సుజీవ డి సిల్వా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సుజీవ డి సిల్వా
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
వెడ్డిక్కర రువాన్ సుజీవ డి సిల్వా
పుట్టిన తేదీ (1979-10-07) 1979 అక్టోబరు 7 (వయసు 45)
బీరువాల, శ్రీలంక
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుఎడమచేతి మీడియం-ఫాస్ట్
పాత్రబౌలర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 89)2002 జూలై 21 - బంగ్లాదేశ్ తో
చివరి టెస్టు2007 జూలై 11 - బంగ్లాదేశ్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్ట్ ఫస్ట్-క్లాస్ లిస్ట్ ఎ ట్వంటీ20
మ్యాచ్‌లు 3 113 73 17
చేసిన పరుగులు 10 935 162 6
బ్యాటింగు సగటు 10.00 8.50 6.48 6.00
100లు/50లు 0/0 0/0 0/0 0/0
అత్యుత్తమ స్కోరు 5* 47 21* 2*
వేసిన బంతులు 432 13,153 3,009 309
వికెట్లు 11 339 108 25
బౌలింగు సగటు 19.00 23.96 22.29 14.88
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 11 2 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 4/35 7/49 7/25 4/16
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– 38/– 14/– 4/–
మూలం: ESPNcricinfo, 2017 జనవరి 9

వెడ్డిక్కర రువాన్ సుజీవ డి సిల్వా, శ్రీలంక మాజీ క్రికెటర్. కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్, ఎడమచేతి మీడియం-ఫాస్ట్ బౌలర్ గా రాణించాడు.

జననం, విద్య

[మార్చు]

వెడ్డిక్కర రువాన్ సుజీవ డి సిల్వా 1979, అక్టోబరు 7న శ్రీలంకలోని బీరువాలలో జన్మించాడు. కలుతర విద్యాలయంలో చదివాడు.

దేశీయ క్రికెట్

[మార్చు]

2000లో ప్రీమియర్ అండర్-23 ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన రికార్డును బద్దలు కొట్టాడు, కానీ సెలెక్టర్లను ఆకర్షించడంలో విఫలమయ్యాడు. 2004 ఆగస్టు 17న 2004 ఎస్ఎల్సీ ట్వంటీ20 టోర్నమెంట్‌లో కొలంబో క్రికెట్ క్లబ్ తరపున తన ట్వంటీ20 క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు.[1]

అంతర్జాతీయ క్రికెట్

[మార్చు]

2002 జూలై 21న బంగ్లాదేశ్‌పై 89వ టెస్ట్ క్యాప్‌గా తన టెస్టు క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. 2007లో గాయపడిన చనక వెలగెదరకు కవర్‌గా స్క్వాడ్‌లోకి పిలవబడ్డాడు, కానీ మ్యాచ్ ఆడలేదు.[2]

మూలాలు

[మార్చు]
  1. "1st Round, Colombo, Aug 17 2004, Twenty-20 Tournament". ESPN Cricinfo. Retrieved 2023-08-17.
  2. "Sri Lanka call up Sujeewa de Silva". ESPNcricinfo. Retrieved 2023-08-17.

బాహ్య లింకులు

[మార్చు]