సొంతం
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
సొంతం | |
---|---|
దర్శకత్వం | శ్రీను వైట్ల |
రచన | కోన వెంకట్ |
నిర్మాత | ఎస్. సోంపల్లి వి. ఆర్. కన్నెగంటి |
తారాగణం | ఆర్యన్ రాజేష్ సునీల్ నమిత రోహిత్ ఎమ్మెస్ నారాయణ |
సంగీతం | దేవి శ్రీ ప్రసాద్ |
నిర్మాణ సంస్థ | జె. డి. ఆర్ట్స్ |
విడుదల తేదీ | 23 ఆగస్టు 2002 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
సొంతం 2002 లో శ్రీను వైట్ల దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఆర్యన్ రాజేష్, నమిత ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు.[1]
కథ
[మార్చు]వంశీ (ఆర్యన్ రాజేష్), నందు (నమిత), బోస్ (రోహిత్) ముగ్గురూ చిన్ననాటి స్నేహితులు. వీరిలో వంశీ, నందు బాగా దగ్గరిగా మసలుకుంటూ ఉంటారు. బోస్ నేహ అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. అదే విషయం బోసు వంశీతో చెబితే వారి ప్రేమ గెలవదనీ చాలా ప్రేమ కథల్లాగే అది కూడా విఫలమవుతుందనీ కొట్టి పడేస్తాడు. అంతే కాకుండా ప్రేమ కంటే స్నేహం గొప్పదనీ, ప్రేమ వల్ల స్నేహం చెడిపోతుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తాడు. ఆ విషయం తెలుసుకున్న నందు తనకు వంశీ మీద ప్రేమ ఉన్నా అతనికి చెబితే తమ స్నేహం చెడిపోతుందని తన మనసులోనే దాచుకుంటుంది.
ఒకసారి వంశీ తన తండ్రి వ్యాపార వ్యవహారాలు చక్కబెట్టడానికి న్యూజీలాండ్ వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ అతనికి పదే పదే నందూ గుర్తుకు రావడంతో తనకు కూడా నందు మీద ప్రేమ ఉందని గుర్తిస్తాడు. కానీ తను తిరిగివచ్చేసరికి నందుకు వేరే అబ్బాయితో నిశ్చితార్థం జరిగిపోయి ఉంటుంది. చివరికి వారిద్దరూ కలుసుకున్నారన్నదే మిగతా కథ.
తారాగణం
[మార్చు]- ఆర్యన్ రాజేష్
- నమిత
- సునీల్
- రోహిత్
- ఎమ్మెస్ నారాయణ
- చిత్రం శ్రీను
- నేహా పెండ్సే బయాస్
- ఝాన్సీ
- తనికెళ్ళ భరణి
- ఆలీ
- వేణుమాధవ్
- చిన్నా
- ధర్మవరపు సుబ్రహ్మణ్యం
- ఆషా సైని
- నరేష్[2]
- రజిత
- తెలంగాణ శకుంతల
పాటల జాబితా
[మార్చు]సొంతం, రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం.టిప్పు.
తెలుసునా, రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం.కె ఎస్ చిత్ర
ఎప్పుడో , రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం.మల్లిఖార్జున్
ఏనాటి వరకు , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం.షాన్ , సుమంగళి
అక్కడో , ఇక్కడో, రచన: రవికిరణ్, గానం.మాల్గుడి శుభ
నాయుడో నాయుడో, రచన: కులశేఖర్ , గానం.దేవీశ్రీ ప్రసాద్
ఎప్పుడో(ఫిమేల్ వాయిస్) రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం.సుమంగళి
మ్యూజిక్ బిట్ , ఇన్స్ట్రుమెంటల్.
మూలాలు
[మార్చు]- ↑ జీ. వి. "సొంతం సినిమా సమీక్ష". idlebrain.com. జీ. వి. రమణ. Retrieved 12 October 2016.
- ↑ ఆంధ్రప్రభ, సినిమా (22 April 2018). "అందుకే క్యారెక్టర్ ఆర్టిస్టునయ్యా – నరేష్ – Andhra Prabha Telugu Daily". రమేష్ గోపిశెట్టి. Archived from the original on 19 జూలై 2020. Retrieved 19 July 2020.
- విస్తరించవలసిన వ్యాసాలు
- క్లుప్త వివరణ ఉన్న articles
- 2002 సినిమాలు
- తెలుగు ప్రేమకథా సినిమాలు
- శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన సినిమాలు
- సునీల్ నటించిన సినిమాలు
- ఎం.ఎస్.నారాయణ నటించిన సినిమాలు
- తనికెళ్ళ భరణి సినిమాలు
- ఆలీ నటించిన సినిమాలు
- వేణుమాధవ్ నటించిన సినిమాలు
- ధర్మవరపు సుబ్రహ్మణ్యం నటించిన సినిమాలు
- దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన సినిమాలు