హరనాథ్
హరనాథ్ | |
---|---|
జననం | బుద్ధరాజు అప్పల వెంకట రామ హరనాథ్ రాజు 1936 సెప్టెంబరు 2 |
మరణం | 1989 నవంబరు 1 | (వయసు 53)
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1959 - 84 |
పిల్లలు | 2, 1 కుమారుడు : శ్రీనివాస రాజు, 1 కుమార్తె : పద్మజ |
బంధువులు | జి.వి.జి.రాజు (అల్లుడు) |
బుద్ధరాజు అప్పల వెంకట రామ హరనాథ్ రాజు
(సెప్టెంబర్ 2, 1936 - నవంబర్ 1, 1989) తెలుగు సినిమా కథానాయకుడు.
జననం
[మార్చు]ఈయన 1936లో సెప్టెంబర్ 2 న తూర్పుగోదావరి పిఠాపురం మండలం రాపర్తి గ్రామంలో బుద్దరాజు వరహాలరాజు దంపతులకు జన్మించాడు. ఈయనకు 1 కుమారుడు : శ్రీనివాస రాజు, 1 కుమార్తె : పద్మజ ఉన్నారు. తండ్రి అయిన బుద్ధరాజు వరహాలరాజు శ్రీ ఆంధ్ర క్షత్రియ వంశ రత్నాకరము అనే గ్రంథ రచయిత.
కాకినాడ పిఠాపురం రాజా (పి.ఆర్.) కళాశాల లో చదువుకునే రోజుల్లో హరనాథ్ ఇన్స్పెక్టర్ జనరల్ వంటి[1] వంటి అనేక నాటకాల్లో నటించి బహుమతులు అందుకున్నాడు. 60 వ దశకంలో హరనాథ రాజు తెలుగు సినిమాల్లో రొమాంటిక్ ఐకాన్ గా పేరొందాడు. ఈయన తొలి సినిమా అయిన మా ఇంటి మహాలక్ష్మి 1959 లో హైదరాబాద్ సారథీ స్టూడియోస్ లో చిత్రీకరించారు. మా ఇంటి మహాలక్ష్మి సినిమాతో ఎన్టీయార్, ఏఎన్నార్ తరువాత తెలుగులో హరనాథ్ ప్రముఖ హీరో అని అనిపించుకున్నాడు.[2] నందమూరి తారక రామారావు నిర్మించిన సీతారామకళ్యాణం అనే సినిమాలో శ్రీరాముడుగా నటించాడు. 1967 లో నిర్మించిన భీష్మలో శ్రీకృష్ణుడుగా నటించాడు. సుమారు 117 తెలుగు సినిమాలు, 12 తమిళం, 1 హిందీ, 1 కన్నడం సినిమాల్లో నటించాడు. చివరి దశలో మద్యపానానికి అలవాటు పడడంతో కేవలం అతిథి పాత్రలలో నటించే అవకాశాలే వచ్చాయి. హరనాథ్ చివరి సినిమా చిరంజీవి నటించిన, నాగు సినిమా. నాగు సినిమా లో ఆయన తండ్రి పాత్ర పోషించాడు.
మరణం
[మార్చు]ఈయన 1989, నవంబర్ 1 న మరణించాడు.
నటించిన సినిమాలు
[మార్చు]- కలవారి సంసారం (1982)
- గడసరి అత్త సొగసరి కోడలు (1981)
- బాల భారతం (1972)
- భలే పాప (1971)
- కథానాయిక మొల్ల (1970)
- శ్రీదేవి (1970)
- తల్లిదండ్రులు (1970 సినిమా) (1970)
- ప్రేమకానుక (1969)
- చల్లని నీడ (1968)
- నడమంత్రపు సిరి (1968)
- బంగారు సంకెళ్ళు (1968)
- పెళ్ళిరోజు (1968)
- భక్త ప్రహ్లాద (1967)
- చదరంగం (1967)
- శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న (1967)
- లేత మనసులు (1966)
- శ్రీకృష్ణ పాండవీయం (1966)
- చంద్రహాస (1965)
- సర్వర్ సుందరం (1964)
- అమరశిల్పి జక్కన్న (1964)
- మురళీకృష్ణ (1964)
- పెంపుడు కూతురు (1963)
- గుండమ్మ కథ (1962)
- భీష్మ (1962)
- కలసివుంటే కలదుసుఖం
- ఋష్యశృంగ (1961)
- మా ఇంటి మహాలక్ష్మి (1959)
మూలాలు
[మార్చు]- ↑ ఉత్తమ నాటకం ఇన్స్పెక్టర్ జనరల్, (నాటకం-అమరావతీయం), డా. కందిమళ్ళ సాంబశివరావు, ఆంధ్రజ్యోతి, గుంటూరు ఎడిషన్, 7 ఆగస్టు 2017, పుట.14
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-03-03. Retrieved 2009-04-25.