హెచ్.ఎస్. సావిత్రి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హెచ్.ఎస్. సావిత్రి
హెచ్.ఎస్.సావిత్రి
వృత్తిమహిళా శాస్త్రవేత్త

హెచ్.ఎస్. సావిత్రి బెంగుళూరులో మద్యతరగతి కుటుంబంలో జన్మించింది. హెచ్.ఎస్. సావిత్రి ఒక అన్న, ఇద్దరు అక్కలు, ఒక చెల్లెలు ఉన్నారు.వారింట్లో ఆమె తాతా, నాయనమ్మలు కూడా వారితో ఉండేవారు. ఇంటికి పెద్ద కుమారుడిగా హెచ్.ఎస్. సావిత్రి తండ్రి సోదరీ, సోదరుల విద్య, వివాహబాధ్యలు నేరవేర్చాడు. వారింట్లో ఎప్పుడూ అనేక మంది ఉండేవారు.

తల్లితండ్రుల సహకారం

[మార్చు]

ఆమె తల్లి సమర్ధురాలు. ఇంటిని సమర్ధవంతగా నిర్వహించేది. సమయం లభించినప్పుడు వారితో కూర్చుని దుస్తులు కుట్టడం, స్వెట్టర్లు అల్లడం వంటివి చేస్తూ ఉండేది. ఆమె వారికి వర్షాంతర పరీక్షలకు మునుపే పరీక్షలు పెట్టి ఆపేపర్లను ఆమె సరిదిద్దేద్ది చూసేది. అమే తన పిల్లందరిని ప్రొఫెషనర్లుగా చూడాలని స్వంతకాళ్ళ మీద నిలబడాలని లక్ష్యంగా పెట్టుకున్నది.ఆమె పిల్లలందరి లక్ష్యసిద్ధికి కృషిచేస్తూ ఉండేది.అమే తల్లితండ్రులు ఎప్పుడూ ఆడపిల్లలు, మగపిల్లల మద్య తారతమ్యాలు చూసేవారు కాదు. వారు ఎప్పుడూ పిల్లలందరూ చక్కగా చదవాలని చెబుతుండే వారు. ఆమె అక్కలు ఇద్దరు మెడికల్ కాలేజిలో చేరారు. ఆమె ప్రీ యూనివర్శిటీ కోర్సులో ఫిజిక్స్, మాథమెటిక్స్ ప్రధానాంశంగా తీసుకుంది.

సమ్మర్ ప్రోగ్రాం

[మార్చు]

హెచ్.ఎస్. సావిత్రి తండ్రి ప్రోత్సాహంతో " బెంగుళూరు విజ్ఞాన శాస్త్రము ఫోరం " నిర్వహించిన సమ్మర్ ప్రోగ్రాంలో భాగస్వామ్యం వహించింది. అది హెచ్.ఎస్. సావిత్రికి ఎంతో ప్రేరణ కలిగించింది. అప్పుడు అక్కడకు " ఐ.ఐ.ఎస్.సి " నుండి వచ్చిన లెక్చరర్లను కలుసుకునే అవకాశం, వారితో మాట్లాడే అవకాశం అలాగే వారిని ప్రశ్నించి తెలుసుకునే అవకాశం లభించింది. సమ్మర్ ప్రోగ్రాంలో ప్రత్యేక మైన అంశం అందులో పాల్గొన్న విద్యార్థులు " రామన్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ "కు తీసుకు వెళ్ళారు. అక్కడ విద్యార్థులందరూ " సర్ సి.వి.రామన్‌ "ను కలుసుకునే అవకాశం లభించింది. ఆ సమయంలో సర్ సి.వి.రామన్‌ భారతీయులలో " కలర్ బ్లైండ్‌నెస్ " గురించి ఆసక్తి కలిగి ఉన్నందున విద్యార్ధూలందరికి కలర్ బ్లైండ్‌నెస్ పరీక్షలు నిర్వహించాడు.ఆమె కెమెస్ట్రీలో అధికమైన మార్కులు సంపాదించిన కారణంగా ఆమెకు నోబెల్ బహుమతి గ్రహీత సర్ సి.వి. రామన్‌తో 30 సెంకడ్లు గడిపే అవకాశం లభించింది.

కాలేజ్

[మార్చు]

హెచ్.ఎస్. సావిత్రి తరువాత " సెంట్రల్ కాలేజ్ "లో కెమెస్ట్రీ ఆనర్స్ అధ్యనం చేసింది ఆతరువాత ఆమె " ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ " బయోకెమెస్ట్రీ చదివింది. తరువాత పి.హెచ్.డి చేసే సమయంలో ఆమెకు ప్రఖ్యాత ఎంజిమాలజిస్ట్ " ఎన్.అప్పాజీ రావు " మార్గదర్శకుడుగా ఉన్నాడు.

వివాహం

[మార్చు]

హెచ్.ఎస్. సావిత్రి ఐ.ఐ.ఎస్.సిలో ఆర్గానిక్ కెమెస్ట్రీ విద్యార్థిఅయిన ఎం.ఆర్.ఎన్ మూర్తితో వివాహం అయింది. తరువాత ఆమె భర్తతో కలిసి దీర్ఘకాలం రీసెర్చ్ కొనసాగించింది. ఆమె కుమారునికి జన్మనివ్వడానికి 10 రోజుల క్రితం ఆమె రీసెర్చ్ థిసీస్ సమర్పించింది. కుటుంబ నిర్వహణకు ఆమెకు తల్లితండ్రులు, భర్త , తల్లితండ్రులు సహకరించారు.

పోస్ట్ డాక్టొరల్ పొజిషన్

[మార్చు]

హెచ్.ఎస్. సావిత్రి భర్తతో కలిసి పోస్ట్ డాక్టొరల్ పొజిషన్ కొరకు పర్డ్యూ యూనివర్శిటీలో పనిచేసి తిరిగి ఐ.ఐ.ఎస్.సికి వచ్చారు. వచ్చిన ఒక మాసంలోపునే వారిద్దరూ ఉద్యోగబాధ్యతలు స్వీకరించారు. వారు గ్రీన్‌హౌస్ ఎఫెక్ట్ గురించి పరిశోధన కొనసాగించారు. తరువాత హెచ్.ఎస్. సావిత్రికి ప్రొఫెసర్ అప్పాజీ లాబరేటరీలో పనిచేసే అవకాశం లభించింది. అక్కడ ఆమె స్వతంత్రంగా పనిచేయడానికి స్వంత ప్రాజెక్టులో పనిచేయడానికి అవకాశం లభించింది. ఆమెతో ప్రాజెక్టు వర్కులో కొత్త విద్యార్థి సూర్యనారాయణ భాగస్వామ్యం వహించాడు.సూర్యనారాయణ స్థిరమైన ఉద్యోగం కాని రీసెర్చ్ గ్రాంటు కాని లేకుండా ధైర్యంగా ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం వహించడం విశేషం. సూర్యనారాయణతో హెచ్.ఎస్. సావిత్రి కలిసి సమర్పించిన " ఫిసాలిస్ మోటిల్ వైరస్ " థిసీస్ " జర్నలాఫ్ బయోలాజికల్ ఎమెస్ట్రీ "లో ప్రచురించబడింది. ఇది ఆమె జీవితంలో ఒక మలుపుగా మారి ఆమెకు అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేసే అవకాశం కలిగించింది. ఆమె రీసెర్చ్ కారీర్ మొత్తం సహకరించిన ఆమె భర్తకు, అప్పాజీరావుకు అది ఆనందం కలిగించింది.

విద్యార్ధులకు ప్రోత్సాహం

[మార్చు]

ఉద్యోగబాధ్యతలు నిర్వహిస్తూనే ఆమె తనస్వంత లాబరేటరీ, అప్పాజీ లాబరేటరీలలో పనిచేసింది. వారిద్దరి విద్యార్థులు కూడా కలిసి పనిచేసారు. ఆమె అప్పాజీ కలిసి రీసెర్చ్ లాబ్‌లో విద్యార్థులకు విజ్ఞాన శాస్త్రము ఙానం అభివృద్ధి చేయడానికి విజ్ఞాన శాస్త్రము అధ్యయనం చేయడం, విజ్ఞాన శాస్త్రము తమ కేరీర్‌గా ఎంకోవడం లక్ష్యంలా చేసుకోవడానికి అవసరమైన ప్రోత్సాహం కలిగించారు. వారు ఐ.ఐ.ఎస్.సిలో కౌంసెలింగ్ కేంద్రం ఏర్పాటు చేసి రీసెర్చ్ విద్యార్థులకు మద్దతుగా నిలిచారు. అలాగే వారిద్దరూ కర్నాటకా అంతటా సంచరించి విద్యార్థులకు లెల్చర్లు ఇచ్చారు. అంతేకాక స్కూలు విద్యార్థులకు విజ్ఞాన శాస్త్రము కాంగ్రెస్, ఫీల్డ్ ట్రిప్పులు, సమ్మర్ క్యాంపులు, గైడెంస్ క్లాస్ అరియు ఇంటాక్టివ్ సెషన్లు ఏర్పాటు చేసింది.అలాగే విభిన్న సబ్జెక్టులకు మారుతూ లక్ష్యశుద్ధితో రీసెర్చ్ కొనసాగించడం విద్యార్థులకు నేర్పుతూ ఆమెకు ఆమె ఉత్సాహాన్ని అందించుకున్నది.

వెలుపలి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  • [1] ఈ లింకులో ఆయా శాస్త్రవేత్తలు స్వయంగా వ్రాసిన వ్యాసాలు ఉన్నాయి. వాటి నుండి వికీపీడియాకు అనుకూలంగా.