సురేష్ కొండేటి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సురేష్‌ కొండేటి
జననం6 అక్టోబర్
వృత్తిజర్నలిస్ట్, డిస్ట్రిబ్యూటర్, నిర్మాత, నటుడు
క్రియాశీల సంవత్సరాలు1992 - ప్రస్తుతం

సురేష్‌ కొండేటి తెలుగు సినిమా జర్నలిస్ట్, డిస్ట్రిబ్యూటర్, నిర్మాత, నటుడు. ఆయన 2002లో ''సంతోషం'' సినీ వార పత్రికను స్థాపించాడు. సురేష్‌ కొండేటి మా ఎన్నికలు 2021లో ప్రకాష్ రాజ్ ప్యానల్ లో ఎగ్జిక్యూటివ్‌ కమిటీ మెంబర్‌గా పోటీ చేశాడు.[1]

జననం

[మార్చు]

సురేష్‌ కొండేటి అక్టోబర్ 6న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లా, పోడూరు మండలం, వేడంగిపాలెం గ్రామంలో జన్మించాడు.[2][3][4]

వృత్తి జీవితం

[మార్చు]

సురేష్ కొండేటి వార్త దినపత్రికలో సినిమా జర్నలిస్టుగా తన జీవితాన్ని ప్రారంభించి పలు వార్తా పత్రికల్లో పని చేశాడు. ఆయన 2002లో సంతోషం సినీ వార పత్రికను స్థాపించాడు.

సినీ జీవితం

[మార్చు]

సురేష్ కొండేటి 1992లో సినీ రంగంలోకి అడుగు పెట్టాడు. ఆయన 1995లో రాంబంటు సినిమాలో నటుడిగా, తరువాత మహేశ్వరీ ఫిలిమ్స్ పేరుతో డిస్ట్రిబ్యూషన్, ఎస్‌కె పిక్చర్ పేరుతో డిస్ట్రిబ్యూటర్‌గా, నిర్మాతగా వ్యవహరించాడు. ఆయన ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ (ఎఫ్.సి.ఎ) అధ్యక్షుడిగా ఉన్నాడు.[5]

కోడి రామకృష్ణ ఫిలిం అవార్డ్స్ 2023 కార్యక్రమంలో జ్ఞాపికను అందుకుంటూ
నిర్మాతగా
  1. ప్రేమిస్తే
  2. జర్నీ
  3. పిజ్జా [6]
  4. శంభో శంకర
  5. డా. సలీమ్‌
  6. లీసా
  7. మహేష్ (2013)
  8. ప్రేమించాలి (2014)
  9. మెట్రో (2017)
  10. జనతా హోటల్‌ (2018)
  11. లవ్ ఇన్ షాపింగ్ మాల్
  12. క్రేజీ
  13. ప్రేమలో పడితే
  14. రేణిగుంట
  15. రైడ్
నటుడిగా
  1. రాంబంటు (1995)
  2. దేవినేని [7][8]
  3. మిస్టర్ ప్రెగ్నెంట్
  4. ఎర్రచీర
  5. దళారి

ఇవీ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Namasthe Telangana (5 October 2021). "కలల సాకారం వైపు." Archived from the original on 6 October 2021. Retrieved 6 October 2021.
  2. Mana Telangana (6 October 2021). "దాసరిలాగా రాణించాలన్నదే నా కోరిక". Archived from the original on 6 October 2021. Retrieved 6 October 2021.
  3. Sakshi (14 January 2014). "మార్చిలో సునిల్‌తో సినిమా చేస్తా". Archived from the original on 6 October 2021. Retrieved 6 October 2021.
  4. Vaartha (6 October 2017). "అల్లు అరవింద్‌ నాకు ఆదర్శం: సురేష్‌ కొండేటి". Archived from the original on 6 October 2021. Retrieved 6 October 2021.
  5. TeluguOne (27 May 2019). "ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సురేష్ కొండేటి". Archived from the original on 6 October 2021. Retrieved 6 October 2021.
  6. The Times of India (15 January 2017). "Suresh Kondeti bags Pizza Telugu rights - Times of India" (in ఇంగ్లీష్). Archived from the original on 6 October 2021. Retrieved 6 October 2021.
  7. Andrajyothy (4 March 2021). "'రంగా' పాత్ర‌లో.. నా పూర్వ‌జ‌న్మ సుకృతం: సురేష్ కొండేటి". Archived from the original on 6 October 2021. Retrieved 6 October 2021.
  8. Deccan Chronicle (4 July 2019). "Suresh Kondeti's look as Vangaveeti Ranga!" (in ఇంగ్లీష్). Archived from the original on 6 October 2021. Retrieved 6 October 2021.