Jump to content

షీలా కె రామశేష

వికీపీడియా నుండి
షీలా కె రామశేష
వృత్తిమహిళా శాస్త్రవేత్త

షీలా కె రామశేష 5 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు వారి కుటుంబం కర్ణాటక రాష్ట్రానికి తరలివెళ్ళింది. ఆమె స్కూలు విద్యాభ్యాసం 10 వైవిధ్యమైన పట్టణాలలో కొనసాగింది. ఆమె పలు వైవిధ్యమైన మాధ్యమాలలో విద్యను అభ్యసించింది. విజ్ఞాన శాస్త్రము, మాథ్స్ చదవడానికి భాషలు ఆటంకం కావు. ఈ రెండు సబ్జెక్ట్లలో షీలా కె రామశేషకున్న ప్రఙవలన పలు టీచర్లకు ఆమె అభిమాన విద్యార్థిని అయింది. ఇది ఆమెను కాలేజీలో ఫిజిక్స్, కెమెస్ట్రీ, మాథ్స్ ఎంచుకోవడానికి కారణమైంది. ఎం.ఎస్.సి చదేసమయంలో ఆమె సెమినార్ టపిక్‌గా " ఎలెక్ట్రికల్ డబుల్ లేయర్స్ "ను ప్రధానాంశంగా ఎంచుకున్నది. దానిని గురించి అధ్యయనం చేయడానికి " ఇండియన్ ఇంస్టిట్యూట్ ఆఫ్ విజ్ఞాన శాస్త్రము " గ్రంథాలయానికి వెళ్ళింది. ఆ సమయంలో ఆమె ఐ.ఐ.ఎస్.సి రీసెర్చ్ స్కాలర్లతో అనేక మార్లు చర్చలు జరిపింది. రీసెర్చ్ వాతావరణం అంకితభావంతో వారు పనిచేయడం ఆమె మీద విపరీతంగా ప్రభావం చూపెట్టాయి. ఆమెకు సహజంగా ఉన్న ఆసక్తికి ఈ చర్చలు మరింత బలాన్ని ఇచ్చాయి. ఆమెకు రీసెర్చ్ చేయాలన్న తపనను గ్రహించి వారి కుటుంబం ఆమెను ప్రోత్సహించింది.

రీసెర్చ్

[మార్చు]

షీలా కె రామశేష ఐ.ఐ.ఎస్.సిలో రీసెర్చ్ చేయడానికి చేరింది. పి.హె.డిలో ఆమె థిసీస్ కొరకు " మాగ్నటిక్ అండ్ ఎలెక్ట్రికల్ ప్రాపర్టీస్ ఆఫ్ పర్వోస్కిట్ బేస్డ్ సెరామిక్స్"ను ప్రధానాంశంగా ఎంచుకున్నది. ఇక్కడే ఆమె రామశేషను కలుసుకుని వివాహం చేసుకున్నది. రీసెర్చ్ తర్వాత ఆమె తన భర్త సలహా ఇచ్చినట్లు పోస్ట్ డాక్టొరల్ పొజిషన్ కొరకు ప్రయత్నించాలా లేక భర్తకు ఫెలోషిప్ లభించిన ప్రదేశానికి వెళ్ళాలా అన్న సందిగ్ధంలో పడింది. అయినప్పటికీ తనకు లభించిన పోస్ట్ డాక్టొరల్ పొజిషన్ వదులుకుని భర్తతో వెళ్ళడానికి నిశ్చయించుకున్నది. ఎందుకంటే వివాహం అయిన తరువాత భార్యాభర్తలు ఒకటిగా నివసించడం ధర్మమని ఆమె భావించింది.

వివాహం

[మార్చు]

గృహిణిగా స్థిరపడిన తరువాత షీలా కె రామశేషకు కెమెస్ట్రీలో పనిచేసే అవకాశం లభించింది. భారతదేశం తిరిగి వచ్చే వరకు ఆమె ఆపనిని కొనసాగించింది. సరికొత్త రంగంలో పనిచేసిన అనుభవం ఆమెకు పోస్ట్ డాక్టొరల్ పొజిషన్ అవకాశాలను వెదకడానికి సహకరించింది. ఆమెకు " యూనివర్శిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్, లూసియానా స్టేట్ యూనివర్శిటీ, ప్రింస్టన్ యూనివర్శిటీ వంటి ప్రఖ్యాత యూనివర్శిటీలలో పనిచేయడానికి అవకాశం లభించింది. ఆమె విజ్ఞాన శాస్త్రము ఆకర్షణీయంగా రీసెర్చ్ వరకూ రావడం తరువాత అంకితభావంతో పనిచేడమెలాగో నేర్చుకుంది. ఈ యూనివర్శిటీలలో శక్తివంతంగా పనిచేసే అవకాశం ఆమెను ఎంతగానో ఆనందపరచింది. ఆ సమయంలోనే ఆమె కుమార్తెకు జన్మనిచ్చింది. ఆ తరువాత వారి వివాహజీవితం మరింత సంతోషప్రదంగా సాగిందని ఆమె తెలిపింది.

.

భారతదేశం తిరిగి రాక

[మార్చు]

1984లో భారతదేశానికి తిరిగి వచ్చిన తరువాత వారికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. తరువాత ఆమె రీసెర్చ్ అవకాశాలు లేని అండర్ గ్రాడ్యుయేట్ కాలేజిలో టీచింగ్ చేసింది. ఆ తరువాత వరుసగా తత్కాలిక ఫెలోషిప్స్ అందుకున్నది. ఆమె రెగ్యులర్ రీసెర్చ్ చేయాలని అభిలషించింది. కుటుంబం గురించి మరిచిపోయి రీసెర్చిలో మునిగిపోవాలని అభిలషించింది. తన కుటుంబ మద్దతుతో రీసెర్చ్ కొనసాగించాలనికోరుకుంది. తతువాత ఆమె నేషనల్ ఎయిరోపేస్ లాబరేటరీలో యు.జి.సి పొజిషన్ తీసుకుంది. ఇది ఆమె జీవితంలో కొంత కష్టమైన నిర్ణయంగా మారింది. ఉదయం 7.30 కు ఇంటి నుండి పసిబిడ్డను వదిలి పోయి తిరిగి సాయంకాలం 6.30కి ఇంటికి చేరడం కొంత మనస్థాపం కలిగించింది.

తిరిగి రీసెర్చ్ కొనసాగింపు

[మార్చు]

కుటుంబబాధ్యతల నడుమ షీలా కె రామశేష ఒక స్వతంత్రమైన మరుయు నిర్మాణాత్మకమైన రీసెర్చ్ కార్యక్రమం చేపట్టింది. ఆ రీసెర్చ్ 13 సంవత్సరాలకాలం కొనసాగింది. ప్రారంభకాలంలో ఎలెక్ట్రికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సెరామిక్స్ అండర్ ప్రెషర్ గురించి పరిశోధన చేసింది. తరువాత ఆమె స్వతంత్ర పరిశోధనా బృందాన్ని ఏర్పాటు చేసుకుని పరిశోధనలు కొనసాగించింది. ఆమె తయాతుచేసిన బృందంలో పి.హెచ్‌డి, ఎం.టెక్, బి.టెక్ విద్యార్థులతో కలసి పనిచేసింది.

బెంగుళూరు

[మార్చు]

బెంగుళూరులో జి.ఇ సంస్థ అర్.డి ఆపరేషంస్ ప్రారంభించగానే షీలా కె రామశేషకు అక్కడ పెన్‌షన్, ఉద్యోగ బధ్రతతో పనిచేసే అవకాశంలభించింది. ఆమె స్నేహితులు ఆమెను నిరుత్సాహపరుస్తున్నా ఆమె జి.ఇ జాన్ ఎఫ్ వాచ్ టెక్నాలజీ సెంటర్ (జి.ఇ-జె.ఎఫ్.డబ్ల్యూ.టి.సి) లో పనిచేయడామికి అభ్యర్థించింది. ఆమె ఉత్సాహంగా పనిచేయడం ఆరంభించింది. ఆక్సైడ్ ఫ్యూయల్ సెల్స్ (ఎస్.ఒ.ఎఫ్.సి) ప్రోగ్రాం కో ఆర్డినేటర్‌గా పనిచేయడం మొదలుపెట్టింది. అది ఆమెకు పూర్తిగా సరికొత్త రంగం. ఆమె తిరిగి విద్యార్ద్జినిగా మారి గ్రంథాలయంలో పుస్తకాలను అధ్యయనం చేయడమూ మొదలుపెట్టింది. తరువాత ఆమె త్వరగా మెటల్, అల్లాయ్స్ డిపార్ట్మెంటుకు మారింది. తరువాత వారు ఎస్.ఒ.ఎఫ్.సి కొరకు కొత్తతరహా దృఢమైన అల్లాయ్స్ రూపకల్పన చేసారు. అందుకు ప్రయిఫలంగా వారు మేనేజ్మెంట్ అవార్డ్ అనుదుకున్నారు.

పదవోన్నతి

[మార్చు]

తరువాత షిలా కె రామశేషకు సెరామిక్స్ అండ్ ప్రొసెసింగ్ లాబ్ మేజేజరుగా పదవోన్నతి లభించింది. అలాగే సిక్స్- సిగ్మా బ్లాక్ బెల్ట్ రోల్‌కొరకు ప్రతిపాదించబడింది. ఆమెకు లాబరేటరీ రూపుదిద్దడానికి, అభివృద్ధి చేయడానికి, బృందసభ్యులను ప్రోత్సహించే అవకాశం లభించింది. అలాగే బృందం సభ్యులు అంకితభావంతో పనిచేయడానికి, సరి కొత్త టెక్నాలజీలు అందుబాటులోకి తీసుకురావడానికి అవకాశం లభించుంది. ఇవి అన్నీ సాంకేతికవాణిజ్యం అభివృద్ధికి తోడ్పడింది.వారు పలు వైద్యమైన సెరామిక్స్ కొరకు పనిచేసారు.ఆమె అక్కడ 61/2 సంవత్సరాలు పనిచేసింది. ఆమె వృత్తిపరంగా తృప్తికరమైన అభివృద్ధి సాధించింది. ఆమె 11 యు.ఎస్ పేటెంట్ హక్కులను సంపాదించింది. ఆమె వ్రాసిన 85 వ్యాసాలు ప్రచురించబడ్డాయి. అలాగే కొన్ని అవార్డులు అందుకున్నది. ఆమె వృత్తిపరంగా, వ్యక్తిగనంగా తృప్తికరమైన జీవితం గడిపినట్లు ఆమె కథనాలు తెలుపుతున్నాయి.

వెలుపలి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  • [1] ఈ లింకులో ఆయా శాస్త్రవేత్తలు స్వయంగా వ్రాసిన వ్యాసాలు ఉన్నాయి. వాటి నుండి వికీపీడియాకు అనుకూలంగా.