Jump to content

సాళ్లు

వికీపీడియా నుండి
వరుసలుగా (సాళ్ళు) గా నాటిని ప్రత్తి మొక్కలు
సాళ్ల పద్ధతిలో మొలచిన వేరుశనగ మొక్కలు

పొలాలలో మొక్కకు మొక్కకు మధ్య ఉండవలసిన దూరం కొరకు ఒక క్రమ పద్ధతిలో నాటిన వరుస క్రమాన్ని సాళ్లు అంటారు. సాలు - ఏకవచనము, సాళ్లు .. బహువచనము.

సాళ్ల పద్ధతి ప్రకారం నాటిన మొక్కల మధ్య దూరం పొడవు, వెడల్పులు సమానంగా ఉంటాయి. మొక్కలు, పైర్లను సాళ్లలో నాటుట వలన అనేక ఉపయోగాలు ఉన్నాయి.

వరి, మొక్కజొన్న వంటి పైర్లను చాలా దగ్గర, దగ్గర నాటవలసి ఉంటుంది. సరైన వరుస క్రమంలో నాటని ఇటువంటి పైర్లలో అడుగు పెట్టడం చాలా కష్టం. అనేక కారణాల దృష్ట్యా పొలంలో నడువవలసి ఉంటుంది.

అనేక ఉపయోగాలున్న కారణంగా కొంచెం కష్టమైనప్పటికీ ఖర్చును భరించి, సమయాన్ని వెచ్చించి ప్రతి రైతు తన పొలంలో సాళ్ల పద్ధతిలో నాటేందుకు వీలున్న ప్రతి పంటను సాళ్ల పద్ధతిలో నాటుతున్నారు.

ఉపయోగాలు

[మార్చు]

ఒక వరుస క్రమంలో వరి వంటి పైర్లను నాటుట వలన కలుపును సులభంగా గుర్తించి కలుపును తీసివేయడానికి ఈ సాళ్ల విధానం ఉపయోగపడుతుంది.

ఎరువులు వేయడానికి పురుగుమందులు చల్లడానికి చిన్న చిన్న పైర్లలో ఈ సాళ్ల విధానం ఉపకరిస్తుంది. అంతేకాక పని సులభంగా తొందరగా పూర్తవుతుంది.

మామిడితోటల వంటి పెద్ద పెద్ద తోటలలో మొక్కకు మొక్కకు మధ్య సరైన దూరం ఉండుట వలన ట్రాక్టర్ వంటి యంత్రాలతో దున్నటానికి పురుగు మందులు చల్లడానికి ఉపకరించడమే కాక పని తొందరగా పూర్తవుతుంది.

ఈ పద్ధతిలో నాటిన పంటలు వేసిన ఎరువును వృద్ధా కాకుండా తొందరగా సమంగా స్వీకరిస్తాయి. ఎందువలన అంటే వాటిని వేసే వ్యక్తి ఈ సాళ్ల విధానం వలన ఆ మొక్కకు అందుబాటులో ఎరువును వేయగలుగుతాడు.

మొక్కలకు లేదా చెట్లకు నీరును సాళ్ల పద్ధతిలో పెట్టుట వలన మొక్కలకు అవసరమైనంత నీరును సులభంగా తొందరగా పారించగలుగుతారు.

"https://te.wikipedia.org/w/index.php?title=సాళ్లు&oldid=3428545" నుండి వెలికితీశారు