హరి గోవిందరావు వర్తక్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

హరి గోవిందరావు వర్తక్ (1914 ఫిబ్రవరి 9 - 1998 అక్టోబరు 7), మహారాష్ట్ర కు చెందిన సామాజిక కార్యకర్త, రాజకీయ నాయకుడు. అతను వసంత్ రావు నాయక్ మంత్రిత్వ శాఖలో క్యాబినెట్ మంత్రిగా పనిచేశాడు. ప్రజారోగ్యం, లవణ భూమి, చేపల వేట శాఖలను నిర్వహించాడు.[1][2][3] అతను మహారాష్ట్ర ప్రభుత్వంలో రెవెన్యూ మంత్రిగా కూడా పనిచేశాడు.[4]

సమాజానికి అతను చేసిన కృషికి గాను భారత ప్రభుత్వం 1991లో నాలుగో అత్యున్నత భారతీయ పౌర పురస్కారం పద్మశ్రీ తో సత్కరించింది.[5]

అతను భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందినవాడు. అతను 1962 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బసిన్ అసెంబ్లీ స్థానం నుండి విజయం సాధించాడు.[6]

మూలాలు

[మార్చు]
  1. "'भाऊसाहेब वर्तक हे महानायक'" (in Marathi). Maharashtra Times. February 14, 2017.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
  2. Year of Freedom. Indian National Congress. 1963. p. 339.
  3. Dr. Dinesh Sewa Rathod. VASANTRAO NAIK: A Pioneer In Politics And The Father Of Agro-Industrial Revolution. p. 83. Mr.Hari Govindrao Vartak (Public health, Salt land and fishing)
  4. "माजी महसूलमंत्री वर्तक यांची जमीन हडपली" (in Marathi). Lokmat. January 30, 2019.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
  5. "1991 - Padma Awards". Padmaawards.gov.in.
  6. "Bassein Maharashtra Assembly Election 1962". Latestly.