సహాయం:వికీపీడియాలో ప్రయాణం గురించి పరిచయం/2
పరిచయం
పేరుబరులు
పేజీల్లో వెతకడం
దారిమార్పులూ షార్టుకట్లూ
పనికొచ్చే లింకులు
సారాంశం
|
వికీపీడియా లోని పేజీలను పేరుబరులుగా విభజించారు. ప్రతీ పేరుబరి లోని (ప్రధాన పేరుబరిని మినహాయించి) పేజీకి ముందు ఒక ఆదిపదం ఉంటుంది. దాని తరువాత ఒక కోలను (:), ఆ తరువాత పేజీ పేరు ఉంటుంది. వికీపీడియాలో మీకు ఎదురయ్యే కొన్ని పేరుబరులు, వాటి వివరణ, ఉదాహరణలూ కింది పట్టికలో ఉన్నాయి, చూడండి:
"ప్రత్యేక" పేరుబరి మినహా మిగతా అన్ని పేరుబరులలోని ప్రతి పేజీకీ అనుబంధంగా చర్చ పేజీ ఉంటుంది. ఉదాహరణకు, మీరు అల్లూరి సీతారామరాజు వ్యాసాన్ని చర్చ:అల్లూరి సీతారామరాజు పేజీలో చర్చించవచ్చు. వికీపీడియా:తటస్థ దృక్కోణం పేజీ గురించిన చర్చ వికీపీడియా చర్చ:తటస్థ దృక్కోణం పేజీలో చెయ్యవచ్చు. పేజీలో పైన ఎడమ వైపున ఉన్న రెండు ట్యాబుల్లో ఒకదాన్ని ఎంచుకోవడం ద్వారా మామూలు పేజీ, చర్చ పేజీల మధ్య మారుతూ ఉండవచ్చు.
|