సూరంపాలెం (చాట్రాయి)
ఈ వ్యాసాన్ని తాజాకరించాలి. |
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (ఏప్రిల్ 2017) |
సూరంపాలెం, కృష్ణా జిల్లా చాట్రాయి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
సూరంపాలెం | |
— రెవిన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 17°01′25″N 80°48′08″E / 17.023597°N 80.802119°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కృష్ణా |
మండలం | చాట్రాయి |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 521 214 |
ఎస్.టి.డి కోడ్ | 08598 |
గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం
[మార్చు]సూరమ్మ చెరువు
[మార్చు]గ్రామములోని ఈ చెరువులో, ప్రభుత్వం ప్రవేశపీట్టిన నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా, పూడికతీత పనులను 2017,ఏప్రిల్-10న ప్రారంభించారు. పూడికమట్టిని రైతులు తమ పొలాలలకు ఎరువుగా తరలించుచున్నారు. ఇళ్ళలో మెరక చేయుటకుగూడా తీసికొనిపోవుచున్నారు. ఈ విధంగా చేయుట వలన, చెరువులో నీటి నిలువ సామర్ధ్యం పెరుగుటయేగాక, తమ పొలాలలో ఎరువుల ఖర్చు గణనీయంగా తగ్గుతుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
గ్రామములో దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు
[మార్చు]శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం
[మార్చు]ఈ ఆలయంలో 2015,ఫిబ్రవరి-23వ తేదీ, సోమవారం ఉదయం 10-22 గంటలకు, ఆంజనేయస్వామివారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం వైభవంగా నిర్వహించారు. అనంతరం యజ్ఞశాలలో శాంతిపూజలు నిర్వహించారు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలో సువర్చలాదేవి, ఆంజనేయస్వామివారల శాంతికళ్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలు గ్రామాలనుండి భక్తులు విచ్చేసారు. ఆడబడుచులకు పసుపు,కుంకుమలు ఇవ్వడానికి ఏర్పాటుచేయడంతో గ్రామంలో సందడి నెలకొన్నది. వేలాదిమంది భక్తులు తరలి రావడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొన్నది.
ఈ ఆలయంలో ప్రతిష్ఠ ఉత్సవాలను 2017,ఫిబ్రవరి-23వతేదీ గురువారంనాడు నిర్వహించెదరు. ఉదయం హనుమాన్ చాలీసాతో ప్రారంభించెదరు. మద్యాహ్నం భక్తులకు అన్న ప్రసాద వితరణ నిర్వహించెదరు.