సాదా దోసె
Jump to navigation
Jump to search
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/1/15/%E0%B0%AE%E0%B0%BF%E0%B0%A8%E0%B0%AA_%E0%B0%85%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B2%E0%B1%81_%282%29.jpg/220px-%E0%B0%AE%E0%B0%BF%E0%B0%A8%E0%B0%AA_%E0%B0%85%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B2%E0%B1%81_%282%29.jpg)
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/e/e4/Sada_dosa.jpg/220px-Sada_dosa.jpg)
దోసెలలో అన్ని రకాలకు మూలమైనది సాదా దోసె (Plain dosa).
కావలసిన పదార్ధాలు
[మార్చు]- ఉప్పుడు బియ్యం - పావు కిలో
- మినప పప్పు - అరపావు కిలో
- మామూలు బియ్యం - గుప్పెడు
- వంటనూనె
- దోసెల పెనం
- అట్లకాడ
తయారుచేయు విధానం
[మార్చు]- బియ్యం, మినప పప్పు, ఉప్పుడు నూక లను విడివిడిగా నానబెట్టాలి.
- ఈ మూడింటిని విడిగా శుభ్రంగా కడగాలి. ఉప్పుడు బియ్యం కొంచెం నలిగాక, బియ్యం వేసి కాటుకలా రుబ్బాలి. మినుప పప్పును విడిగా రుబ్బాలి.
- మినప పిండి, బియ్యం పిండి కలిపి తగినంత ఉప్పు వేసి ఒక కళాయి గిన్నెలో సగం వరకు వచ్చేటట్లు తీసుకొని మూత పెట్టాలి. దీనిని దోసెల పిండి అంటారు. ఇది కనీసం ఎనిమిది గంటలైనా ఊరాలి.
- దోసెల పెనం పొయ్యి మీద వేసి బాగా కాలాక, కాస్త నూనె రాసి ఒక గరిటె దోసెల పిండి తీసుకొని పలచగా సమంగా పరచాలి. ఆ పైన చుట్టూ రెండు చెంచాలు నూనె వెయ్యాలి. 3-5 నిమిషాలు అయిన తర్వాత దోసెను అట్లకాడతో తిరగేసి, మళ్ళీ ఒక చెంచా నూనె వేసి రెండవ పక్కన కూడా బంగారు రంగు వచ్చేదాకా కాలనివ్వాలి.
చిట్కాలు
[మార్చు]- మినప పప్పు కన్నా బియ్యం, నూక నానడానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి వీటిని ముందు రోజు రాత్రి నాన బెట్టుకోవాలి.
- మినప పప్పు, బియ్యం, నూకలు చాలా మెత్తగా రుబ్బాలి. గరుకుతనం ఉండకూడదు.
- దోసెల పెనం మందంగా, మెరకగా పెద్దగా ఉండాలి. పెనం పల్లంగా ఉంటే మధ్యలో మందంగా వస్తాయి. పెనం పలచగా ఉంటే దోసె తొందరగా మాడిపోతుంది.
- నూనె వేసిన తర్వాత పూర్తిగా కాలకుండా తిరగవెయ్యడానికి ప్రయత్నిస్తే దోసె విరిగిపోతుంది.