మమిట్
మమిట్ | |
---|---|
పట్టణం | |
Coordinates: 23°56′N 92°29′E / 23.93°N 92.48°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మిజోరాం |
జిల్లా | మమిట్ |
Elevation | 718 మీ (2,356 అ.) |
జనాభా (2001) | |
• Total | 5,261 |
భాషలు | |
• అధికారిక | మిజో |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
Vehicle registration | ఎంజెడ్ |
మమిట్, మిజోరాం రాష్ట్రంలోని మమిట్ జిల్లా ముఖ్య పట్టణం, జిల్లా ప్రధాన కార్యాలయం. గ్రామాల పునర్వ్యవస్థీకరణ ద్వారా మమిట్ పట్టణం ఏర్పడింది.
భౌగోళికం
[మార్చు]మమిట్ పట్టణం 23°56′N 92°29′E / 23.93°N 92.48°E అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది.[1] సముద్రమట్టానికి 718 మీటర్లు (2,355 అడుగులు) ఎత్తులో ఉంది.
జనాభా
[మార్చు]2011 భారత జనాభా లెక్కల ప్రకారం,[2] మమిట్ పట్టణంలో 7,884 మంది జనాభా ఉన్నారు. ఇందులో 4,074 మంది పురుషులు, 3,810 మంది స్త్రీలు ఉన్నారు. మమిట్ సగటు అక్షరాస్యత 95.40% కాగా, జాతీయ సగటు 74.04% కంటే ఎక్కువగా ఉంది. ఇందులో పురుషుల అక్షరాస్యత 95.86% కాగా, స్త్రీల అక్షరాస్యత 94.92%గా ఉంది. ఈ పట్టణ జనాభాలో 15% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు.
విద్య
[మార్చు]ఇక్కడ మిజోరాం విశ్వవిద్యాలయం పరిధిలోని మమిట్ కళాశాల, అనేక ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి.
రవాణా
[మార్చు]మమిట్ పట్టణానికి, ఐజాల్ నగరానికి మధ్య 89 కి.మీ.ల దూరం ఉంది. వీటి మధ్య బస్సు, మాక్సిక్యాబ్ లతో రవాణా సౌకర్యం ఉంది.
మీడియా
[మార్చు]మమిట్ పట్టణంలో మమిట్ టైమ్స్ అనే ప్రధాన వార్తాపత్రిక ఉంది.[3]
మూలాలు
[మార్చు]- ↑ Falling Rain Genomics, Inc - Mamit
- ↑ "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 16 June 2004. Retrieved 29 December 2020.
- ↑ "Accredited Journalists". DIPR Mizoram. Archived from the original on 19 జూన్ 2013. Retrieved 29 డిసెంబరు 2020.