Jump to content

సి.ఎస్. శివల్లి

వికీపీడియా నుండి
సి.ఎస్. శివల్లి
సి.ఎస్. శివల్లి


కర్ణాటక మునిసిపాలిటీలు & స్థానిక సంస్థల శాఖ మంత్రి
పదవీ కాలం
2018 డిసెంబర్ 22 – 2019 మార్చి 22
ముందు ఈశ్వర ఖండ్రే
తరువాత ఎం.టి.బి. నాగరాజ్

పదవీ కాలం
2018 – 2019 మార్చి 22
తరువాత కుసుమ శివల్లి
నియోజకవర్గం కుంద్‌గోల్

వ్యక్తిగత వివరాలు

జననం (1962-05-06)1962 మే 6
శెలవాడి
మరణం 2019 మార్చి 22(2019-03-22) (వయసు 56)[1]
కర్ణాటక ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి కుసుమ శివల్లి
వృత్తి రాజకీయ నాయకుడు

చన్నబసప్ప సత్యప్ప శివల్లి (6 మే 1962 - 22 మార్చి 2019) కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కుంద్‌గోల్ శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లయి ఎమ్మెల్యేగా ఎన్నికై మునిసిపాలిటీలు, స్థానిక సంస్థల మంత్రిగా & పురపాలక శాఖ ఇంచార్జి మంత్రిగా పని చేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

శివల్లి భారతీయ జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి కుందగోల్ నియోజకవర్గం నుండి 1994 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు, ఆయనకు 1999లో కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 2004లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయి తిరిగి కాంగ్రెస్‌లో చేరి 2004లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయి 2013, 2018లో వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై కాంగ్రెస్-జనతాదళ్ (సెక్యులర్) కూటమి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా పురపాలక శాఖ మంత్రిగా నియమితులయ్యాడు.[2]

మరణం

[మార్చు]

సీ.ఎస్. శివల్లి ధార్వాడ్‌లోని భవనం కూలిన ప్రదేశంలో రెస్క్యూ ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తూ కొందరితో మాట్లాడుతుండగా గుండెపోటుతో కుప్పకూలిపోవడంతో హుబ్బళ్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ 2019 మార్చి 22న మరణించాడు.[3][4][5]

మూలాలు

[మార్చు]
  1. Karnataka minister C S Shivalli passes away
  2. "Kumaraswamy inducts 8 Ministers; 7 of them are from north Karnataka" (in Indian English). The Hindu. 22 December 2018. Archived from the original on 17 January 2025. Retrieved 17 January 2025.
  3. "Karnataka Minister Shivalli passes away" (in Indian English). The Hindu. 22 March 2019. Archived from the original on 19 January 2025. Retrieved 19 January 2025.
  4. "Karnataka minister CS Shivalli dies after cardiac arrest". 22 March 2019. Archived from the original on 19 January 2025. Retrieved 19 January 2025.
  5. "Karnataka minister CS Shivalli dies of heart attack". The Times of India. 22 March 2019. Archived from the original on 7 April 2019. Retrieved 19 January 2025.