చంద్రశేఖర కంబార
Chandrashekhara Kambara చంద్రశేఖర కంబార | |
---|---|
![]() Chandrashekhara Kambara during a talk about "Kannada in Technology" in a meeting in Bangalore | |
Born | Ghodageri, Hukkeri taluk, Belagavi district, Karnataka | 2 జనవరి 1937
Occupation | కవి,నాటక రచయిత, అధ్యాపకుడు |
Nationality | ఇండియా |
Alma mater | PhD from Karnatak University, Dharwad |
Period | 1956 – present |
Genre | కాల్పనిక సాహిత్యం |
Notable awards | జ్ఞానపీఠ పురస్కారం సాహిత్య అకాడమి అవార్డు పద్మశ్రీ పంప అవార్డు |
Spouse | Satyabhama |
Children | Rajashekhara Kambara, Jayashree Kambara, Geetha Sateesh, Channamma Kambar |
చంద్రశేఖర కంబార కన్నడ సాహిత్యంలో అత్యంత సాహిత్య కృషి సల్పిన వాడు పలు సాహిత్య ప్రక్రియలలో అందెవేసిన వాడు. కంబార ఒక కవి, నాటక రచయిత, సంగీత దర్శకుడు, చలనచిత్ర నిర్దేశకుడు, అధ్యాపకుడు, జానపదతజ్ఞ. ఆయనకు భారత ప్రభుత్వం 2021 లో పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది.
జననం-విద్యాభ్యాసం
[మార్చు]చంద్రశేఖర కంబార సా.శ.1937 జనవరి 2వ తారీఖున కర్నాటక రాజ్యంలోని బెళగాం జిల్లాలోని ఘోడిగేరి గ్రామంలో జన్మించాడు.తండ్రి పేరు బసవణ్నెప్ప కంబార, తల్లి పేరు చెన్నమ్మ.గోకాక్ లోని మున్సిపల్ ఉన్నతపాఠశాలలో విద్యాభ్యాసం జరిగింది.ఆతరువాత బెళగాం/బెళగావి లోని లింగరాజ కాలేజిలో బి.ఏ.చదివాడు,1962 లో కర్నాటక విశ్వ విద్యాలయంలో ఎం.ఎ, పి.ఎచ్డి (Phd) చేశాడు.
వృత్తిజీవనం-సాహిత్యం
[మార్చు]మొదట బెంగళూరు విద్యానిలయంలో అధ్యపకుడుగా పనిచేశాడు.తరువాత క్రమంలో కర్నాటక జానపద అకాడమీ అధ్యక్షునిగా, న్యూఢిల్లీరాష్ట్రీయ నాటకశాల నిర్దేశకునిగా 3సంవత్సరాలు పదవి బాధ్యతలు నిర్వర్తించాడు.హంపి లోని కన్నడ విశ్వ విద్యాలయంలో కులఫతిగా[2] చేసి పదవీ విరమణ చేసి, బెంగళూరూలోని బనశంకరిలో నివాసముంటున్నారు.తనగ్రామీణ జీవనం అనుగుణ్యమైన జానపదగేయసాహిత్యం, నాట్యం, నాటకాల పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టి వాటిసాహిత్య సంగ్రహణ, రచనలు చేశాడు.గోకాక్, బెళగావి, ధారవాడ ప్రాంత పరుష భాషను కన్నడ భాషకు దగ్గరచేసాడు.కంబార తాను వ్రాసిన అనేక నవలలను చలనచిత్రాలుగా తీసారు.వీటిలో కరిమాయి, సంగీతా, కాడు కుదురె ముఖ్యమైనవి.తాను తీసిన చిత్రాలకు తానే సంగీతం సమకూర్చాడు.కాడుకుదురె చిత్రంలో కాడు కుదురె ఒడిబందిత్తా...పాట పాడిన శివమొగ్గ సుబ్బన్నకు రాష్ట్రపతి ప్రశస్తి లభించింది.జీకె మాస్తరు ప్రణయ ప్రసంగ నవలను చిన్నతెర (టీవి) లో ధారావాహిక తీసారు.చాలా డాక్యుమెంటరి (సాక్ష్య) చిత్రాలను తీశారు.కుంబార స్వయంగా మంచిగాయకుడు, నాటకప్రియుడు.[3]
రచనలు
[మార్చు]- హేళతేన కేళ (ಹೇಳತೇನ ಕೇಳ)
- సిరిసంపిగె (ಸಿರಿಸಂಪಿಗೆ)
- బెళ్ళిమీను (ಬೆಳ್ಳಿಮೀನು)
- ఋష్యశృంగ (ಋಷ್ಯಶೃಂಗ)
- కాడు కుదురె (ಕಾಡುಕುದುರೆ)
- నాయికథె (ನಾಯಿಕಥೆ)
- హరకెయ కురి (ಹರಕೆಯ ಕುರಿ)
- బోళేశంకర (ಬೋಳೇಶಂಕರ)
- సింగారవ్వ మత్తు అరమనె (ಸಿಂಗಾರವ್ವ ಮತ್ತು ಅರಮನೆ)
పైన పెర్కొన్నవి అయన రచనలలో ప్రముఖమైనవి.మాహామాయి ఈమధ్యకాలంలో () వెలువడిన నాటకం.26 సంవత్సరంల దీర్ఘకాలం తరువాత 2006, డిసెంబరున పాఠకులముందుకువచ్చింది ಶಿಖರ ಸೂರ್ಯ అనే పెద్ద నవల.జానపద విశ్వకోశ (1985) అనే బృహత్ గ్రంథాన్ని కన్నడ భాషకు అందించాడు.కాంబార 22 నాటకాలను,8 కావ్య సంకలనాలను,4 నవలలను రచించారు.అంతియే కాకుండ చకోరి అనే మహాకావ్యాన్ని, జానపదం, రంగభూమి, సాహిత్యం, శిక్షణకు సంబంధించిన 14 పరిశోధన వ్యాసాలతో కన్నడ సాహిత్యాన్ని అభిషేకించాడు.
అలంకరించిన పదవులు
[మార్చు]- కర్నాటక అకాడెమి అధ్యక్షుడు
- న్యూఢిల్లి రాష్ట్రియ నాటకశాల నిర్దేశకుడు
- హంపి విశ్వవిద్యాలయపు మొదటి ఉపకులపతి
- కేంద్ర సాహిత్య అకాడెమి ఉపాద్యక్షుడు
పొందిన సన్మానాలు-ప్రశస్తులు
[మార్చు]
- 1991లో సిరి సంపిగె నాటకానికి కేంద్ర సాహిత్య అకాడమీ ప్రశస్తి
- 2001 లో పద్మశ్రీ
- 2004 లో కన్నడ విశ్వవిద్యాలయం నుండి నాడోజ ప్రశస్తి
- కేరళ నుండి కుమారన్ ఆశాన్ ప్రశస్తి
- మధ్య ప్రదేశ్ ప్రభుత్వం నుండి కాళిదాస్ సన్మాన్ ప్రశస్తి
- 1975 లో జోకుమార స్వామి నాటకానికి అత్యుత్తమ నారకంగా కమలాదేవి చట్టోపాధ్యాయ ప్రశస్తి
- శిఖర సూర్య కావ్యానికి ట్యాగోరు ప్రశస్తి
- 2002 లో కబీర్ స్న్మాన్ ప్రశస్తి
- 2004-2010 వరకు విధాన సభ సభ్యుడు
- 2010 లో జ్ఞానపీఠ అవార్డు ప్రదానం.జ్ఞానపీఠ పురస్కారం పొందిన 8 వ కన్నడిగుడు.
బయటి లింకులు
[మార్చు]
మూలాలు
[మార్చు]- ↑ Special Correspondent (20 September 2011). "Jnanpith for Kambar". The Hindu.
- ↑ పూర్ణప్రజ్ఞాభారతి (2011-10-28). "నా పాత్రలు - అనువాద కవిత". Pragnabharathy. Retrieved 2023-01-10.
- ↑ "ಕಂಬಾರ: ಕೇಂದ್ರ ಸಾಹಿತ್ಯ ಅಕಾಡೆಮಿ ಉಪಾಧ್ಯಕ್ಷ". Prajavani (in ఇంగ్లీష్). 2013-02-25. Retrieved 2023-01-10.
- Commons category link is on Wikidata
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with BNF identifiers
- జ్ఞానపీఠ అవార్డు గ్రహీతలు
- 1937 జననాలు
- పద్మశ్రీ పురస్కార గ్రహీతలు
- కర్ణాటక వ్యక్తులు
- రామాయణం అనువాదకులు