ఎరువు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పెరుగుతున్న జనాభా అవసరాలకు తీర్చి ఆహారోత్పత్తిని పెంచడానికి వ్యవసాయం (Agriculture) లో ఎరువులు (Fertilizers) విస్తృతంగా ఉపయోగంలో ఉన్నాయి.

ఎరువులు చేనుకి, మొక్కలకి పోషకాలు అందించుటకు, భూసారము పెంచుటకు ఉపయోగబడతాయి. ఎరువులు వాడటం ముఖ్యం.

రకాలు

[మార్చు]
రైతులు పశువుల ఎరువును పొలంలో వెదజల్లుట, దామల చెరువులో తీసిన చిత్రం

ఎరువులలో రసాయన ఎరువులు, సేంద్రీయ ఎరువులు అని రెండు ప్రధానమైన రకాలున్నాయి.

  • రసాయన ఎరువులు: రసాయన ఎరువులను 3 రకాలుగా వర్గీకరించవచ్చును.
    • సూటి ఎరువులు: నత్రజని, భాస్వరం, పొటాషియం వంటి ఒకే రకం మూలకాన్ని పోషక పదార్ధంగా కలిగిన ఎరువులను 'సూటి ఎరువులు' అంటారు. ఉదా: అమ్మోనియం నైట్రేట్.
    • సంకీర్ణ ఎరువులు: రెండు లేదా అంతకన్నా ఎక్కువ పోషక పదార్ధాలున్న ఎరువులను 'సంకీర్ణ ఎరువులు' అంటారు. ఉదా: అమ్మోనియం ఫాస్ఫేట్.
    • మిశ్రమ ఎరువులు: ఒకటి కంటే ఎక్కువ సూటి ఎరువులు గాని, సంకీర్ణ ఎరువులు గాని కలిగి ఉన్న ఎరువులను 'మిశ్రమ ఎరువులు' అంటారు. ఉదా: 20:20:20, 17:17:17.
  • సేంద్రీయ ఎరువులు: సేంద్రీయ ఎరువులు 2 రకాలుగా వర్గీకరించవచ్చును.

ఎక్కువ పరిమాణాలలో వాడవలసిన ఎరువులు పోషక విలువలు తక్కువ అన్ని పోషక పదార్ధాలు తక్కువ పరిమాణాలలో అందజేస్తాయి. నేల భౌతిక గుణాలు (నేల ఆకృతి) అనగా నీరు ఇంకే స్వభావం, నీరు నిల్వ చేయు గుణం, మురుగు నీరు పారుదల, నేల ఉష్ణోగ్రత, గాలి ప్రసరణ మెరుగు పడతాయి. స్థూల సాంద్రత తగ్గుతుంది. (స్థూల, సూక్ష్మ రంధ్రాల మొత్తం పరిమాణం పెరగడం వల్ల) నేల కోతకు గురికాకుండా చేస్తుంది. మినరలైజేషన్ వల్ల – పోషకాల నిలవరింపు, పోషకాల సద్వినియోగం, సరఫరా, ధన అయాన్ మార్పిడి సామర్ద్యం అధికమవుతాయి. నేలలో వచ్చే రసాయనిక మార్పులను తట్టుకొనే సామర్ద్యం పెరుగుతుంది. అనేక జీవ రసాయనిక చర్యలకు మూలమయిన సూక్ష్మ జీవుల మనుగడకు స్థూల సేంద్రియ ఎరువులు అవసరం.

    • గాఢ సేంద్రీయ ఎరువులు:
"https://te.wikipedia.org/w/index.php?title=ఎరువు&oldid=2939982" నుండి వెలికితీశారు