సంత్ సేవాలాల్ జయింతి
సంత్ సేవాలాల్ జయంతి | |
---|---|
![]() సంత్ సేవాలాల్ మహారాజ్ జయింతి | |
జరుపుకొనేవారు | భారతదేశంలోని రాష్ట్రాలు |
ప్రాముఖ్యత | భారతదేశంలో గోర్ బంజారా సమాజ ప్రజల ఆధ్యాత్మిక ధర్మ గురువు సేవలకు గుర్తింపు. |
జరుపుకొనే రోజు | ఫిబ్రవరి15 |
వేడుకలు | ధర్మ గురువు జన్మ దినోత్సవం |
సంబంధిత పండుగ | ఐచ్ఛిక సేలవు దినం |
సంత్ సేవాలాల్ జయింతి ఫిబ్రవరి15 న ప్రతి ఏటా భారత దేశమంతటా గోర్ బంజారా సమాజ ప్రజలు సేవాలాల్ జయింతిని నిర్వహిస్తారు[1].ఆ రోజు బంజారా ఆరాధ్య దైవం ఆధ్యాత్మిక గురువు సంత్ సేవాలాల్ మహరాజ్ జన్మదినం.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సేలవు దినంగా ప్రకటించింది[2][3][4][5].
వేడుకలు
[మార్చు]సంత్ సేవాలాల్ మహారాజ్ జయింతి ఉత్సవాలను [6] దేశంలోని వివిధ రాష్ట్రాల్లో గోర్ బంజారా సమాజ ప్రజలు ఘనంగా జరుపుతారు. దేశంలోని గోర్ బంజారా సమాజానికి చెందిన తాండ పెద్దలు, నాయక్, నాయకులు, విద్యార్థులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు జయంతి రోజున సేవాలాల్ మహారాజ్ జండా ఎగురవేస్తారు. భోగ్ భండారో కార్యక్రమాలు చేసి చేసి విన్నపాలు (అర్ధాస్)చదివి నివాళులర్పించటం జరుగుతుంది.సంత్ సేవాలాల్ మహారాజ్ సమాధి పోహ్రాదేవి తీర్థ క్షేత్రం,నంగారా భవన్, బంజారా భవన్ హైదరాబాద్, సేవాగడ్ తదితర ప్రాంతాల్లో జయంతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.ఈ వేడుకల్లో బోగ్ భండారో కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించి విన్నపాలు చేస్తారు.ఆ యా రాష్ట్రాల రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తూ ప్రభుత్వ విద్యా సంస్థలకు సేలవు ప్రకటిస్తుంది. జయంతి పురస్కరించుకుని తాండలో ఆ రోజున మాంసాహారం ముట్టుకోరు[7][8][9][10].
284వ జయంతి
[మార్చు]సంత్ సేవాలాల్ మహారాజ్ 284 వ జయంతిని భారత ప్రభుత్వం తొలి సారిగా గోర్ బంజారా ప్రజల ఆధ్యాత్మిక ధర్మ గురువు, ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జయింతిని ఘనంగా నిర్వహించింది.భారత ప్రభుత్వం సంత్ సేవాలాల్ మహారాజ్ 284 వ జయంతి ఉత్సవాలను న్యూ డాక్టర్ అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ న్యూఢిల్లీ లో జరిగింది.భారత హోం మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలి సారిగా బంజారా సమాజం ప్రజల ఆధ్యాత్మిక గురువు సంత్ సేవాలాల్ మహారాజ్ జయింతిని ఏడాది పొడవునా స్మారకోత్సవాన్ని భారత ప్రభుత్వం సాంస్కృతిక మంత్రిత్వ శాఖ 284 వ జయంతి నిర్వహించింది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి హోం మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా, కేంద్ర సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి గౌరవ అతిథిగా, మహారాష్ట్ర ప్రభుత్వం ఆహార భద్రత జాషధ నిర్వహణ శాఖ మంత్రి సంజయ్ రాథోడ్ ఢిల్లీ మాజీ ఎమ్మెల్యే మంజీందర్ సింగ్, డాక్టర్ ఉమేష్ జాదవ్, ఎంపి కలబురగి కర్ణాటక , ఇల్ ఇండియా బంజారా సేవా సంఘం జాతీయ అధ్యక్షుడు శంకర్ పవార్ సంత్ సేవాలాల్ మహారాజ్ చారిటబుల్ ట్రస్ట్ న్యూఢిల్లీ ప్రెసిడెంట్ డాక్టర్ ఉమేష్ జాదవ్ మొదలగు ప్రముఖులు హాజరయ్యారు.
ఈ జయింతి వేడుకలకు దేశం నలుమూలల నుంచి బంజారా సమాజ ప్రజలు ఢిల్లీకి తరలించి వచ్చారు.కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక రైలు ఏర్పాటు చేసింది. దేశంలో వివిధ రాష్ట్రాల నుండి 2500 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో బంజారా సంస్కృతి సంప్రదాయాలు ఆచార వ్యవహారాలకు సంబంధించి బంజారా కళా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు . సంత్ సేవాలాల్ మహారాజ్ 1739 ఫిబ్రవరి 15 న జన్మించాడు. బంజారా సమాజం యొక్క సంఘ సంస్కర్త. బంజారా సమాజంలో ప్రబంగా ఉన్న అపోహలు,మూఢ నమ్మకాలను తొలగించి నిర్మూలించడానికి కృషి చేశారు. బంజారా సంచార జీవన విధానంలో సంస్కరణలు తీసుకొచ్చి సంచార జీవన నుంచి స్థిర నివాసం కోసం తాండ వ్యవస్థ మీద అవగాహన కల్పించి బంజారా ప్రజలు తాండలో నివాసం ఉండే విధంగా కృషి చేశాడు.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ telugu, NT News (2024-02-16). "ఘనంగా సేవాలాల్ జయంతి". www.ntnews.com. Retrieved 2025-01-16.
- ↑ "సేవాలాల్ జయంతి సందర్భంగా బంజారా ఉద్యోగులకు రేపు ప్రత్యేక సెలవు". ap7am.com. 2024-02-14. Retrieved 2025-01-17.
- ↑ telugu, NT News (2023-02-15). "నేడు సేవాలాల్ జయంతి వేడుకలు". www.ntnews.com. Retrieved 2025-01-17.
- ↑ "రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. రేపు ఆ ఉద్యోగులకు హాలిడే..!". Samayam Telugu. Retrieved 2025-01-16.
- ↑ "TS | రేపు సంత్ సేవాలాల్ జయంతి.. సెలవు ప్రకటించిన ప్రభుత్వం". Prabha News (in అమెరికన్ ఇంగ్లీష్). 2024-02-14. Archived from the original on 2025-01-16. Retrieved 2025-01-16.
- ↑ Aamani (2025-02-18). "సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి : కలెక్టర్ రాజర్షి షా". www.dishadaily.com. Retrieved 2025-02-18.
- ↑ Correspondent, Special (2018-02-14). "Sevalal Jayanti on Feb. 22". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2025-02-03.
- ↑ link, Get; Facebook; X; Pinterest; Email; Apps, Other. "Guru Sevalal Maharaj Jayanti of Banjara Community". Retrieved 2025-02-03.
{{cite web}}
:|last2=
has generic name (help) - ↑ "Sant Sevalal Jayanti 2023: Know history and teachings of the tribal leader". Zee Business (in ఇంగ్లీష్). 2023-02-15. Retrieved 2025-02-03.
- ↑ "నేడు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి - Voice Today News" (in అమెరికన్ ఇంగ్లీష్). 2024-02-14. Retrieved 2025-02-03.