స్టీవ్ జాబ్స్
స్టీవ్ జాబ్స్ | |
---|---|
జననం | స్టీవెన్ పాల్ జాబ్స్ 1955 ఫిబ్రవరి 24 శాన్ ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియా, అమెరికా సంయుక్త రాష్ట్రాలు |
మరణం | 2011 అక్టోబరు 5 పాలో ఆల్టో, కాలిఫోర్నియా,అమెరికా సంయుక్త రాష్ట్రాలు | (వయసు 56)
మరణ కారణం | క్లోమ కేన్సర్ |
సమాధి స్థలం | ఆల్ట మేస మెమోరియల్ పార్క్ |
వృత్తి |
|
సుపరిచితుడు/ సుపరిచితురాలు |
|
బోర్డు సభ్యులు | |
జీవిత భాగస్వామి | |
భాగస్వామి | క్రిసాన్ బ్రెన్నన్ (1972–1977) |
పిల్లలు | 4, లీసా బ్రెన్నన్-జాబ్స్తో |
బంధువులు | మోనా సింప్సన్ (చెల్లి) |
స్టీవెన్ పాల్ "స్టీవ్" జాబ్స్ (1955 ఫిబ్రవరి 24 - 2011 అక్టోబరు 5) అమెరికన్ ఐటీ వ్యాపారవేత్త, ఆవిష్కర్త. ఆయన ఆపిల్ సంస్థ సహ-వ్యవస్థాపకుడు, మాజీ ఛైర్మన్, సీఈవో. పిక్సర్ యానిమేషన్ స్టూడియోస్ సీఈవో, ప్రధాన వాటాదారు;[2] వాల్ట్ డిస్నీ కంపెనీ పిక్సర్ కంపెనీను కొన్నాకా దాని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో సభ్యుడు. నెక్స్‌ట్ సంస్థ సంస్థాపకుడు, ఛైర్మన్, సీఈవో. 1970లు, 80ల నాటి మైక్రోకంప్యూటర్ విప్లవంలో మార్గదర్శిగా యాపిల్ సహ-వ్యవస్థాపకుడు స్టీవ్ వోజ్నియాక్ తో పాటు పనిచేశాడు. ఆయన మరణానంతరం కొద్ది రోజులకు వెలువడ్డ సాధికారిక జీవిత చరిత్రలో వాల్టర్ ఇసాక్సన్ జాబ్స్ ను "విపరీతమైన చోదక శక్తి, పరిపూర్ణత పట్ల తీవ్రమైన కోరికలతో పర్సనల్ కంప్యూటర్స్, యానిమేషన్ సినిమాలు, సంగీతం, ఫోన్లు, టాబ్లెట్ కంప్యూటింగ్, డిజిటల్ ప్రచురణలు అన్న ఆరు పరిశ్రమల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చిన సృజనాత్మక వ్యాపారవేత్త"గా అభివర్ణించాడు.[3]
జాబ్స్ లోని విరుద్ధ సంస్కృతీ జీవన విధానం, తాత్త్వికతకు ప్రధాన కారణం అతను పెరిగిన స్థలకాలాలు. శాన్ ఫ్రాన్సిస్కోలో జన్మించిన జాబ్స్ దత్తత అయి, 1960ల్లో విరుద్ధ సంస్కృతికి కేంద్రంగా నిలిచిన శాన్ ఫ్రాన్సిస్కోలో పెరిగారు.[4] కాలిఫోర్నియాలోని క్యూపెర్టినో ప్రాంతపు హోంస్టెడ్ హైస్కూల్లో ఉన్నప్పుడు ఇంజనీరింగ్ విద్యార్థి, హోంస్టెడ్ హైస్కూలు పూర్వ విద్యార్థి వోజ్నియాక్, అతని గర్ల్ ఫ్రెండ్, విరుద్ధ సంస్కృతికి ఆకర్షితురాలైన, కళారంగం పట్ల మక్కువ కల హోంస్టెడ్ విద్యార్థిని క్రిసాన్ బ్రెనాన్ ఆయనకు చాలా సన్నిహిత మిత్రబృందంగా ఉండేవారు.[5] జాబ్స్, వోజ్నియాక్ ఇద్దరూ పాప్ సంగీత దిగ్గజం బాబ్ డైలాన్ పాటలకు అభిమానులు, ఈ బంధంతో వారు ఆయన సాహిత్యం గురించి చర్చించుకోవడం, డైలాన్ సంగీత ప్రదర్శనల బూట్ లెగ్ రీల్-టు-రీల్ టేపులు సేకరించడం వంటి ఆసక్తులు పంచుకునేవారు.[6] మునుపు డైలాన్ తో వైవాహిక సంబంధంలో ఉండి ప్రఖ్యాతురాలైన సంగీతకారిణి జోన్ బేజ్ తో తర్వాతికాలంలో జాబ్స్ డేటింగ్ చేశారు.[6] జాబ్స్ కొద్దికాలం పాటు 1972లో రీడ్స్ కళాశాలలో చేరి చదివి, కాలేజీ వదిలేశారు.[5] 1974లో జ్ఞానోదయాన్ని ఆశించి, జెన్ బౌద్ధాన్ని అధ్యయనం చేసేందుకు భారతదేశానికి ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నాడు.[7] జాబ్స్ గురించి ఎఫ్.బి.ఐ. రిపోర్టులో ఒక పరిచయస్తుడు చెప్పినదాని ప్రకారం కళాశాలలో ఉన్నప్పుడు చట్టవిరుద్ధమైన డ్రగ్స్ అయిన మారిజునా, ఎల్.ఎస్.డి. వంటివి వినియోగించేవారని నివేదించింది.[8] మరో సందర్భంలో ఒక విలేకరితో జాబ్స్ ఎల్.ఎస్.డి. తీసుకోవడం తన జీవితంలో చేసిన మూడు అత్యంత ప్రాధాన్యత కలిగిన పనుల్లో ఒకటి అని చెప్పారు.[9]
వోజ్నియాక్ తయారుచేసిన యాపిల్ I కంప్యూటర్ అమ్మేందుకు 1976లో జాబ్స్, వోజ్నియాక్ తో కలిసి యాపిల్ కంపెనీని సంస్థాపించారు. అత్యంత విజయవంతమైన భారీగా ఉత్పాదితమై విడుదలైన కంప్యూటర్లలో ఒకటైన యాపిల్ II తర్వాతి సంవత్సరంలో విడుదల అయ్యాకా ఈ జంటకు పేరు ప్రతిష్ఠలు, విపరీతమైన సంపద ఒనగూడాయి. 1979లో జిరాక్స్ పార్క్ ను సందర్శించినప్పుడు గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేరస్ కలిగిన, మౌస్ ద్వారా నడిచే జిరాక్స్ ఆల్టో యొక్క వాణిజ్య సామర్థ్యాన్ని గుర్తించారు. దీని ఫలితంగా 1983లో విజయవంతం కాని యాపిల్ లీసా, ఆపైన 1984లో అత్యంత విజయవంతమైన మెకింతోష్ అభివృద్ధి జరిగాయి. గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ కలిగిన తొలి భారీగా ఉత్పత్తి అయిన కంప్యూటర్ మెకింతోష్ తో కలిసి వెక్టర్ గ్రాఫిక్స్ తయారుచేయగల తొలి లేజర్ ప్రింటర్ - యాపిల్ లేజర్ రైటర్ 1985లో హఠాత్తుగా డెస్క్ టాప్ పబ్లిషింగ్ (డీటీపీ) పరిశ్రమ విపరీతమైన వృద్ధికి కారణమైంది. అధికారం కోసం సాగిన సుదీర్ఘ సంకుల సమరాల తర్వాత 1985లో యాపిల్ నుంచి జాబ్స్ ను బయటకు పంపేశారు.[10]
యాపిల్ ను విడిచిపెట్టాకా, యాపిల్ లో కొందరు సహచరులతో కలిసి నెక్స్‌ట్ స్థాపించాడు. ఉన్నత విద్య, వ్యాపార మార్కెట్ల కోసం ప్రత్యేకించిన కంప్యూటర్లు తయారుచేసే కంప్యూటర్ ప్లాట్ ఫాం కంపెనీగా నెక్స్‌ట్ ప్రారంభించాడు. 1986లో జార్జ్ లూకాస్ కంపెనీ లూకాస్ ఫిల్మ్ యొక్క కంప్యూటర్ గ్రాఫిక్స్ విభాగాన్ని అభివృద్ధి చేయడానికి పెట్టుబడి పెట్టడంతో ప్రారంభించి విజువల్ ఎఫెక్ట్స్ పరిశ్రమలో వినూత్నమైన ఆవిష్కరణలకు చేయూతను ఇచ్చారు.[11] కొత్తగా వారంతా ప్రారంభించిన పిక్సర్ కంపెనీ మొట్టమొదటి పూర్తి కంప్యూటర్ యానిమేటెడ్ సినిమా అయిన టాయ్ స్టోరీని నిర్మించింది - జాబ్స్ ఆర్థిక సహకారం, ప్రోత్సాహం వల్ల సాధ్యమైంది.
1997లో యాపిల్ తీవ్ర సంక్షోభంలో ఉండగా స్టీవ్ జాబ్స్ సహకారం కోరి నెక్స్‌ట్ కంప్యూటర్స్ ను కొనుగోలు చేసింది. తొలుత సలహాదారుగానే ఉన్న జాబ్స్ క్రమంగా యాపిల్ సీఈవో అయ్యారు. దివాలా ప్రమాదానికి అంచుల్లో ఉన్న కంపెనీని తిరిగి లాభాల బాటలోకి తీసుకువచ్చాడు. 1996లో ప్రఖ్యాత థింక్ డిఫరెంట్ ప్రచారం ప్రారంభించాకా డిజైనర్ జాన్ ఐవ్ తో కలిసి పనిచేసి తర్వాతికాలంలో సాంస్కృతికంగా అల్లుకుపోయిన ఐమేక్, ఐట్యూన్స్, యాపిల్ స్టోర్స్, ఐపోడ్, ఐట్యూన్స్ స్టోర్, ఐఫోన్, యాప్ స్టోర్స్, ఐపాడ్ వంటి ఉత్పత్తులను వరుసగా రూపొందించారు. నెక్స్‌ట్ యొక్క నెక్స్‌ట్ స్టెప్ ప్లాట్ ఫారం ఆధారంగా మ్యాక్ ఆపరేటింగ్ సిస్టం కూడా మ్యాక్ ఓయస్ టెన్ గా పునర్నిర్మించారు.
క్లోమానికి కేన్సర్ ఉన్నట్టుగా 2003లో నిర్థారితం కాగా, ట్యూమర్ కారణంగా ఊపిరి నిలిచిపోయి 2011 అక్టోబరు 5న మరణించారు.
నేపథ్యం
[మార్చు]తల్లిదండ్రులు
[మార్చు]జాబ్స్ దత్తత తండ్రి పాల్ రీన్ హోల్డ్ జాబ్స్ (1922-1993) కాల్వినిస్ట్ కుటుంబంలో పెరిగారు, [12] పాల్ జాబ్స్ తండ్రి మద్యానికి బానిస.[3] కుటుంబం జెర్మాన్ టౌన్, విస్కాన్సిన్ లోని ఓ వ్యవసాయ క్షేత్రంలో జీవించేవారు.[3][12] పాల్ చిన్నతనంలో స్కూల్ నుంచి బయటకు వచ్చేశారు, విస్తారంగా ప్రయాణాలు చేశారు. మరీ ముఖ్యంగా 1930ల్లో పనికోసం మధ్య ప్రాచ్యంలో తిరుగాడారు.[3][12] ఇంజన్ రూం మెకానిక్ గా యునైటెడ్ స్టేట్ కోస్ట్ గార్డ్స్ లో చేరారు.[12] రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత కోస్ట్ గార్డ్ శాన్ ఫ్రాన్సిస్కోలో లంగరు వేసినప్పుడు ఇక కోస్ట్ గార్డ్లో ఉద్యాగాన్ని వదిలివేయడానికి నిర్ణయించుకున్నారు.[12] శాన్ ఫ్రాన్సిస్కోలో తాను ఎవరో ఒకరిని పెళ్ళి చేసుకోగలనని పందెం వేసి, క్లారా హాగోపియాన్ (1924-1986) తో బ్లైండ్ డేట్ కి వెళ్ళి పదిరోజులు తిరగకుండా నిశ్చితార్థం చేసుకుని 1946లో వివాహం చేసుకున్నారు.[3] ఆర్మేనియా నుంచి వలసవచ్చిన వారి కుమార్తె క్లారా శాన్ ఫ్రాన్సిస్కోలో పెరిగారు, అంతకుముందే వివాహం అయింది. రెండవ ప్రపంచ యుద్ధంలో భర్త చనిపోగా పాల్ ను పెళ్ళి చేసుకున్నారు. ఎన్నో ప్రయత్నాల తర్వాత శాన్ ఫ్రాన్సిస్కోలోని సన్ సెట్ డిస్ట్రిక్ట్ లో స్థిరపడ్డారు.[3] ప్రవృత్తిగా కారులను పునురుద్ధరించేపనిచేపట్టినా, వాయిదా కట్టని వాహనాలుతిరిగే పొందే వృత్తిలో ఉన్నాడు. ఈ వృత్తి అతని దృఢమైన, దూకుడు వ్యక్తిత్వానికి సరిపోయేది."[12] ఇలావుండగా వారు కుటుంబాన్ని ప్రారంభించే ప్రయత్నాలు, క్లారాకు ఎక్టోపిక్ గర్భత్వంతో ఆగిపోయాయి. దానివలన దత్తతకోసం ప్రయత్నాలు చేశారు.[3]
References
[మార్చు]- ↑ "The Walt Disney Company and Affiliated Companies - Board of Directors". 2009-10-14. Archived from the original on 2012-04-21. Retrieved 2018-09-18.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ D'Onfro, Jillian (March 22, 2015).
- ↑ 3.0 3.1 3.2 3.3 3.4 3.5 3.6 Isaacson, Walter (2011).
- ↑ Foremski, Tom.
- ↑ 5.0 5.1 "The Steve Jobs Nobody Knew".
- ↑ 6.0 6.1 "New Steve Jobs Bio Reveals Details of His Relationships With Bob Dylan, Bono"[permanent dead link].
- ↑ "Here's How Zen Meditation Changed Steve Jobs' Life And Sparked A Design Revolution".
- ↑ Tsukayama, Hayley (2012-02-09).
- ↑ Palmer, Brian (2011-10-06).
- ↑ Swaine, Michael and Paul Frieberger.
- ↑ Smith, Alvy Ray.
- ↑ 12.0 12.1 12.2 12.3 12.4 12.5 Young, Jeffrey S. (1987).