Jump to content

సిసింద్రీ (సినిమా)

వికీపీడియా నుండి
సిసింద్రీ
దర్శకత్వంశివనాగేశ్వరరావు
రచనమరుధూరి రాజా (సంభాషణలు)
తారాగణంఅక్కినేని అఖిల్,
ఆమని,
శరత్ బాబు,
చలపతిరావు
సంగీతంరాజ్
నిర్మాణ
సంస్థ
భాషతెలుగు

సిసింద్రీ 1995 లో విడుదలైన తెలుగు సినిమా. ప్రముఖ తెలుగు నటుడు అక్కినేని నాగార్జున కుమారుడు అక్కినేని అఖిల్ ఈ చిత్రంలో బాల నటుడిగా నటించాడు. శివ నాగేశ్వరరావు దర్శకత్వం వహించాడు. గ్రేట్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో నాగార్జున అక్కినేని నిర్మించాడు.[1]

గిరిబాబు, తనికెళ్ళ భరణి, సుధాకర్, ఆమని, శరత్ బాబు, సుభలేఖ సుధాకర్ ఇతర నటులు. ఈ చిత్రంలో టబు, పూజా బాత్రా అతిథి పాత్రల్లో కనిపించారు. రాజ్ స్వరపరిచిన సంగీతం, రాజ్ కోటి ద్వయంగా కాకుండా అతడు ఒక్కడే సంగీత దర్శకత్వం చెయ్యడం ఇదే మొదలు. ఈ చిత్రం హాలీవుడ్ చిత్రం బేబీస్ డే అవుట్ (1994) యొక్క భారతీయ అనుసరణ. ఈ చిత్రాన్ని తమిళంలో చుట్టి కుజాంధాయ్ అనే పేరుతో అనువదించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతమైంది.

నటీనటులు

[మార్చు]

పాటలు

[మార్చు]
పాటల జాబితా
సం.పాటగాయనీ గాయకులుపాట నిడివి
1."ఆటాడుకుందామా"ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర5:11
2."హెల్లో పిల్లా"ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర, సురేష్ పీటర్స్5:18
3."చిన్ని తండ్రీ"స్వర్ణలత5:10
4."ఓరి నాయనో"మనో, మురళీధర్, కోట శ్రీనివాసరావు 
5."క్యా సీన్ హై"మనో, అనుపమ5:02
మొత్తం నిడివి:25:47

మూలాలు

[మార్చు]
  1. "Sisindri (1995) | Sisindri Movie | Sisindri Telugu Movie Cast & Crew, Release Date, Review, Photos, Videos". FilmiBeat (in ఇంగ్లీష్). Retrieved 2020-08-18.