Jump to content

సీతాకాంత్ మహాపాత్ర

వికీపీడియా నుండి
సీతాకాంత్ మహాపాత్ర
Sri Mohapatra in 2015
జననం (1937-09-17) 1937 సెప్టెంబరు 17 (వయసు 87)
Mahanga, Cuttack, Odisha
జాతీయతభారతీయుడు
వృత్తిరచయియత,సాహిత్య విమర్శకుడు, ఉన్నతాధికారి
గుర్తించదగిన సేవలు
సబ్దర్ ఆకాశ్ (ఆకాశం యొక్క పదాలు) (1971)
సముద్ర (1977)

సీతాకాంత్ మహాపాత్ర (జననం సెప్టెంబరు 17, 1937) ప్రసిద్ధ భారతీయ కవి, సాహిత్య విమర్శకుడు. ఆయన ఒరియా భాషలోనే కాకుండా ఆంగ్ల భాషలో కూడా రచనలు చేసారు.[1][2] ఆయన 1961 నుండి 1995 వరకు ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసు (ఐ.ఎ.ఎస్) గా పనిచేసి పదవీ విరమణ చేసారు. ఆయన న్యూఢిల్లీ లోని నేషనల్ బుక్ ట్రస్ట్ కు చైర్మన్ గా కూడా పదవి నిర్వహిస్తున్నారు.

ఆయన 15 కవిత్వ సమాహారాలు, 5 వ్యాస సమాహారాలు, ఒక యాత్రా చరిత్ర, 30 ఆలోచనాత్మక రచనలు, యివికాకుండా అనేక అనువాదాలను ప్రచురించారు. ఆయన కవిత్వ సమాహారం వివిధ భారతీయ భాషలలో ప్రచురితమయ్యాయి. ఆయన ప్రసిద్ధ సాహితీ సేవలు "సబ్బర్ ఆకాశ్" (1971) (ఆకాశ పదాలు), "సముద్ర" (1977), "అనేక్ శరత్" (1981) [3][4][5]

ఆయనకు 1974 లో సాహిత్య అకాడమీ అవార్డు ఒరియా భాషలో తన "సబ్దర్ ఆకాశ్"కు వచ్చింది.[6] ఆయన భారతీయ సాహిత్యానికి చేసిన అపూర్వ సేవలకు జ్ఞానపీఠ అవార్డును పొందారు. ఆయనకు 2002 లో పద్మభూషణ , 2011 లో పద్మ విభూషణ అవార్డులు వచ్చాయి. అవే కాకుండా సోవియట్ లాండ్ నెహ్రూ అవార్డు, కబీర్ సమ్మాన్ , అనేక యితర ప్రతిష్ఠాత్మక అవార్డులు వచ్చాయి.[3]

ప్రారంభ జీవితం - విద్య

[మార్చు]

సీతాకాంత్ మహాపాత్ర ఒడిషాలోని మహానది యొక్క ఉపనది "చిత్రోత్పల" యొక్క ఒడ్డున గల మహంగ గ్రామంలో 1937 లో జన్మించారు.[7] ఆయన సాంప్రదాయ కుటుంబంలో ఒరియా భాషలో గల భగవద్గీత లోని అధ్యాయాన్ని వల్లె వేస్తూ పెరిగాడు. ఆయన కొరువా ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించిన తదుపరి కటక్ లోని "రేవెన్‌షా కాలేజి" (అప్పటికి ఉత్కల్ విశ్వవిద్యాలయ అనుబంధ కాలేజి) ని ఎంచుకున్నారు. అచట 1957 లో బి.ఎ హిస్టరీ ఆనర్స్ ను పూర్తి చేసారు. ఆ తరువాత 1959 లో అలహావాదు విశ్వవిద్యాలయం నుండి రాజనీతి శాస్త్రంలో ఎం.ఎ డిగ్రీని పూర్తిచేసారు. ఆ కాలంలో ఆయన విశ్వవిద్యాలయ జర్నల్ సంపాదకునిగా యున్నారు. అచట ఆయన ఆంగ్లము, ఒరియా భాషలలో రచనలను ప్రారంభించారు. కానీ తరువాత ఆయన తన స్థానిక భాషలోనే కవిత్వం వ్రాయాలని నిర్ణయించుకున్నాడు. " ఒక కవి తను కలలు కన్న భావాలను వ్యక్తీకరించడానికి స్వంత భాష అవసరం" అని ఆయన అభిప్రాయం. ఆయన పాండిత్య రచనలన్నీ ఆంగ్లంలో ఉన్నాయి.[5][8]

1969 లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుండి ఆయన డిప్ ఓవర్సీస్ డెవలప్ మెంటు అద్యయనం" చేసారు.[5][9]అదేవిధంగా 1988 లో హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోని ఆహర ఫౌండేషన్ ఫెలోషిప్ కార్యక్రంలో భాగంగా ఒక సంవత్సరం పాటు గడిపాడు.

అవార్డులు, గుర్తింపులు

[మార్చు]
  1. ఒరిస్సా సాహిత్య అకాడమీ అవార్డు - 1971, 1984
  1. సాహిత్య అకాడమీ అవార్డు - 1974
  2. సరాలా అవార్డు - 1985
  3. జ్ఞానపీఠ్ అవార్డు, భారతదేశపు అత్యున్నత సాహిత్య గౌరవం - 1993
  4. పద్మ భూషణ్ (భారతదేశపు మూడవ అత్యున్నత పౌర పురస్కారం) - 2003
  5. పద్మ విభూషణ్ (భారతదేశపు రెండవ అత్యున్నత పౌర పురస్కారం) - 2010
  6. సాహిత్య అకాడమీ ఫెలో - 2013
  7. సార్క్ సాహిత్య పురస్కారం - 2015
  8. ఠాగూర్ శాంతి అవార్డు - 2017

యితర పఠనాలు

[మార్చు]

యివి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Deceptive simplicity". The Hindu. 1 December 2002. Archived from the original on 6 జూన్ 2011. Retrieved 5 మార్చి 2015.
  2. Keki N. Daruwalla (25 September 1996). "The Mahapatra Muse: Two deeply vivid volumes of poems from the oriya masters". The Outlook.
  3. 3.0 3.1 Jnanpith, p. 18
  4. "Ayyappa Paniker commemoration today". Ebuzz – Indian Express News Service. 20 September 2009. Archived from the original on 28 మే 2012. Retrieved 5 మార్చి 2015.
  5. 5.0 5.1 5.2 "Unveiling of a poet". The Financial Express. 3 March 2002.
  6. Sahitya Akademi Award winners in Oriya Archived 2010-02-23 at the Wayback Machine Sahitya Akademi
  7. Jnanpith, p. 19
  8. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; u అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  9. Dr. Sitakant Mahapatra Archived 2010-02-20 at the Wayback Machine Mumbai MTNL

ఇతర లింకులు

[మార్చు]