Jump to content

సరస వెంకటనారాయణ భట్టి

వికీపీడియా నుండి
సరస వెంకటనారాయణ భట్టి
సరస వెంకటనారాయణ భట్టి


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2023, జూలై 14
సూచించిన వారు డి.వై. చంద్రచూడ్
నియమించిన వారు ద్రౌపది ముర్ము

కేరళ హైకోర్టు 37వ ప్రధాన న్యాయమూర్తి
పదవీ కాలం
2023, జూన్ 1 – 2023, జూలై 13
సూచించిన వారు డి.వై. చంద్రచూడ్
నియమించిన వారు ద్రౌపది ముర్ము
ముందు ఎస్. మణికుమార్
తరువాత ఆశిష్ జితేంద్ర దేశాయ్

కేరళ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి
పదవీ కాలం
2023, ఏప్రిల్ 24 – 2023, మే 31
నియమించిన వారు ద్రౌపది ముర్ము

కేరళ హైకోర్టు న్యాయమూర్తి
పదవీ కాలం
2019, మార్చి 19 – 2023, ఏప్రిల్ 23
సూచించిన వారు రంజన్ గొగోయ్
నియమించిన వారు రామ్‌నాథ్ కోవింద్

పదవీ కాలం
2013, ఏప్రిల్ 12 – 2019, మార్చి 18
సూచించిన వారు పి. సదాశివం
నియమించిన వారు ప్రణబ్ ముఖర్జీ

వ్యక్తిగత వివరాలు

జననం (1962-05-06) 6 మే 1962 (age 62)
మదనపల్లె, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్
పూర్వ విద్యార్థి జగద్గురు రేణుకాచార్య కళాశాల, బెంగళూరు

సరస వెంకటనారాయణ భట్టి (జననం 6 మే 1962) భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి. ఆయన కేరళ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి. ఆయన కేరళ హైకోర్టు[1][2][3] తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా, కేరళ హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా కూడా పనిచేశాడు.

ప్రారంభ జీవితం, విద్య

[మార్చు]

భట్టి రామకృష్ణయ్య, అన్నపూర్ణమ్మ దంపతులకు ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరులోని మదనపల్లెలో జన్మించాడు. అతను ప్రాథమిక విద్య కోసం మదనపల్లెలోని గిరిరావు థియోసాఫికల్ హైస్కూల్‌లో చదివాడు, మదనపల్లెలోని బీసెంట్ థియోసాఫికల్ కాలేజీ నుండి వాణిజ్యంలో పట్టభద్రుడయ్యాడు. బెంగుళూరులోని జగద్గురు రేణుకాచార్య కళాశాల నుండి న్యాయశాస్త్రంలో పట్టా పొందాడు.

కెరీర్

[మార్చు]

భట్టి 1987, జనవరి 21న న్యాయవాదిగా చేరాడు. హైదరాబాద్‌లోని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రాక్టీస్ చేయడం ప్రారంభించాడు. తన ప్రాక్టీస్ సమయంలో, ఆయన హిందుస్తాన్ షిప్‌యార్డ్, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ బోర్డు, ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, భారత్ ఎలక్ట్రానిక్స్, BHPV, RSVP మొదలైన వాటికి స్టాండింగ్ కౌన్సిల్‌గా పనిచేశాడు. 2000–2003 కాలంలో ప్రత్యేక ప్రభుత్వ ప్లీడర్‌గా కూడా పనిచేశారు. 2013, ఏప్రిల్ 12న ఆయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా పదోన్నతి పొందాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు హైదరాబాద్‌లోని హైకోర్టు ఆఫ్ జ్యుడికేచర్ న్యాయమూర్తిగా 2014, జూన్ 1న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విభజన, అమరావతిలో స్థాపించబడే వరకు పనిచేశాడు. 2019, మార్చి 18 వరకు అమరావతిలో సేవలందించాడు. 2019, మార్చి 19న బదిలీ అయిన తర్వాత ఆయన కేరళ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా, కేరళ హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ ఛైర్మన్‌గా పనిచేస్తున్నాడు.[1][4][5][6] ఆయన 2023, ఏప్రిల్ 24న కేరళ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యాడు. ఆయన 2023, జూన్ 1న కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యాడు. ఆయన 2023, జూలై 14న భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యాడు.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Official". Retrieved 12 Mar 2022 – via Official website High Court of Kerala.
  2. "Justice Sarasa Venkatanarayana Bhatti transferred from Andhra Pradesh HC". 7 Mar 2019. Retrieved 12 Mar 2022 – via New Indian Express News.
  3. "Transfer order" (PDF). 5 Mar 2019. Retrieved 12 Mar 2022 – via Department of Justice.
  4. "Telangana, Andhra Pradesh to get separate High Courts". 27 Dec 2018. Retrieved 12 Mar 2022 – via Indian Express.
  5. "Official Website of High Court of AP". Retrieved 12 Mar 2022 – via Official Website.
  6. "Official Website of High Court Legal Service Committee". Retrieved 12 Mar 2022 – via Official Website.