇది ఈజిప్టు ప్రోటోడైనస్టికు కాలం (క్రీ.పూ 2686) వరకు లేదా పాత రాజ్యం వరకు కొసాగింది. ఈజిప్టు సమైఖ్యం అయిన తరువాత మొదటి రాజవంశం రాజధాని అబిడోసు నుండి మెంఫిసుకు మార్చబడింది. సమైఖ్య ఈజిప్టును కింగు-గాడు పాలించాడు. అబిడోసు దక్షిణప్రాంతంలో ప్రధాన పవిత్ర భూమిగా మిగిలిపోయింది. ప్రారంభ రాజవంశకాలంలో పురాతన ఈజిప్టు నాగరికత అంశాలైన కళ, వాస్తుశిల్పం, మతం రూపుదిద్దుకున్నాయి. ప్రారంభ కంచుయుగంలో మెంఫిసు ఆ సమయంలో అతిపెద్ద నగరంగా ఉంది.[12]ఈజిప్టు నాగరికత శిఖరాగ్రస్థాయి కొనసాగింది. ఈ నాగరికత క్రీ.పూ. 3 వ సహస్రాబ్దిలో మొట్టమొదటి 3 రాజ్యాల కాలంలో (దిగువ నైలు లోయ, మిడిలు కింగ్డం, న్యూ కింగ్డం)ఉనికిలో ఉన్నట్లు గుర్తించబడింది.

ఈజిప్టు మొదటి ఇంటర్మీడియటు కాలం, [14] పురాతన ఈజిప్టు చరిత్రలో "చీకటి కాలం" గా వర్ణించబడింది. ఇది పాత రాజ్యం ముగిసిన 100 సంవత్సరాల తరువాత క్రీ.పూ 2181 నుండి 2055 వరకు విస్తరించింది. ఈ కాలంలో ముఖ్యంగా ప్రారంభ కాలానికి చెందిన స్మారక ఆధారాలు తక్కువగా ఉన్నాయి. మొదటి ఇంటర్మీడియటు కాంలంలో ఈజిప్టు పాలన సుమారు రెండు పోటీ శక్తి స్థావరాల మధ్య విభజించబడింది: దిగువ ఈజిప్టులోని హెరాక్లోపోలిసు, ఎగువ ఈజిప్టులోని తీబ్సు. ఈ రెండు రాజ్యాలు చివరికి వివాదంలోకి వస్తాయి. ఉత్తరప్రాంతాన్ని తీబను రాజులు జయించారు. ఫలితంగా 11 వ రాజవంశం రెండవ భాగంలో ఈజిప్టు ఒకే పాలకుడి ఆధ్వర్యంలో తిరిగి పాలించబడింది.

మద్యకాల కంచుయుగ రాజవంశాలు
[మార్చు]

ఈజిప్టు మధ్య సామ్రాజ్యం క్రీ.పూ 2055 - 1650 వరకు కొనసాగింది. ఈ కాలంలో ఈజిప్టు ప్రజాదరణ పొందిన మతంలో ఒసిరిసు అంత్యక్రియల ఆచారం ఆధిపత్యం చెలాయించింది. ఈ కాలం రెండు దశలను కలిగి ఉంది: 11 వ రాజవంశం తేబ్సు రాజధానిగా చేసుకుని పాలించింది. 12 వ [15] 13 వ రాజవంశాలు ఎల్-లిష్టు మీద కేంద్రీకృతమై ఉన్నాయి. ఏకీకృత రాజ్యం గతంలో 11 - 12 వ రాజవంశాలన కొనసాగింది. కాని చరిత్రకారులు ఇప్పుడు కనీసం 13 వ రాజవంశం మధ్య రాజ్యానికి చెందినదిగా భావిస్తారు.

రెండవ మద్యకాల కంచుయుగం కాలంలో[16] మధ్య సామ్రాజ్యం ముగింపు, క్రొత్త రాజ్యం ప్రారంభం మధ్య ప్రాచీన ఈజిప్టు రెండవ సారి గందరగోళానికి గురైంది. ఇది 15 - 16 వ రాజవంశాల ఆధ్వర్యంలో ఉన్న హైక్సోసుకు బాగా ప్రసిద్ది చెందింది. ఈజిప్టులో మొట్టమొదటగా 11 వ రాజవంశంలో హైక్సోసు కనిపించారు. 13 వ రాజవంశంలో వీరు అధికారంలోకి రావడం ప్రారంభించి అవారిసు నియంత్రణలో రెండవ ఇంటర్మీడియటు కాలం నుండి వెలుగులోకి వచ్చారు. 15 వ రాజవంశం నాటికి వారు దిగువ ఈజిప్టును పరిపాలించారు. వీరు 17 వ రాజవంశం చివరిలో బహిష్కరించబడ్డారు.

మూలాలు

[మార్చు]
  1. James E. McClellan III; Harold Dorn (2006). Science and Technology in World History: An Introduction. JHU Press. ISBN 978-0-8018-8360-6. p. 21.
  2. Iron In Africa: Revising The History : Unesco. Portal.unesco.org. Retrieved on 2013-07-28.
  3. Bronze was independently discovered in the Maykop culture of the North Caucasus as early as the mid-4th millennium BC, which makes them the producers of the oldest known bronze. However, the Maykop culture only had arsenical bronze. Other regions developed bronze and its associated technology at different periods.
  4. Radivojevic, M; Rehren, T; Kuzmanovic-Cvetkovic, J; Jovanovic, M; Northover, JP (2013). "Tainted ores and the rise of tin bronzes in Eurasia, సుమారు6500 years ago". Antiquity. 87 (338): 1030–1045. doi:10.1017/S0003598X0004984X.
  5. Sljivar, D.; Boric, D.; et al. (2014). "Context is everything: comments on Radivojevic et al. (2013)". Antiquity. 88 (342): 1310–1315. doi:10.1017/s0003598x00115480.
  6. Radivojevic, M.; Rehren, Th.; Kuzmanovic-Cvetkovic, J.; Jovanovic, M. (2014). "Context is everything indeed: a response to Sljivar and Boric". Antiquity. 88 (342): 1315–1319. doi:10.1017/s0003598x00115492.
  7. The Near East period dates and phases are unrelated to the bronze chronology of other regions of the world.
  8. Piotr Bienkowski, Alan Ralph Millard (editors). Dictionary of the ancient Near East. p. 60.
  9. Amélie Kuhr. The Ancient Near East, సుమారు 3000–330 BC. p. 9.
  10. Killebrew, Ann E. (2013), "The Philistines and Other "Sea Peoples" in Text and Archaeology", Society of Biblical Literature Archaeology and biblical studies, vol. 15, Society of Biblical Lit, p. 2, ISBN 978-1-58983-721-8, archived from the original on 2015-09-03, retrieved 2015-06-20. Quote: "First coined in 1881 by the French Egyptologist G. Maspero (1896), the somewhat misleading term "Sea Peoples" encompasses the ethnonyms Lukka, Sherden, Shekelesh, Teresh, Eqwesh, Denyen, Sikil / Tjekker, Weshesh, and Peleset (Philistines). [Footnote: The modern term "Sea Peoples" refers to peoples that appear in several New Kingdom Egyptian texts as originating from "islands" (tables 1–2; Adams and Cohen, this volume; see, e.g., Drews 1993, 57 for a summary). The use of quotation marks in association with the term "Sea Peoples" in our title is intended to draw attention to the problematic nature of this commonly used term. It is noteworthy that the designation "of the sea" appears only in relation to the Sherden, Shekelesh, and Eqwesh. Subsequently, this term was applied somewhat indiscriminately to several additional ethnonyms, including the Philistines, who are portrayed in their earliest appearance as invaders from the north during the reigns of Merenptah and Ramesses Ill (see, e.g., Sandars 1978; Redford 1992, 243, n. 14; for a recent review of the primary and secondary literature, see Woudhuizen 2006). Hencefore the term Sea Peoples will appear without quotation marks.]"
  11. The End of the Bronze Age: Changes in Warfare and the Catastrophe Ca. 1200 B.C., Robert Drews, pp. 48–61 Quote: "The thesis that a great "migration of the Sea Peoples" occurred ca. 1200 B.C. is supposedly based on Egyptian inscriptions, one from the reign of Merneptah and another from the reign of Ramesses III. Yet in the inscriptions themselves such a migration nowhere appears. After reviewing what the Egyptian texts have to say about 'the sea peoples', one Egyptologist (Wolfgang Helck) recently remarked that although some things are unclear, "eins ist aber sicher: Nach den agyptischen Texten haben wir es nicht mit einer 'Volkerwanderung' zu tun." Thus the migration hypothesis is based not on the inscriptions themselves but on their interpretation."
  12. 12.0 12.1 Karin Sowada and Peter Grave. Egypt in the Eastern Mediterranean during the Old Kingdom.
  13. Lukas de Blois and R. J. van der Spek. An Introduction to the Ancient World. p. 14.
  14. Hansen, M.H. (2000). A comparative study of thirty city-state cultures: An investigation conducted by the Copenhagen Polis Centre. Copenhagen: Det Kongelike Danske Videnskabernes Selskab. p. 68.
  15. Othmar Keel and Christoph Uehlinger. Gods, goddesses, and images of God in ancient Israel, 1998. p. 17 (cf. "The first phase (Middle Bronze Age IIA) runs roughly parallel to the Egyptian Twelfth Dynasty")
  16. Bruce G. Trigger. Ancient Egypt: a social history. 1983. p. 137. (cf. ... "for the Middle Kingdom and Second Intermediate Period it is the Middle Bronze Age".)
"https://te.wikipedia.org/w/index.php?title=కంచుయుగం&oldid=3889440" నుండి వెలికితీశారు