Jump to content

హన్నాథియల్

అక్షాంశ రేఖాంశాలు: 22°58′57″N 92°54′41″E / 22.9826°N 92.9113°E / 22.9826; 92.9113
వికీపీడియా నుండి
హన్నాథియల్
పట్టణం
హన్నాథియల్ is located in Mizoram
హన్నాథియల్
హన్నాథియల్
మిజోరాంలో ప్రాంతం ఉనికి
హన్నాథియల్ is located in India
హన్నాథియల్
హన్నాథియల్
హన్నాథియల్ (India)
Coordinates: 22°58′57″N 92°54′41″E / 22.9826°N 92.9113°E / 22.9826; 92.9113
దేశం భారతదేశం
రాష్ట్రంమిజోరాం
జిల్లాహన్నాథియల్
ఏర్పాటు3 జూన్, 2019
జనాభా
 (2011)
 • Total7,187
భాషలు
 • అధికారికమిజో
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
Vehicle registrationఎంజెడ్ 02

హన్నాథియల్, మిజోరాం రాష్ట్రంలోని హన్నాథియల్ జిల్లా ముఖ్య పట్టణం. హన్నాథియల్ అనేది మిజో పదం. ఇక్కడ ఫ్రీనియం కాపిటటం పుష్కలంగా పెరుగుతుంది. ఇది 2019, జూన్ 3న జిల్లా ముఖ్యపట్టణంగా మార్చబడింది.[1]

జనాభా

[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, హన్నాథియల్ పట్టణంలో 7,187 జనాభా ఉంది. ఇందులో 3,573 మంది పురుషులు, 3,614 మంది మహిళలు ఉన్నారు. పట్టణ సగటు అక్షరాస్యత 97.24% కాగా, రాష్ట్ర సగటు 91.33% కంటే ఎక్కువగా ఉంది. ఇందులో పురుష అక్షరాస్యత 97.94% కాగా, స్త్రీల అక్షరాస్యత 96.55% గా ఉంది. మొత్తం జనాభాలో 13.18% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు.[2]

రవాణా

[మార్చు]

ఇక్కడ పవన్ హన్స్[3] (హెలికాప్టర్ సర్వీస్ సంస్థ) ఆధ్వర్యంలో హెలికాప్టర్ సేవలు ప్రారంభించబడ్డాయి. 54వ జాతీయ రహదారి ద్వారా హన్నాథియల్ పట్టణం, ఐజ్‌వాల్ నగరంతో కలుపబడుతోంది. హన్నాథియల్, ఐజ్‌వాల్ మధ్య 172 కి.మీ.ల దూరం ఉంది. వీటి మధ్య బస్సు, మాక్సి క్యాబ్ లతో రవాణా సౌకర్యం ఉంది.[4]

విద్య

[మార్చు]

ఈ పట్టణంలో మిజోరాం విశ్వవిద్యాలయం పరిధిలోని ఒకేఒక హన్నాతియల్ కళాశాల ఉంది. ఇక్కడ ఒక ప్రభుత్వ ఉన్నత మాధ్యమిక పాఠశాల, రెండు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, మూడు మాధ్యమిక పాఠశాలలు, ఏడు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు, ఏడు ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి.

సమీప ప్రాంతాలు

[మార్చు]
  • పెనియల్ వెంగ్
  • మోడల్ వెంగ్ (ఐతుర్ వెంగ్)
  • చన్మారి వెంగ్ (చాంగ్టుయ్ వెంగ్)
  • లంగ్లెంగ్ వెంగ్
  • వెంగ్లై (టార్ఫో వెంగ్)
  • బజార్ వెంగ్
  • కనన్ వెంగ్
  • ఎలక్ట్రిక్ వెంగ్

మీడియా

[మార్చు]

హన్నాథియల్ పట్టణంలో హుయిహ్చుక్, రల్లాంగ్ వీక్లీ, హన్నాథియల్ టుడే, హన్నాథియల్ టైమ్స్, కలాథియా అనే ప్రధాన వార్తాపత్రికలు ఉన్నాయి.[5] ఎల్‌డి కేబుల్ నెట్‌వర్క్, విఎల్ విజన్ అనే రెండు కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్‌లు ఉన్నాయి.

మూలాలు

[మార్చు]
  1. "Hnahthial". mizoram.gov.in. Archived from the original on 21 సెప్టెంబరు 2020. Retrieved 27 December 2020.
  2. "Villages & Towns in Hnahthial Block of Lunglei, Mizoram". www.census2011.co.in. Retrieved 27 December 2020.
  3. "Mizorama Helicopter Service Tur Chief Minister in Hawng". Mizoram DIPR. Archived from the original on 12 December 2013. Retrieved 27 December 2020.
  4. "Aizawl to Siaha". Mizoram NIC. Retrieved 27 December 2020.
  5. "Accredited Journalists". DIPR Mizoram. Archived from the original on 19 June 2013. Retrieved 27 December 2020.

వెలుపలి లంకెలు

[మార్చు]