స్వర్ణ సుధాకర్ రెడ్డి
స్వర్ణ సుధాకర్ రెడ్డి | |||
| |||
మహబూబ్‌నగర్ జిల్లా పరిషత్ ఛైర్మన్
| |||
పదవీ కాలం 5 జులై 2019 నుండి ప్రస్తుతం | |||
నియోజకవర్గం | దేవరకద్ర నియోజకవర్గం | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 25 జూన్ 1952 గొల్లల మామిడాడ , పెదపూడి మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | తెలంగాణ రాష్ట్ర సమితి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ | ||
జీవిత భాగస్వామి | సల్గుటి సుధాకర్ రెడ్డి | ||
నివాసం | కన్మనూర్ గ్రామం, నర్వ మండలం, మహబూబ్‌నగర్ జిల్లా |
సల్గుటి స్వర్ణ సుధాకర్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే . ఆమె ప్రస్తుతం మహబూబ్‌నగర్ జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా ఉంది.
జననం, విద్యాభాస్యం
[మార్చు]స్వర్ణలత 1952 జూన్ 25లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పు గోదావరి జిల్లా, పెదపూడి మండలం, గొల్లల మామిడాడ గ్రామంలో జన్మించింది. ఆమె 1వ నుండి 9వ తరగతి వరకు షేడ్ గర్ల్స్ హై స్కూల్ రాజమండ్రిలో, పదవ తరగతి శ్రీకాకుళం ప్రభుత్వ పాఠశాలలో పూర్తి చేసి, గుంటూరు లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బిఎ పూర్తి చేసింది. స్వర్ణలత మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన సల్గుటి సుధాకర్ రెడ్డితో వివాహం జరిగింది.
రాజకీయ జీవితం
[మార్చు]స్వర్ణ సుధాకర్ రెడ్డి 2004లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అమరచింత నియోజకవర్గం, ప్రస్తుతం ( దేవరకద్ర నియోజకవర్గం) నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొత్తకోట దయాకర్ రెడ్డి పై 13783 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికైంది.[1] ఆమె 2009లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా కొత్తగా ఏర్పాటైన దేవరకద్ర నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొత్తకోట సీత దయాకర్ రెడ్డి చేతిలో 19036 ఓట్ల తేడాతో ఓటమి పాలయింది.[2]
స్వర్ణ సుధాకర్ రెడ్డి 2012లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఆమె 2018లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరి 2019లో జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో భూత్పూర్ జెడ్పీటీసీగా గెలిచి మహబూబ్‌నగర్ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా నియమితురాలైంది.[3][4][5]
ఆమె 2024 మార్చి 20న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరింది.[6]
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (29 October 2023). "శాసన సభలో అతివల కేతనం". Archived from the original on 29 October 2023. Retrieved 29 October 2023.
- ↑ EENADU (9 November 2023). "అతివలకు అవకాశం తక్కువే". Archived from the original on 9 November 2023. Retrieved 9 November 2023.
- ↑ Sakshi (8 June 2019). "తెలంగాణలో ఎన్నికైన జెడ్పీ చైర్మన్లు వీరే". Archived from the original on 31 జూలై 2021. Retrieved 31 July 2021.
- ↑ The Hans India (10 June 2019). "ZP chairpersons meet KTR" (in ఇంగ్లీష్). Archived from the original on 31 జూలై 2021. Retrieved 31 July 2021.
- ↑ Andrajyothy (21 December 2020). "నేడు జిల్లా పరిషత్ సమావేశం". Archived from the original on 31 జూలై 2021. Retrieved 31 July 2021.
- ↑ Eenadu (20 March 2024). "కాంగ్రెస్‌లో చేరిన మహబూబ్‌నగర్ జడ్పీ ఛైర్‌పర్సన్". Archived from the original on 20 March 2024. Retrieved 20 March 2024.