సెనూరన్ ముత్తుసామి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సెనూరన్ ముత్తుసామి
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
సెనూరన్ ముత్తుసామి
పుట్టిన తేదీ (1994-02-22) 1994 ఫిబ్రవరి 22 (వయసు 30)
డర్బన్, నాటల్ ప్రావిన్స్, దక్షిణాఫ్రికా
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుSlow left-arm orthodox
పాత్రఆల్ రౌండరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 337)2019 అక్టోబరు 2 - ఇండియా తో
చివరి టెస్టు2023 ఫిబ్రవరి 28 - వెస్టిండీస్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు ఫక్లా లిఎ T20
మ్యాచ్‌లు 3 98 79 57
చేసిన పరుగులు 105 4,539 1,887 908
బ్యాటింగు సగటు 26.25 30.87 31.45 23.89
100లు/50లు 0/0 8/26 1/13 0/5
అత్యుత్తమ స్కోరు 49* 181 100 62*
వేసిన బంతులు 273 11,973 2,961 822
వికెట్లు 2 216 81 46
బౌలింగు సగటు 95.00 27.80 29.64 18.52
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 10 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 2 0 0
అత్యుత్తమ బౌలింగు 1/63 7/36 4/36 4/12
క్యాచ్‌లు/స్టంపింగులు 3/– 53/– 18/– 20/–
మూలం: Cricinfo, 18 March 2023

సెనూరన్ ముత్తుసామి (జననం 1994 ఫిబ్రవరి 22) దక్షిణాఫ్రికా క్రికెట్ ఆటగాడు. అతను 2019 అక్టోబరులో దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు కోసం అంతర్జాతీయ రంగప్రవేశం చేసాడు.[1] ముత్తుసామి పూర్వీకులు తమిళనాడు లోని నాగపట్నంకు చెందినవారు. [2]

దేశీయ కెరీర్

[మార్చు]

ముత్తుసామిని 2015 ఆఫ్రికా T20 కప్ కోసం క్వాజులు-నాటల్ క్రికెట్ జట్టులోకి తీసుకున్నారు. [3] 2017 ఆగస్టులో అతను, T20 గ్లోబల్ లీగ్ మొదటి సీజన్ కోసం కేప్ టౌన్ నైట్ రైడర్స్ జట్టుకు ఎంపికయ్యాడు. [4] అయితే, 2017 అక్టోబరులో, క్రికెట్ దక్షిణాఫ్రికా మొదట్లో టోర్నమెంట్‌ను నవంబరు 2018కి వాయిదా వేసి, ఆ తర్వాత వెంటనే రద్దు చేసింది.[5]

2018 సెప్టెంబరులో అతను, 2018 ఆఫ్రికా T20 కప్ కోసం క్వాజులు-నాటల్ జట్టులో ఎంపికయ్యాడు. [6] 2021 ఏప్రిల్లో, దక్షిణాఫ్రికాలో 2021–22 క్రికెట్ సీజన్‌కు ముందు, అతను నార్త్ వెస్టు జట్టుకు ఎంపికయ్యాడు. [7]

2022 మార్చిలో, 2021–22 CSA వన్-డే కప్ టోర్నమెంట్ ప్రారంభ రోజున, వెస్ట్రన్ ప్రావిన్స్‌పై 106 బంతుల్లో 100 పరుగులతో లిస్టు A క్రికెట్‌లో ముత్తుసామి తన మొదటి సెంచరీని సాధించాడు.[8]

అంతర్జాతీయ కెరీర్

[మార్చు]

2019 ఆగస్టులో అతను, భారతదేశంతో జరిగే సిరీస్ కోసం దక్షిణాఫ్రికా టెస్టు జట్టుకు ఎంపికయ్యాడు.[9] అతను 2019 అక్టోబరు 2న భారతదేశానికి వ్యతిరేకంగా దక్షిణాఫ్రికా తరపున తన తొలి టెస్టు ఆడాడు.[10] ఈ మ్యాచ్‌లో అతను భారత కెప్టెన్ విరాట్ కోహ్లీని 20 పరుగుల వద్ద కాట్ అండ్ బౌల్డ్‌గా అవుట్ చేసి, తన మొదటి టెస్టు మ్యాచ్ వికెట్ తీసుకున్నాడు. [11]

మూలాలు

[మార్చు]
  1. "Senuran Muthusamy". ESPN Cricinfo. Retrieved 6 September 2015.
  2. "'Firmly South African' Senuran Muthusamy savours 'special' Test bow". ESPN Cricinfo. 2 October 2019. Retrieved 2 October 2019.
  3. KwaZulu-Natal Squad / Players – ESPNcricinfo. Retrieved 31 August 2015.
  4. "T20 Global League announces final team squads". T20 Global League. Archived from the original on 5 సెప్టెంబరు 2017. Retrieved 28 August 2017.
  5. "Cricket South Africa postpones Global T20 league". ESPN Cricinfo. 10 October 2017. Retrieved 10 October 2017.
  6. "KwaZulu-Natal Squad". ESPN Cricinfo. Retrieved 12 September 2018.
  7. "CSA reveals Division One squads for 2021/22". Cricket South Africa. Archived from the original on 20 ఏప్రిల్ 2021. Retrieved 20 April 2021.
  8. "Dragons beat Province by 17 runs in thriller". SuperSport. Retrieved 12 March 2022.
  9. "Nortje, Second and Muthusamy part of South Africa squads to India". ESPN Cricinfo. 13 August 2019. Retrieved 13 August 2019.
  10. "1st Test, ICC World Test Championship at Visakhapatnam, Oct 2-6 2019". ESPN Cricinfo. Retrieved 2 October 2019.
  11. "Senuran Muthusamy - Know The Bowler Who Took Virat Kohli As His Debut Test Wicket". News Nation. Retrieved 3 October 2019.