నీర్ దోశ
మూలము | |
---|---|
మూలస్థానం | భారతదేశం |
ప్రదేశం లేదా రాష్ట్రం | తుళునాడు |
వంటకం వివరాలు | |
వడ్డించే విధానం | అల్పాహారం |
వడ్డించే ఉష్ణోగ్రత | వేడిగా |
ప్రధానపదార్థాలు | బియ్యం , ఉప్పు |
నీర్ దోశ (నీటి దోస), తుళు ప్రాంతంలో ప్రాచూర్యం పొందిన దోసె. బియ్యం పిండితో తయారుచేపే ఈ నీర్ దోశ తుళు నాడు ప్రాంతం నుండి వచ్చిన రుచికరమైనది, ఉడిపి - మంగుళూరు వంటకాలలో భాగంగా ఉంది.[1][2]
ఇతర దోశల మాదిరిగా కాకుండా నీర్ దోశ తయారీ పద్ధతి సులభంగా ఉండడం, కిణ్వ ప్రక్రియ లేకపోవడం వల్ల ఈ దోశ ప్రాచూర్యం పొందింది.[3] నీర్ దోశను కొబ్బరి పచ్చడి, సాంబార్, సగ్గు, చికెన్, మటన్, ఫిష్, గుడ్డు వంటి కూరలతో కలిపి వడ్డిస్తారు.[4]
పద వివరణ
[మార్చు]నీర్ అంటే తుళు భాషలో నీరు అని అర్థం.[2][5]
కావలసినవి
[మార్చు]నీర్ దోశ తయారీలో అనేక పద్ధతులు ఉన్నప్పటికీ, వాటన్నింటికీ నానబెట్టిన బియ్యం (లేదా బియ్యం పిండి), ఉప్పు అవసరం.[6]
తయారీ
[మార్చు]నీర్ దోశను తయారుచేయడానికి బియ్యాన్ని పులియబెట్టడం అవసరం లేదు. బియ్యాన్ని కనీసం 2 గంటలు నానబెట్టి, గ్రైండర్ లో వేసి మెత్తగా పిండిలాగా చెయ్యాలి. రుచి కోసం ఉప్పును కలుపుకోవాలి. అలా కలిపిన పిండిని దోశను తయారుచేయడానికి ఉపయోగిస్తారు.[7][8]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ S, Latha Maheswari (2015-10-03). So Tasty Healthy Low Calorie Vegetarian Cooking Book-2: Take care calorie by calorie DOSAS AND SOUTH INDIAN MOUTH WATERING VARIETIES. AB Publishing House. ISBN 9781517632694. Retrieved 24 March 2021.
- ↑ 2.0 2.1 "Mangalorean cuisine is anything but fishy!". Outlook. Retrieved 24 March 2021.
- ↑ "If you're craving for Mangalorean fare, Anupam's Coast II Coast, hits the spot". The Hindu. Retrieved 24 March 2021.
- ↑ "6 Dishes from Udupi Every South Indian Food Lover Must Try". NDTV. Retrieved 24 March 2021.
- ↑ "Neer Dosa Recipe". NDTV. Retrieved 24 March 2021.
- ↑ "How to Make Neer Dosa". NDTV. Retrieved 24 March 2021.
- ↑ Dalal, Tarla. South Indian Cooking. Sanjay & Co. ISBN 9788189491796. Retrieved 24 March 2021.
- ↑ "Neer Dosa". Manorama Online. Retrieved 24 March 2021.
బయటి లింకులు
[మార్చు]- Media related to Neer dosa at Wikimedia Commons